పెంపుడు జంతువులకు టీకాలు వేయించాలి
ABN, Publish Date - Jul 07 , 2025 | 12:16 AM
పెంపుడు జంతువులకు టీకాలు వేయించి వాటి ఆరోగ్యంతోపాటు ఆరోగ్యం కూడా కాపాడుకోవాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక వెటర్నరీ ఆస్పత్రి ఆవరణలో పెం పుడు కుక్కలకు ఉచితంగా యాంటిరేబీస్ టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అదనపు కలెక్టర్ వీరారెడ్డి
భువనగిరి రూరల్, జూలై 6(ఆంధ్రజ్యోతి): పెంపుడు జంతువులకు టీకాలు వేయించి వాటి ఆరోగ్యంతోపాటు ఆరోగ్యం కూడా కాపాడుకోవాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక వెటర్నరీ ఆస్పత్రి ఆవరణలో పెం పుడు కుక్కలకు ఉచితంగా యాంటిరేబీస్ టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా వైద్య పశుసంవర్థక శాఖ అధికారి ఎన్.మోతీలాల్, ప్రాంతీయ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ గోపి మాట్లాడుతూ రేబిస్ నివారణకు మూడు మాసాలు దాటిన కుక్కలకు ఉచితంగా రేబిస్ టీకాలు వేయించాలన్నారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ భువనగిరి జోన్ డాగ్‌స్క్వాడ్‌తో గౌరవవందనం స్వీకరించారు.మొత్తం 98కుక్కలకు ఉచిత రేబిస్‌వ్యాధి నిరోధకటీకాలు వేశారు. కార్యక్రమంలో సహా య సంచాలకులు డాక్టర్ కె.శ్రీనివాస్, డాక్టర్ వి.కృష్ణ, పశుసంవర్థక వైద్యాధికారులు శ్రీకాంత్,రామచంద్రారెడ్డి, ఎన్.చంద్రారెడ్డి, డాక్టర్ సునీత, చైతన్య, ప్రత్యూష, గిరి, భాస్కర్, అనిల్‌రెడ్డి, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Jul 07 , 2025 | 12:16 AM