ఈటల రాజేందర్‌పై వ్యక్తిగత విమర్శలు తగదు
ABN, Publish Date - May 13 , 2025 | 12:17 AM
రామగిరి, మే 12 (ఆంధ్రజ్యోతి): కులవర్గ రాజకీయం కాకుండా, న్యాయం, అభివృద్ధి కోసం మాట్లాడుతున్న మల్కాజ్‌గిరి ఎంపీ, ఈటల రాజేందర్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం దురదృష్టకరమని బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి అన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి
మల్కాజ్‌గిరి ఎంపీ రాజేందర్‌పై కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ సోమవారం పట్టణంలోని సుభా్‌షచంద్రబోస్ విగ్రహం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈటెల రాజేందర్ చేసిన పోరాటం తెలంగాణ ప్రజలందరికీ తెలుసునని అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించలేక, ప్రజలకు సమాధానం ఇవ్వలేక ప్రతిపక్ష నాయకులపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. ఇది వారి అసహనం, భయాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. రాజేందర్‌పై జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు మధుసూదన్‌రెడ్డి, బీపంగి జగ్జీవన్‌రావు, పకీరు మోహన్‌రెడ్డి, పాలకూరి రవి, గడ్డం మహేష్, రావెళ్ల కాశమ్మ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 13 , 2025 | 12:17 AM