ఖనిజాల బ్లాకుల వేలంలో పాల్గొనండి
ABN, Publish Date - Apr 30 , 2025 | 01:01 AM
పారదర్శక వేలం ప్రక్రియ ద్వారా చిన్నతరహా ఖనిజాల క్వారీలను లీజుకు తీసుకొని ఖనిజరంగం అభివృద్ధిలో భాగం కావాలని రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ డిప్యూటీ డైరెక్టర్ బీ.గోవిందరాజు అన్నారు. గనులు, భూగర్భ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌లో చిన్నతరహా ఖనిజాల బ్లాకుల వేలంపై పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు, లీజుదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
లీజు వెంటనే కార్యకలాపాల నిర్వహణ
రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ డిప్యూటీ డైరెక్టర్ బీ.గోవిందరాజు
భువనగిరి (కలెక్టరేట్), ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): పారదర్శక వేలం ప్రక్రియ ద్వారా చిన్నతరహా ఖనిజాల క్వారీలను లీజుకు తీసుకొని ఖనిజరంగం అభివృద్ధిలో భాగం కావాలని రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ డిప్యూటీ డైరెక్టర్ బీ.గోవిందరాజు అన్నారు. గనులు, భూగర్భ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌లో చిన్నతరహా ఖనిజాల బ్లాకుల వేలంపై పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు, లీజుదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బీ.గోవిందరాజు మాట్లాడుతూ ప్రభుత్వ భూములలోని క్వారీల లీజుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు వేలంలో పాల్గొనాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 25 మైనర్ మినరల్ బ్లాకులకు వేలం జరుగుతుందని, వాటిలో బ్లాక్ గ్రానైట్, కలర్ గ్రానైట్, బిల్డింగ్ స్టోన్, రోడ్ మెటల్ ఉం టాయన్నారు. యాజమాన్య, భాగస్వామ్య సంస్థలు, కంపెనీల చట్టం కింద అనుమతి పొందిన కంపెనీలు, రాష్ట్ర సహకార సంఘాల చట్టానికి లోబడిన సహకార సంఘాలు వేలంలో పాల్గొనడానికి అర్హులన్నారు. వేలంలో పాల్గొనాలనుకునే ఔత్సాహికులు మే 2వ తేదీ లోగా బిడ్‌లను సమర్పించాలని, మే 5వ తేదీ బిడ్ పరిశీలించి మే 9వ తేదీన సాంకేతిక అర్హతను ప్రకటిస్తామన్నారు. ఇతర సందేహాలకు ఏడీఎంఅండ్‌జీఎస్ స్వామి కృష్ణాజీరావు సెల్:9866633414, అసిస్టెంట్ జియాలజిస్టు ఎన్.భరణి సెల్:9949222359 నెంబర్లను సంప్రదించాలన్నారు. అవగాహన సదస్సులో మైన్స్ ఏడీ కే.రాఘవరెడ్డి, ముకుంద్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Apr 30 , 2025 | 01:01 AM