ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బియ్యపు గింజలపై ‘ఓం నమో నరసింహాయ నమః’

ABN, Publish Date - May 10 , 2025 | 12:08 AM

మిర్యాలగూడ అర్బన్‌, మే 9 (ఆంధ్రజ్యోతి): తన ఇష్టదైవం నరసింహస్వామిని తలుచు కుంటూ ఓ భక్తురాలు ‘ఓం నమో నరసింహాయ నమః’ అనే జప మంత్రాన్ని బియ్యం గింజలపై లిఖిస్తోంది.

మిర్యాలగూడకు చెందిన భక్తురాలి ప్రతిభ

మిర్యాలగూడ అర్బన్‌, మే 9 (ఆంధ్రజ్యోతి): తన ఇష్టదైవం నరసింహస్వామిని తలుచు కుంటూ ఓ భక్తురాలు ‘ఓం నమో నరసింహాయ నమః’ అనే జప మంత్రాన్ని బియ్యం గింజలపై లిఖిస్తోంది. మిర్యాలగూడ పట్టణం గుంటూరు శ్రీనివా్‌స, లక్ష్మి దంపతుల కుమార్తె గేయవర్షిణి తనకున్న సూక్ష్మచేతిరాత ప్రావీణ్యానికి భక్తి పారవశ్యం జోడించి 77రోజుల కఠోర దీక్షతో స్వామివారి జపమంత్రాన్ని భక్తిశ్రద్ధలతో రాస్తోంది. ఈ నెల 11న సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి తలంబ్రాలుగా సమర్పించేందుకు 32,116 బియ్యం గింజలపై

13 అక్షరాలతో జప మంత్రాన్ని లిఖిస్తోంది. సాధారణ జెల్‌ పెన్నుతో స్వామివారి నామాన్ని బియ్యం గింజలపై లిఖించే ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు గేయవర్షిణి తెలిపారు. 2005లో గేయవర్షిణి తండ్రి శ్రీనివాస్‌ బియ్యం గింజలపై సూక్ష్మఅక్షరాలు రాసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. తాను సాధించలేని లక్ష్యాన్ని తన కుమార్తెతో పూర్తిచేయడంతో శ్రీనివాస్‌ ఆనందం వ్యక్తం చేశారు.

ఇంటర్మీడియట్‌ పూర్తిచేసిన గేయవర్షిని సూక్ష్మచేతిరాతపై ఆసక్తి పెంచుకుని తొలిప్రయత్నంలోనే జగిత్యాల జిల్లా ధర్మపురి నరసింహ ఆలయంలో ‘శ్రీ నరసింహ’ అనే ఆరు అక్షరాలను 12,116 బియ్యం గింజలపై లిఖించి తలంబ్రాలుగా స్వామివారికి సమర్పించారు. ఆమెలోని ప్రతిభను గుర్తించిన బహుజన సాహిత్య అకాడమీ అంతర్జాతీయ మైక్రో హ్యాండ్‌ రైటింగ్‌ అవార్డుకు గేయవర్షిణిని ఎంపిక చేయడంతో 2024 డిసెంబర్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేతులమీదుగా

ఢిల్లీలోని శాస్త్రీ భవన్‌లో అవార్డు అందుకున్నారు. గత ఏడాది వాడపల్లి నర్సింహస్వామి ఆలయానికి 12,116 బియ్యం గింజలపై స్వామివారి నామాన్ని లిఖించి తలంబ్రాలుగా సమర్పించింది. తాజాగా మట్టపల్లి ఆలయంలో జరిగే లక్ష్మీనృసింహుడి కల్యాణ మహోత్సవానికి స్వామివారి నామాన్ని రచించిన 32,116 బియ్యం గింజలను తలంబ్రాలుగా అందజేసేందుకు మౌనదీక్షతో భక్తి కార్యాచరణ పూర్తిచేస్తున్నట్లు గేయవర్షిణి తెలిపారు.

Updated Date - May 10 , 2025 | 12:08 AM