బీఆర్‌ఎస్ హయాంలో కాల్వలపై నిర్లక్ష్యం
ABN, Publish Date - Jul 17 , 2025 | 12:27 AM
బునాదిగాని, ధర్మారెడ్డిపల్లి, పిలాయిపల్లి సాగునీటి కాల్వలు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్లక్ష్యానికి గురయ్యాయని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని గోకారం గ్రామపరిధిలోని ధర్మారెడ్డిపల్లి కాల్వ నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
వలిగొండ, జూలై 16 (ఆంధ్రజ్యోతి): బునాదిగాని, ధర్మారెడ్డిపల్లి, పిలాయిపల్లి సాగునీటి కాల్వలు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్లక్ష్యానికి గురయ్యాయని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని గోకారం గ్రామపరిధిలోని ధర్మారెడ్డిపల్లి కాల్వ నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో చిన్ననీటి కాల్వల మరమ్మతులను మరిచారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఓర్వలేకపోతూ సీఎంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ధర్మారెడ్డిపల్లి కాల్వ నిర్మాణం పూర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. కాల్వ నిర్మాణంలో భూ సేకరణ పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ధర్మారెడ్డిపల్లి కాల్వకు రైతులు ప్రజాప్రతినిధుల సహకారంతో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
మోటార్ బైక్‌పై కాల్వ పనుల పరిశీలన
గోకారం చెరువు నుంచి ధర్మారెడ్డిపల్లి పనుల ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి మోటార్ బైక్‌పై వెళ్లి పరిశీలించారు. ఎక్స్‌కవేటర్ ఆపరేటర్‌తో పనులను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బీమా నాయక్, మాజీ ఎంపీపీ నూతి రమే్‌షరాజు, చిట్టెడి జనార్థన్‌రెడ్డి, చౌటుప్పల్ ఆర్టీవో శేఖర్‌రెడ్డి, ఇరిగేషన్ అధికారులు మనోహర్, కృష్ణారెడ్డి తహసీల్దార్ దశరథ, విద్యుత్ అధికారి మల్లిఖార్జున్, నాయకులు పాశం సత్తిరెడ్డి, కంకల కిష్టయ్య, బాల్‌నర్సింహ, తుమ్మల యుగేందర్‌రెడ్డి, చెరుకు శివయ్య, గూడూరు శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.
Updated Date - Jul 17 , 2025 | 12:27 AM