పోచంపల్లి టూరిజం పార్కుకు కొత్త సొబగులు
ABN, Publish Date - May 12 , 2025 | 12:26 AM
భూదానపోచంపల్లి, మే 11, (ఆంధ్రజ్యోతి) : మిస్ వరల్డ్ -2025 పోటీల్లో భాగంగా ఈనెల 15న భూదానపోచంపల్లిని మిస్‌వరల్డ్ పోటీదారులు సందర్శించనున్నారు.
ఆంఽధ్రజ్యోతి ఎఫెక్ట్
ఈ నేపథ్యంలో భూదానపోచంపల్లి పట్టణంలోని గ్రామీణ పర్యాటక కేంద్రంలోని మ్యూజియం తోపాటు, ఆవరణలో ప్రపంచ అందగత్తెలు ఆహ్లాదకరమైన వాతావరణం ఆస్వాదించేందుకు వారికి తగిన ఏర్పాట్లు చేయలేదని ‘ఆంధ్రజ్యోతి’లో ఈనెల 10న ‘సుందరీకరణ పనులేవీ?’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీంతో అధికారులు స్పందించి వెంటనే పనులు ప్రారంభించారు. ఈమేరకు శనివారం నుంచి భూదానపోచంపల్లిలోని టూరిజం పార్కును అధికారులు ప్రత్యేకంగా ముస్తాబు చేస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే 116 దేశాలకు చెందిన సుందరీమణులను బృందాలుగా విభజించి తెలంగాణలో ప్రసిద్ధి చెం దిన వారసత్వ ప్రదేశాలు, దేవాలయాలు, ప్రముఖ పర్యాటక కేంద్రాలను సందర్శించే విధంగా అధికారులు రూట్ మ్యాప్ తయారు చేశారు. అందులో భాగంగా ఈనెల 15న సాయంత్రం 6 గంటలకు సుమారు 40 దేశాలకు చెందిన అందాల భామలు పోచంపల్లి సందర్శిస్తారు. ఈనేపథ్యంలో టూరిజం పార్కులోని ఇంటిరీయల్‌పాటు బయటి ప్రాంగణం అంతా రంగులు వేస్తూ సుందరీకరణ చేస్తున్నారు. రూరల్ టూరిజం మ్యూజియం, హ్యాంపీ థియేటర్, గెస్ట్ రూమ్‌లను అందంగా అలంకరిస్తున్నారు. ఆవరణ ఆకట్టుకునే విధంగా ముగ్గులు, రంగులతో అలంకరణ చేస్తున్నారు.
చేనేత సంస్కృతి ఉట్టిపడేలా..
ప్రపంచ సుందరీమణులకు ‘చేనేత థీమ్’ ప్రతిబింబించేలా అధికారులు కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. పది రోజుల క్రితం అప్పటి పర్యాటక శాఖ డైరెక్టర్ స్మిత సబర్వాల్ పోచంపల్లి టూరిజం పార్కును సందర్శించి అధికారులకు, ఈవెంట్ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఇందుకనుగుణంగా చేనేత మ్యూజియంలోని గోడలకు పోచంపల్లి ఇక్కత, సిద్దిపేట గొల్లభామ, నారాయణపేట, గద్వాల వసా్త్రలను అలంకరించనున్నారు. అంతేగాక టూరిజం ప్రాంగణంలో ఆయా చేనేత వసా్త్రల తయారీ విధానాలను ‘లైవ్ డెమో’తోపాటు చేనేత వసా్త్రల ఎగ్జిబిషన స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. స్థానిక మహిళలతో అందాల భామలకు సంప్రదాయంగా ఘనస్వాగతం పలికేలా ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. హ్యాంపి థియేటర్ వద్ధ నిర్వహి ంచే చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమానికి కనీసం 300 మంది స్థానికులు కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
రెండు గంటల పాటు కార్యక్రమాలు
ఈనెల 15న ఉదయం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారిని మిస్‌వరల్డ్ పోటీ దారులు దర్శించుకోనున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు సందర్శించి రాత్రి 8 గంటల వరకు కార్యక్రమాలను నిర్వహించేందుకు అధికారులు కార్యక్రమాలు రూపొందించారు. భూదానపోచంపల్లిలో టూరిజం శాఖ బస్సులను నడిపి రోడ్డు మార్గం ఎలా ఉందో ట్రయల్ రన నిర్వహిస్తారు.
పోచంపల్లి బ్రాండ్ ఇమేజ్ పెరగనుంది
పోచంపల్లి చేనేత టైఅండ్‌డై ఇక్కత పట్టు చీరలకు పుట్టినిల్లుగా పోచంపల్లికి పేరొంది. ఇక్కడ తయారయ్యే ఇక్కత వసా్త్రలు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఇమేజ్‌ను పెంచేందుకు ప్రపంచ సుందరీమణుల సందర్శన దోహదపడుతుంది. పోచంపల్లి ఇక్కత పట్టు వసా్త్రలు జాతీయ స్థాయిలోనే కాకు ండా దేశ విదేవాల్లో మంచి ప్రాచుర్యం పొందనున్నాయి. పోచంపల్లి బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు సుందరీమణులు ఇక్కడ చేనేత థీమ్‌ను ఫలప్రదం చేయాలని కోరుకుంటున్నాము.
తడక వెంకటేష్, రాష్ట్ర చేనేత నాయకులు, భూదానపోచంపల్లి
Updated Date - May 12 , 2025 | 12:26 AM