ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మునిసిపాలిటీ అత్యుత్సాహం రూ.35లక్షలు వృథా

ABN, Publish Date - Jun 17 , 2025 | 12:32 AM

మునిసిపాలిటీ అతి ఉత్సాహం.. కుదరదు పొమ్మన్న రైల్వేశాఖ.. ఫలితంగా లక్షల రూ పాయలతో అండర్‌ పాస్‌ బ్రిడ్జి పేరుతో నిర్మించిన రహదారి నిరుపయోగంగా మా రింది. దీనికి రైల్వేశాఖ నుంచి మునిసిపాలి టీ ముందస్తుగా లిఖితపూర్వక అనుమతులు పొందకపోవడమే కారణమని తెలుస్తోంది.

(ఆంధ్రజ్యోతి, భువనగిరి టౌన్‌) : మునిసిపాలిటీ అతి ఉత్సాహం.. కుదరదు పొమ్మన్న రైల్వేశాఖ.. ఫలితంగా లక్షల రూ పాయలతో అండర్‌ పాస్‌ బ్రిడ్జి పేరుతో నిర్మించిన రహదారి నిరుపయోగంగా మా రింది. దీనికి రైల్వేశాఖ నుంచి మునిసిపాలి టీ ముందస్తుగా లిఖితపూర్వక అనుమతులు పొందకపోవడమే కారణమని తెలుస్తోంది. దీంతో భువనగిరి అర్బన్‌కాలనీ వాసులకు సులభ ప్రయాణంపై నిరాశే మిగిలింది.

భువనగిరిలోని అర్బన్‌కాలనీ బలహీనవర్గా ల కాలనీగా ప్రసిద్ధి. సుమారు 30 ఏళ్ల క్రితం రైల్వే పట్టాలకు అవతల వైపు ఏర్పాటైన ఈ కా లనీ మూడు మునిసిపల్‌ వార్డుల్లో విస్తరించి ఉండగా, సుమారు ఆరు వేల మంది నివసిస్తున్నారు. ఈకాలనీకి స్థానిక పాత బస్టాండ్‌ సమీపంలోని రైల్వే గేటు నుంచి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ప్రతీ 24 గంటల్లో సుమారు 150 మార్లకుపైబడి రైల్వేగేట్‌ పడుతుండటంతో కాలనీకి రాకపోకలు ప్రయాసగా మారింది. ఓ దశలో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి (ఆర్‌వోబీ) నిర్మాణం కోసం సర్వే జరిగినప్పటికీ పలు సాంకేతిక కారణాలతో అనుమతులు లభించలేదు. దీంతో రాకపోకల కష్టాలు తీర్చాలన్నది కాలనీ వాసులందరి ఏకైక డిమాండ్‌గా మారింది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో కిసాన్‌నగర్‌ అండర్‌ పాస్‌ రైల్వే బ్రిడ్జి నుంచి కాలనీ వరకు సుమారు రూ.3కోట్ల వ్యయంతో ప్రైవేట్‌ భూమిని సేకరిం చి బీటీ రోడ్డు నిర్మించడంతో కొంతమేర కష్టాలు తీరాయి. అలాగే అర్బన్‌కాలనీ, ఎగువ భాగంలో ని వర్షం, మురుగు నీరు రైల్వే పట్టాల ఇవతల వైపు ఉన్న మురుగు కాల్వలోకి ప్రవహించేందు కు గతంలో రైల్వే పట్టాల కింద నిర్మించిన కల్వర్టును అభివృద్ధి చేసి రహదారిగా వినియోగించాలని బీటీ రోడ్‌ నిర్మాణ సమయంలోనే ప్రతిపాదించారు. సంబంధిత పనుల కోసం రూ.25 లక్షల మునిసిపల్‌ నిధులతో టెండర్‌ పిలిచి పనులు పాక్షికంగా పూర్తి చేశారు. అనంతరం జరిగిన జనరల్‌ ఎన్నికల్లో ప్రభుత్వం మారినా, ఇటీవలే మరో సుమారు రూ.10లక్షలతో మిగు లు పనులు పూర్తి చేశారు. మురుగు, వరద నీరు ప్రవాహానికి కాల్వను నిర్మించి మిగతా పరిధి నుంచి ట్రాక్‌ వరకు వాహనాలు ప్రయణించేలా సీసీ రోడ్డు నిర్మించారు. అంతేగాక బ్రిడ్జికి ఇరువైపులా కనెక్టివిటీ రోడ్స్‌ నిర్మించారు. అండర్‌పాస్‌ బ్రిడ్జిలో లైట్ల ఏర్పాటుకు ఇటీవలే. ప్రతిపాదించారు. అంతేగాక బ్రిడ్జికి ఇరువైపులా వీధి దీపాల కోసం ట్రాన్స్‌కో విద్యుత్‌ స్తంభాలు కూడా ఏర్పాటు చేసింది. దీంతో ఆ మార్గంలో ఇటీవలే రాకపోకలు ప్రారంభమయ్యాయి. అధికారికంగా ప్రారంభించేందుకు శిలాఫలకం దిమ్మెను కూడా నిర్మించారు. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు కథకు ఇక్కడే తెరలేచింది. ఫలితంగా నూతనంగా నిర్మించిన ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోగా, లక్షలాది రూపాయల ప్రజాధనం నిరుపయోగంగా మారింది.

