ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మోతీరాంతండా వాసుల జల సంకల్పం

ABN, Publish Date - May 19 , 2025 | 12:34 AM

మోడువారిన బీడు భూములకు కాల్వ నీళ్ల రావాలని ఆ గ్రామ రైతులు సంకల్పించారు.

గోదావరి జలాలతో మంగళచెరువును నింపే యత్నం

రూ.11లక్షలతో విద్యుత ట్రాన్సఫార్మర్లు, మోటర్లు ఏర్పాటు

వారం నుంచి చెరువులోకి పారుతున్న గోదావరి జలాలు

(ఆంధ్రజ్యోతి, తుర్కపల్లి)

మోడువారిన బీడు భూములకు కాల్వ నీళ్ల రావాలని ఆ గ్రామ రైతులు సంకల్పించారు. వరుణుడి కరుణమీదే ఎన్ని రోజులు ఆధార పడాలని యోచించుకున్నారు. తలాపున గోదావరి జలాలు పారుతుంటే తమ భూములు ఎందుకు బీళ్లుగా ఎందుకు ఉండాలని ప్రశ్నించుకున్నారు. గ్రామ రైతులు చేయిచేయి కలిపి గోదావరి జలాలతో చెరువును నింపాలని సంకల్పించుకున్నారు. 12మంది రైతుల ముందడుగుతో ఆ గ్రామ చెరువులోకి జలసిరి వడివడిగా వస్తోంది. తలాపునే గోదావరి జలాలు ప్రవహిస్తున్నా ఆ నీటిని వాడుకోలేని పరిస్థితి. వర్షాభావంతో ఈ ప్రాంతంలో పంట పొలాలు ప్రస్తుతం బీడు భూములను తలపిసున్నాయి. వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు రైతులు సమష్టి నిర్ణయం తీసుకున్నారు. బస్వాపూర్‌ ప్రాజెక్ట్‌కు వెళ్లే కాల్వలో విద్యుత మోటార్లు బిగించి ఆ నీటితో చెరువు నింపాలని భావించారు. అందుకుగాను ముందుగా 12మంది రైతులు ఒక్కొక్కరు రూ.80వేల చొప్పున డబ్బులు జమ చేసుకుని పనులకు శ్రీకారం చుట్టారు. తుర్కపల్లి మండలం మోతీరాంతండ పంచాయతీ పరిధిలోని మంగళ చెరువును గోదావరి జలాలతో నింపేందుకు మండలంలోని సంగ్యాతండా సమీపంలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వ నుం చి సుమారు కిలోమీటరు దూరం వరకు డోజర్‌, ఎక్స్‌కవేటర్‌తో రూ.90 వేలతో కాల్వ తీశారు. ఆ కాల్వలో రూ.5.60 లక్షలు ఖర్చు పెట్టి పైపులైన ఏర్పాటు చేశారు. పైప్‌లైన జాయింట్‌ చేయడానికి మరో 50వేలు ఖర్చు చేశారు. ఈ పైప్‌లైనకు రూ.2.70 లక్షలు ఖర్చు చేసి రెండు 20హెచపీ విద్యుత మోటర్లను కొనుగోలు చేసి ఆ మోటార్లకు పైపులు బిగించి, కాల్వలో వేశారు. ఈ విద్యుత మోటర్లు 24గంటల పాటు నిరంతరాయ ంగా నడిచేందుకు ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య సహకారంతో పాటు ట్రాన్సకో అధికారుల సూచన మేరకు ఆరుగురు రైతుల పేరుతో 6వేల రూపాయల చొప్పున ఆరు డీడీలు తీసి విద్యుత అధికారులకు ఇచ్చారు. దీంతో టాన్సకో అధికారులు దిమ్మెలను నిర్మించి దానిపై రెండు విద్యుత ట్రాన్సపార్మర్లను ఏర్పాటు చేసి విద్యుత కనెక్షన ఇవ్వడంతో మోటార్లు కాలువలోంచి నీటిని పంపింగ్‌ చేస్తున్నాయి. వారం రోజులుగా చెరువులోకి నీరు చేరుతుండడంతో రైతుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది.

మంగళచెరువు నిండితే..

మంగళచెరువు నిండితే భూ గర్భ జలాలు పెంపొండంతో మోతీరాం తండ, గోగుల గుట్టతండా, జాలు బావితండా, పర్రెబావితండా, బాబుల్‌ నాయక్‌తండా తదితర ప్రాంతాల రైతులకు సాగు, తాగు నీటి సమస్య తీరుతుందని రైతులు పేర్కొంటున్నారు. అంతే కాకుండా 100 ఎకరాల వరకు రైతులు సాగు చేసుకునే అవకాశం ఉంటుందంటున్నారు. చెరువు పూడిక తీత మట్టిని విక్రయించి, విక్రయించి రూ.11లక్షలు జమ చేశారు. 12 మంది రైతులు ఎవరెవరు ఎంత ఖర్చు పెట్టారో లెక్క చూసుకుని ఆ డబ్బులను తీసుకున్నారు.

కొండపోచమ్మ జీవధార..

కొండ పోచమ్మ ప్రాజెక్టు నుంచి వచ్చే తుర్కపల్లి (ఎం) కాలువ ద్వార మండలంలోని పలు గ్రామాల్లోని 20 చెరువులు, కుంటలు గోదావరి జలాలతో నిండడంతో ఈ గ్రామాల్లో రైతులకు సాగు నీటి సమస్య తీరింది. మండలంలోని కొండాపూర్‌, తిర్మలాపూర్‌, వీరారెడ్డిపల్లి, డీబీ తండ, ఇబ్రహీంపూర్‌, దత్తాయపల్లి, మోతీరాంతండ గ్రామాల్లోని చెరువులకు కాలువల ద్వార నేరుగా చెరువులోకి నీరు వచ్చే పరిస్థితి లేదు. దీంతో ఆయా గ్రామాల రైతులు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని విద్యుత మోటర్ల ద్వారా గోదావరి జలాలతో చెరువులు నింపుతున్నారు.

కాల్వల ద్వారా నీటిని నింపాలి

గత ప్రభుత్వ హయాంలో మెయిన కాలువల నిర్మాణం చేపట్టింది కానీ చెరువులు నింపడానికి అంతర్గత కాల్వల నిర్మాణం చేపట్ట లేదు. ప్రస్తుత ప్రభుత్వం మెయిన కాలువల నుంచి అంతర్గత కాలువల నిర్మాణం చేపట్టి ఆ కాల్వల ద్వార చెరువులను నింపాలని ప్రభుత్వాన్ని కోరారు.

భానోత బిచ్చునాయక్‌, మాజీ సర్పంచ, మోతీరాంతండా.

చెరువులోకి నీటిని వదలడం సంతోషంగా ఉంది

కరువు పరిస్థితుల కారణంగా గత ఖరీఫ్‌ సీజనలో పంట వేయకుండా పొలం పడావుగా ఉంది. గ్రామస్థులు ముందుకు వచ్చి చెరువులోకి గోదావరి జలాలను తీసుకరావడం సంతోషంగా ఉంది. చెరువు నిండితే ఈ సారైనా పంటలు సాగు చేసుకోనే అవకాశముంటుంది. ప్రభుత్వం ప్రతీ ఏటా చెరనువులోకి నీరు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలి.

భానోత గున్ననాయక్‌, మోతీరాం నాయక్‌తండా.

Updated Date - May 19 , 2025 | 12:34 AM