ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్‌కు బుద్ధి చెప్పాలి

ABN, Publish Date - Apr 24 , 2025 | 12:23 AM

దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌కు కేంద్ర ప్రభుత్వం బుద్ధి చెప్పాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్‌గౌడ్‌ అన్నారు. జమ్మూకాశ్మీర్‌ పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి నివాళిగా బుధవారం రాత్రి భువనగిరిలో బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ఆయన మాట్లాడారు.

బీజేపీ జిల్లా అధ్యక్షుడు అశోక్‌గౌడ్‌

భువనగిరి టౌన్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యో తి): దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌కు కేంద్ర ప్రభుత్వం బుద్ధి చెప్పాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్‌గౌడ్‌ అన్నారు. జమ్మూకాశ్మీర్‌ పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి నివాళిగా బుధవారం రాత్రి భువనగిరిలో బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఇప్పటికైనా కుహనా సెక్యులర్‌ వాదులు కళ్లు తెరిచి నిజమైన టెర్రరిస్టులను గుర్తించాలన్నారు. మృతులకు నివాళులు అర్పించి పాకిస్తాన్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాశం భాస్కర్‌, పట్టణ అధ్యక్షుడు రత్నపురం బలరాం, మునిసిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ మాయ దశరథ, చందా మహేందర్‌గుప్త, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పట్నం కపిల్‌, కె.మల్లిఖార్జున్‌, బూరుగు మణికంఠ, మంగు నర్సింహారావు, భట్టు క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.

పహల్‌గామ్‌ దాడి హేయమైన చర్య : కాంగ్రెస్‌

పహల్‌గామ్‌ దాడి హేయమైన చర్య అని మునిసిపల్‌ మాజీ చైర్మన్లు పోతంశెట్టి వెంకటేశ్వర్లు, బర్రె జహంగీర్‌ అన్నారు. దాడిని నిరసిస్తూ బుధవారం రాత్రి భువనగిరిలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో వారు మాట్లాడారు. ఉగ్రవాదాన్ని నియంత్రించాలని, బాధితుల కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు. మృతులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు పిట్టల బాల్‌రాజ్‌, సామల రవీందర్‌, చప్పిడి శిరీష, గుర్రాల శ్రీనివాస్‌, తాడూరి నర్సింహ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2025 | 12:23 AM