పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి
ABN, Publish Date - May 01 , 2025 | 01:09 AM
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీటిని అందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
సంస్థాన్ నారాయణపురం, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీటిని అందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శివన్నగూడెంలో రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తిచేసి దాని ద్వారా రాచకొండ ఎత్తిపోతల పథకం చేపట్టి నారాయణపురం, చౌటుప్పల్ మండలాలతోపాటు రంగారెడ్డి జిల్లాకు సాగు, తాగునీటిని అందించాలన్నారు. మే 8వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మేడే ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి జిల్లా ప్రజలకు సాగు, తాగు నీటిని అందించడంలో గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఉమ్మడి జిల్లాకు మూడు వైపుల కృష్ణానది, గోదావరి, మూసీ లాంటి జీవనదులు ఉన్నా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రాజెక్టులను చిత్తశుద్ధితో పూర్తిచేసి సాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో సీపీఎం జిల్లా నాయకులు జి.శ్రీనివాసచారి, మండల కార్యదర్శి దోడ యాదిరెడ్డి, దోనూరు నర్సిరెడ్డి, సుర్కంటి శ్రీనివా్‌సరెడ్డి, తుమ్మల నర్సిరెడ్డి, చింతకాయల నర్సింహ, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 01 , 2025 | 01:09 AM