ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజలు సుఖశాంతులతో ఉండాలి

ABN, Publish Date - May 15 , 2025 | 12:23 AM

వర్షాలు బాగా కురుసి రైతులు అధిక దిగుబడులు సాఽధించి, ప్రజలు సిరి సంపదలు, సుఖ శాంతులతో ఉండాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేపడుతున్న ప్రతీ సంక్షేమ పథకం విజయవంతంగా కొనసాగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శ్రీరామచంద్రుడిని వేడుకున్నట్లు ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య తెలిపారు.

వంగపల్లిలో నూతన ధ్వజ స్తంభం వద్ద పూజలు నిర్వహిస్తున్న ప్రభుత్వ విప్‌ అయిలయ్య

ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట రూరల్‌, మే 14, (ఆంధ్రజ్యోతి): వర్షాలు బాగా కురుసి రైతులు అధిక దిగుబడులు సాఽధించి, ప్రజలు సిరి సంపదలు, సుఖ శాంతులతో ఉండాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేపడుతున్న ప్రతీ సంక్షేమ పథకం విజయవంతంగా కొనసాగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శ్రీరామచంద్రుడిని వేడుకున్నట్లు ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య తెలిపారు. బుధవారం మండలంలోని వంగపల్లి గ్రామంలో శ్రీరామ ఆలయంలో నూతన ధ్వజ స్తంభం ప్రతిష్టాపన, స్వామి వారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాతిక చింతన, భక్తి భావం పెంపొందించడం, యువత పెడదారి పట్టకుండా దైవ చింతన అలవర్చుకోవడానికి ఎంతో దోహదపడుతాయని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, ఆలయ కమిటీ నిర్వాహకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ప్రజలు భక్తిభావం పెంపొందించుకోవాలి: చిరుమర్తి

రామన్నపేట : ప్రజలందరూ భక్తిభావం పెంపొందించుకోవాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని గ్రామ దేవతలను వేడుకున్నట్లు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో గ్రామదేవతల కల్యాణ మహోత్సవం నిర్వహించారు. గ్రామ దేవతలను చిరుమర్తి దర్శించుకున్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేషం, మాజీ సర్పంచ ఎడ్ల మహేందర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సాల్వేరు అశోక్‌, పున్న వెంకటేశం, ఎండీ.అమేర్‌, జిల్లా నాయకులు కన్నెబోయిన బాలరాం, నాయకులు ఎడ్ల నరేందర్‌రెడ్డి, గ్రామశాఖ అధ్యక్ష కార్యదర్శులు పున్న వెంకటేశం, పిట్ట మహేందర్‌రెడ్డి, నాయకులు ఎడ్ల కృష్ణారెడ్డి, ఎడ్ల రామచంద్రారెడ్డి, వరికుప్పల బాబురావు, పర్ని మాధవరెడ్డి, ఎడ్ల శ్రీధర్‌రెడ్డి, సతీష్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2025 | 12:23 AM