ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కేజీబీవీల్లో.. కొత్త మెనూ

ABN, Publish Date - Jul 07 , 2025 | 12:11 AM

రాష్ట్ర ప్రభుత్వం కస్తూర్బాగాంధీ బాలికల వి ద్యాలయాలపై ప్రత్యేక దృష్టి సారించింది. మౌలి క వసతుల కల్పనకు అవసరమైన నిధులు మం జూరు చేసిన ప్రభుత్వం తాజాగా నూతన మె నూ అమలు చేయాలని ఆదేశించింది.

కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో కొత్త మెనూ ప్రకారం ఆహార పదార్థాలు

(ఆంధ్రజ్యోతి,భూదాన్‌పోచంపల్లి) : రాష్ట్ర ప్రభుత్వం కస్తూర్బాగాంధీ బాలికల వి ద్యాలయాలపై ప్రత్యేక దృష్టి సారించింది. మౌలి క వసతుల కల్పనకు అవసరమైన నిధులు మం జూరు చేసిన ప్రభుత్వం తాజాగా నూతన మె నూ అమలు చేయాలని ఆదేశించింది. నెలలో రెండుసార్లు మాంసాహారంతోపాటు వారంలో ఐదుసార్లు గుడ్లు, రోజూ నెయ్యి అందిస్తున్నారు. నూతన మెనూ పకడ్బందీగా అమలు చేయాల ని ప్రభుత్వ ఆదేశించింది. జిల్లాలో 11 కేజీబీవీలున్నాయి. 2025-26 విద్యా సంవత్సరంలో సరికొత్త రుచులతో వంటకాలు చేయాలని ప్రభుత్వం మెస్‌ చార్జీలను పెంచింది. గతంలో ఒక్కో విద్యార్థికి నెలకు మెస్‌చార్జీలు రూ.1225 ఉండగా ఇప్పుడు రూ. 1740కి పెంచింది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో రూపొందించిన కొత్త మెనూను అమలు చేయడం ఆరంభించింది. దీని అమలుకు కార్యాచరణ కూ డా సిద్ధం చేసింది. అయితే దీన్ని అమలు చేయడానికి అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు తరుచూ పర్యవేక్షిస్తేనే ఈ మెనూ సక్రమంగా అమలయ్యే అవకాశం ఉంది.

కొత్త మెనూ ప్రకారం..

ఉదయం అల్పాహారం: టమాటా, కిచిడీ, రాగిజావ,ఇడ్లీ సాంబారు, పాలు, పూరీ, పులిహోర,బోండా, ఉప్మా, చపాతీ, అరటిపండ్లు.

మధ్యాహ్నం: అన్నంతోపాటు టమాటా పప్పు, నెయ్యి,రసం,పెరుగు,బాయిల్డ్‌ ఎగ్‌, చికెన్‌, మటన్‌.

సాయంత్రం: ఉడికించిన పెసర్లు, శనగలు, ఎగ్‌బజ్జీ, బెల్లం-పల్లీలు, అల్లం టీ, మిల్లెట్‌ బిస్కట్‌లు, పకోడి. రాత్రి : అన్నంతోపాటు వివిధరకాల కూరలు,సాంబార్‌, బటర్‌ మిల్కు.

కొత్త మెనూ పక్కాగా అమలు చేస్తాం : ప్రభాకర్‌, ఎంఈవో, భూదాన్‌పోచంపల్లి

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కొత్త మెనూ పక్కాగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటాం. కేజీబీవీల్లో విద్యార్థినులకు ఏరోజు ఎంత ఇవ్వాలనేది మెనూ నోటీస్‌ బోర్డు ద్వారా వివరిస్తాం. చదువుతోపాటు బాధ్యతగా పౌష్ఠికాహారం అందేలా చూస్తాం, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరుపుతాం.

జిల్లా వివరాలు..

జిల్లాలోని మండలాలు : 17. కాలేజీలు : 6

కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు : 11

Updated Date - Jul 07 , 2025 | 12:11 AM