పైసలిస్తేనే పనులు!
ABN, Publish Date - Jun 24 , 2025 | 12:34 AM
మఠంపల్లి మండలంలోని వ్యవయాధికారుల తీరుతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఏ అధికారినైనా పని నిమిత్తం కాలవాలంటే పైసలు వదుల్చుకోవాల్సిందేనని రైతులు వాపోతున్నా రు.
మఠంపల్లి మండలంలోని వ్యవయాధికారుల తీరుతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఏ అధికారినైనా పని నిమిత్తం కాలవాలంటే పైసలు వదుల్చుకోవాల్సిందేనని రైతులు వాపోతున్నా రు. పంట నమోదు మొదలు,రైతు బీమా వరకు డబ్బులు వసూలు చేస్తున్నా పట్టించుకునే వారే లేరు. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీంతో ఆగ్రహించిన రైతులు సోమవారం కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.
- (ఆంధ్రజ్యోతి-మఠంపల్లి)
వ్యవసాయ రంగానికి పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేయాల్సిన అధికారులే సక్రమంగా విఽధులకు రాకపోవడం, కిందిస్థాయి అధికారులు కార్యాలయానికి వస్తున్నా రైతులకు అవగాహన కల్పించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు ప్రభుత్వ పథకాలు పొందాలంటే కిందిస్థాయి అధికారులకు ముడుపులు చెల్లించాల్సి వస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. మఠంపల్లి మండలంలో ఏవో శ్రీనివా్‌సతో పాటు నలుగురు ఏఈవోలు పనిచేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఏఈవోలు రైతులకు సేవలు అందించాల్సి ఉండగా, వారి పనితీరును ఏవో పర్యవేక్షించాల్సి ఉంది. అయితే ఏవో కార్యాలయానికి వారం రోజులకోసారి వస్తుండటం, వచ్చినా గంటా, రెండు గం టలకు మించి ఉండకపోవడంతో ఏఈవోలదే ఇష్టారాజ్యమైందన్న ఆరోపణలున్నాయి. దీంతో రైతుల నుంచి ప్రతి పనికీ నేరుగాకాకుండా ఇతరులతో ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కాదని ఎవరైనా ప్రశ్నిస్తే కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారు.
రూ.50 పెసర, జిలుగ సంచీ రూ.500లకు..
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించే పలురకాల సంక్షేమ పథకాలతో పాటు సబ్సిడీపై విత్తనాలను కూడా అందిస్తోంది. అందులో జిలుగ, పెసర విత్తనాలను సబ్సిడీపై 10 కిలోల సంచిని రూ.50లకు రైతులకు అందించాల్సి ఉంది. అయి తే ఈసంచిలను పొందేందుకు ముందుగా రైతు లు ఏఈవోల రశీదు తీసుకోవాల్సి ఉంటుం ది. ఈరశీదు తీసుకుని పీఏసీఎస్ గోదాంలకు వెళితే అక్కడి రైతులకు విత్తనాలు అందజేస్తుంటారు. అయితే ఏఈవోలో రూ.50 రశీదులిస్తూనే.. గోదాం వద్ద వారి పేరుతో అనధికారికంగా రూ.450 వసూలు చేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే విత్తనాలు లేవని, వచ్చినప్పుడు చెప్తామంటూ తిప్పించుకుంటున్నారు.
లాగిన్లు సైతం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి
ప్రతీ సీజనలో రైతుల పంట సాగు వివరాలను ఏఈవోలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఆనలైనలో నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే మఠంపల్లి మండల ఏఈవోలు క్షేత్రస్థాయిలో పర్యటించకుండా స్థానిక మీసేవా, ఇంటర్నెట్ సెంటర్ల వారికి తమ ఆనలైన లాగిన నెంబర్లు, పాస్‌వర్డ్‌లు అందజేస్తున్నారు. రైతులు వారి వద్దకు వెళ్లి పంట వివరాలు నమోదు చేసుకోవాల్సి వస్తోంది. అందుకోసం డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. ఉచితంగా పొందాల్సిన సేవలు సైతం డబ్బులు ముట్టజెప్పాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. దీనికి తోడు ఇటీవల రైతు బీమా కింద మంజూరైన చెక్కును అందజేసేందుకు రూ.30 వేలు లంచం అడిగినట్లు సమాచారం. సదరు రైతు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో వెంటనే ఇచ్చినట్లు తెలుస్తోంది. అదేవిధంగా మట్టినమూనాలకు రూ.1500 వరకు వసూలు చేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయాధికారుల పనితీరుపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో వివరణ కోరేందుకు ఏవో శ్రీనివా్‌సకు ఫోన చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు.
Updated Date - Jun 24 , 2025 | 12:34 AM