అసలేం జరగిందంటే..

సొంత పనులైనా, మరో ప్రభుత్వశాఖ పరిధిలో పనులు చేయాలంటే మందుస్తు అనుమతులు తప్పనిసరి. ప్రత్యేకించి లక్షల రూపాయల వ్యయంతో పనులు చేపట్టే ముందు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఇవేమి పట్టని అప్పటి, ఇప్పటి ప్రభుత్వాల హయాంలో నాటి, నేటి మునిసిపల్‌ అధికారులు ఒత్తిడికి తలొగ్గారు. ఫలితంగా రైల్వేశాఖ అనుమతులు తీసుకోకుండానే లక్షల రూపాయల వ్యయంతో మురుగు కాల్వను అండర్‌పాస్‌ బ్రిడ్జి పేరుతో అభివృద్ధి చేశారు. అయితే కొద్ది మంది రైల్వే అధికారులతో ఉన్న పరిచయాలతో పనులను నెట్టుకొచ్చినప్పటికీ ఇవి పూర్తయ్యాక అసలుకు ఎసరు వచ్చినట్టయింది. మురుగు కాల్వను అండర్‌పాస్‌ బ్రిడ్జిగా అభివృద్ధి చేసి ప్రజా రవాణాకు వినియోగిస్తున్నట్టు వచ్చిన సమాచారంతో రైల్వే ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసి రాకపోకలను నిలిపివేశారు. బ్రిడ్జికి ఇరువైపులా దిమ్మెలు తొలగించినా, ఈ మార్గంలో ప్రయాణించినా చట్టరీత్యా నేరమని, ఉల్లంఘిస్తే కేసులు తప్పవని హెచ్చరించి దీనిపై కాలనీల్లో ప్రచారం నిర్వహించారు. అనుమతులు తీసుకోకుండా అభివృద్థి పనులు నిర్వహిస్తే రైల్వే లైన్‌కు ఇబ్బందిగా మారుతుందని, వాహనాలపై భాగంలో లైట్ల కోసం చేసే వైరింగ్‌తో రైల్వే ట్రాక్‌కు ప్రమాదం ఉంటుందని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. ఈ నేపథ్యంలో కారు, ఆటోలు, ద్విచక్ర తదితర చిన్న వాహనాలు మాత్రమే ప్రయాణించేలా, ఎత్తయిన వాహనాలను నియంత్రించేలా బ్రిడ్జికు ఇరువైపులా హైట్‌ గేట్‌ ఏర్పాటు చేయాలని అధికారులు భావించారు. కానీ, ఈ ప్రతిపాదనను కూడా పలు సాంకేతిక కారణాలతో రైల్వే ఉన్నతాధికారులు తిరస్కరించినట్టు తెలుస్తున్నది. దీంతో లక్షలాది రూపాయలతో అభివృద్ధి చేసిన అండర్‌ పాస్‌ బ్రిడ్జి వినియోగంపై అనుమనాలు నెలకొన్నాయి. ప్రజల సమస్యలను తీర్చేందుకు ప్రముఖులు, మునిసిపాలిటీ చేసిన ప్రయత్నాలు సబబుగా ఉన్నా రైల్వేశాఖ అనుమతులు తీసుకోవడంలో చూపిన అలసత్వం ఫలితంగానే నేడు ఈ పరిస్థితి నెలకొన్నదని పలువురు పేర్కొంటున్నారు. అయితే కాలనీవాసులు మాత్రం కనీసం కారు తదితర తేలికపాటి వాహనాల ప్రయాణాలకు రైల్వేశాఖ అనుమతులు ఇవ్వాలని కోరుతున్నారు.

Updated Date - Jun 17 , 2025 | 12:32 AM