ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నత్తనడకన మోడల్‌కాలనీ పనులు

ABN, Publish Date - May 27 , 2025 | 12:18 AM

పదేళ్ల కిందట సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ లోని చేపట్టిన మోడల్‌కాలనీ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి.

హుజూర్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న మోడల్‌కాలనీ

మంత్రి ఉత్తమ్‌ ఆదేశాలు బేఖాతర్‌

రూ.74.80 కోట్లతో పునరుద్ధరణ

పదేళ్ల కిందట సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ లోని చేపట్టిన మోడల్‌కాలనీ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. నిధులు పుష్కలంగా ఉన్నా పనులు సాగదీస్తున్నారు. ఆరు నెలల్లో పూర్తిచేయాలని మంత్రి ఉత్తమ్‌ ఆదేశించి ఏడాది దాటింది. కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం వల్లే పనులు ముందుకు సాగడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రుల నుంచి ఉన్నతాధికారుల వరకు పనుల పూర్తికి ఉరుకులు పెట్టించినా ఫలితం కనిపించడం లేదు. దశాబ్దం తరువాత ఇళ్ల కల నెరవేరుతుందని ఆశపడ్డ నిరుపేదలకు నిరాశే ఎదురవుతోంది.

(ఆంధ్రజ్యోతి-హుజూర్‌నగర్‌ )

ఉమ్మడి ఆంధ్రప్రదేశ రాష్ట్రంలో 2014లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హుజూర్‌పట్టణంలోని ఫణిగిరిగట్టు వద్ద ఉన్న దేవాదాయ శాఖ భూములను హైకోర్టు అనుమతితో రెవెన్యూ శాఖకు కొనుగోలు చే యించి అందులో మోడల్‌ కాలనీ పనులను ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తన నియోజకవర్గమైన హుజూర్‌నగర్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 135 బ్లాక్‌లలో 2,160 ఇళ్లకు జీ ప్లస్‌ పద్ధతిలో మోడల్‌కాలనీకి ప్రణాళికలు రూపొందించారు. ఈ ప్రాజెక్ట్‌కు రూ.98.51 కోట్లు మంజూరు కాగా 2014 జనరిలో జీప్లస్‌-1 మోడల్‌ కాలనీ పను లు ప్రారంభించారు. అందులో రూ.34.63 కోట్ల పను లు పూర్తిచేశారు. అదేవిధంగా ఈ కాలనీ పక్కనే మరో 1000 వ్యక్తిగత గృహాలకు ఉత్తమ్‌ శంకుస్థాపన చేయించి 270మంది పేదలకు 2014లోనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరుచేయించి ఇళ్లు కట్టించారు.

2016 నుంచి నిలిచిన పనులు

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక రెండు పర్యాయాలు కొలువుదీరిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లుగా మోడల్‌ కాలనీ పనులను నిర్లక్ష్యం చేసింది. దీంతో కాలనీ ప్రాంతం డంప్‌యార్డ్‌గా మారి అస్తవ్యస్తమైం ది. మోడల్‌కాలనీ పనులు 2016 నుంచి పూర్తిగా నిలిచిపోయాయి. అప్పటి సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, జగదీ్‌షరెడ్డిలు అనేకమార్లు ఈ పథకాన్ని పూర్తి చేస్తామని హామీలు ఇచ్చి విస్మరించారు. గత ప్రభుత్వ హయాంలో మోడల్‌కాలనీని డంపింగ్‌ యార్డ్‌గా మార్చారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో 2023లో అధికారంలోకి రావడంతో కాలనీ పునరుద్ధరణకు మోక్షం కలిగింది. ప్రస్తుత మంత్రి ఉ త్తమ్‌కుమార్‌రెడ్డి డిసెంబరు 5న గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తీసుకొచ్చి కాలనీ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేయగా, గతేడాది జనవరి నుంచి పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 135 బ్లాక్‌లు, 2,160 ఇళ్లకు 91 బ్లాక్‌లకు సంబంధించి ఇళ్లు పూర్తి చేశారు. మరో 40 బ్లాక్‌లకు సంబంధించి పనులు ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పటివరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి గతేడాది జనవరి 29న రూ.74.80 కోట్లు మంజూరు చేయగా సుమారు రూ.35.82 కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన పనులు నత్తనడకను జరుగుతున్నాయి.

లబ్ధిదారుల ఎంపికకు ఆదేశాలు..

ఇదిలా ఉండగా మోడల్‌కాలనీ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపికను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది. ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఎంపిక జరగాలని మంత్రి ఉత్తమ్‌ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇందిమ్మ ఇళ్లు మం జూరు చేస్తోంది. ఈ క్రమంలో హుజూర్‌నగర్‌ ని యోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఇళ్ల పనులు కొనసాగుతున్నాయి. హుజూర్‌నగర్‌ మునిసిపాలిటీ లో మాత్రం మోడల్‌కాలనీ ఇళ్లను పంపిణీ చేసేందు కు అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. కాలనీనిర్మాణం పూర్తయితే సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా పేదలకు పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయి.

మంత్రులు ఆదేశించినా...

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా మంత్రి ఉత్తమ్‌ ఏడాదిన్నర కాలంగా పనులు పూర్తిచేయాలని ఆదేశించి అనేకసార్లు పర్యటనలు చేసి, సీఎం రేవంత్‌రెడ్డికి చూపించి, మంత్రి పొంగులేటితో నిధులు మం జూరు చేయించినా పనులు మాత్రం మందకొడి గా సాగుతున్నాయి. కలెక్టర్‌ తేజ్‌సనందలాల్‌ పవార్‌ చాలాసార్లు కాలనీ పనులను పర్యవేక్షించారు. హౌసింగ్‌ ఎండీ గౌతమ్‌ ప్రత్యేక దృష్టి సా రించారు. మంత్రుల నుంచి ఉన్నతాధికారుల వరకు ఎన్నిసార్లు పనులు పూర్తి చేయాలని ఆదేశించి కాంట్రాక్ట్‌ తీరు మాత్రం మారడం లేదు. రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తున్నారు. రోజుకు 1000 మంది కూలీలు, మేస్ర్తీలతో పనిచేయాలని మంత్రి ఉత్తమ్‌, కలెక్టర్‌ చెప్పినా అత ను పెడచెవిన పెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నా యి. మూడు రోజుల కిందట మంత్రి ఉత్తమ్‌ మోడల్‌ కాలనీ పనుల పర్యవేక్షణకు వెళ్లగా నెల రోజుల్లో పనులు పూర్తిచేస్తామని కాంట్రాక్టర్‌ చెప్పినా పరిస్థితి అలా కనిపించడంలేదు.

రెండు పనులు మోడల్‌కాలనీ పనులు పూర్తి

మోడల్‌కాలనీ పనులు రెండు నెలల్లో పూర్తిచేయాలని ఆదేశించాం. పనులు పూర్తిచేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం. నిర్మాణంలో పూర్తి నాణ్యత ఉండాలి. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉండాలి. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గొద్దు. పట్టణంలో అర్హత కలిగిన పేదలకు ఇళ్లు ఇస్తాం.

- ఎన. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రి

Updated Date - May 27 , 2025 | 12:18 AM