వనమహోత్సవానికి మొక్కలు సిద్ధం
ABN, Publish Date - Jul 18 , 2025 | 12:29 AM
పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమతుల్యతను పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవంలో మొక్కలను నాట డా నికి అధికారులు సర్వం సిద్ధం చేశారు.
భువనగిరి రూరల్, జూలై 17(ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమతుల్యతను పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవంలో మొక్కలను నాట డా నికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. వర్షాభా వం కారణంగా కొద్దిగా ఆలస్యమైన అనుకున్న లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భువనగిరి మండలంలోని 34 గ్రామ పంచాయతీల పరిధిలో 1,12,200 మొక్కలు నాటాలనే లక్ష్యాన్ని ఎంచుకున్నారు. ఆసక్తి ఉన్నవారికి 7వేల పండ్ల మొ క్కలను సొంత స్థలంలో నాటితే పూర్తి రాయితీతో పాటు నిర్వహణకు డబ్బులు ఉపాధి హామీ పథకం కింద చెల్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఇంటింటికీ పంపిణీ ..
వనమహోత్సవంలో భాగంగా ప్రజలను భాగస్వా ములను చేయాలనే ప్రభుత్వ సూచన మేరకు అధికారులు ఇంటింటికీ పండ్లు, పూల నీడనిచ్చే మొక్కలను అందించేందుకు మండలంలో 40వేల మొక్కలను సిద్ధం చేశారు. ఇందులో ప్రత్యేకంగా పండ్ల తో టలను పెట్టుకునే వారికి పూర్తి సబ్సిడీపై రైతుల కోరిక మేరకు అందించేందుకు చర్యలు చేపట్టారు. ప్రతీ మొక్కకు మూడేళ్ల పాటు నిర్వహణకు ఒక్కో మొక్కకు రూ.40 ఉపాధి హామీ ద్వారా చెల్లించనున్నారు.
రహదారులు, ఖాళీ స్థలాల్లో ..
వనమహోత్సవంలో రహదారుల వెంట ఎవెన్యూ ప్లాంటెషన, ఖాళీ ప్రదేశాలు, పాఠశాలలు, ప్రభుత్వ స్థలాల్లో మొత్తం 47వేల మొక్కలను నాటేందుకు సిద్ధం చేశారు. మొక్కలు నాటడానికి అనువైన ప్రదేశాలను ఎంపిక చేసి ఇప్పటికే 40వేల పై చీలుకు గుంతలు తీశారు.
12వేల మొక్కలు నాటేందుకు ప్రణాళిక
మండలంలో 12వేల మొక్కలు నాటేందుకు ఉపాధి హామీ, ఉద్యానవన ,అటవీశాఖల ఆధ్వర్యంలో మొక్కలను నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. వర్షాభావ పరిస్థితుల్లో కొంత ఆలస్యమెనా వారం రోజుల్లోగా పెద్ద ఎత్తున మొక్కలను నాటేందుకు మండల స్థాయి అధికారుల పర్యవేక్షణలో పంచాయతీ కార్యదర్శులకు సూచనలు ఇచ్చాం. ప్రజలు ముందుకు వచ్చి వనమహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి.
-చిల్కూరి శ్రీనివాస్, ఎంపీడీవో భువనగిరి
Updated Date - Jul 18 , 2025 | 12:29 AM