నెరవేరిన మినీ అంగన్‌వాడీల కల
ABN, Publish Date - May 07 , 2025 | 12:19 AM
మినీ అంగన్‌వాడీ టీచర్ల దశాబ్దాల కల నెరవేరింది. అంగన్‌వాడీ టీచర్లుగా గుర్తిస్తూ సమాన వేతనం ఇవ్వాలని చేసిన పోరాటాలు ఫలించాయి. మినీ అంగన్‌వాడీలను అంగన్‌వాడీ టీచర్లుగా అప్‌గ్రేడ్ చేస్తూ మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అంగన్‌వాడీ టీచర్‌గా అప్‌గ్రేడ్
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఉమ్మడి జిల్లాలో 402 మందికి ప్రయోజనం
భువనగిరి టౌన్, మే 6 (ఆంధ్రజ్యోతి): మినీ అంగన్‌వాడీ టీచర్ల దశాబ్దాల కల నెరవేరింది. అంగన్‌వాడీ టీచర్లుగా గుర్తిస్తూ సమాన వేతనం ఇవ్వాలని చేసిన పోరాటాలు ఫలించాయి. మినీ అంగన్‌వాడీలను అంగన్‌వాడీ టీచర్లుగా అప్‌గ్రేడ్ చేస్తూ మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 402 మంది అంగన్‌వాడీ టీచర్లుగా అప్‌గ్రేడ్ అయ్యారు. అలాగే వారి వేతనం రూ.7,800 నుంచి రూ.13,650కి పెరగనుంది. త్వరలో ఆయా కేంద్రాల్లో ఆయాల ను నియమించే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో అర్హులైన స్థానిక మహిళలకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై అప్‌గ్రేడ్ పొందిన అంగన్‌వాడీ టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల ఖాళీ పోస్టుల ను కూడా భర్తీ చేస్తామని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఉమ్మడి జిల్లాలో...
ఉమ్మడి జిల్లాలో అప్‌గ్రేడ్ అయిన మినీ అంగన్‌వాడీ కేంద్రాలతో కలిపి మొత్తం వీటి సంఖ్య 4,203కు చేరింది. వీటిలో 192 టీచర్ల పోస్టు లు, 800 ఆయాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే 402 మినీ అం గన్‌వాడీ కేంద్రాలను పూర్తిస్థాయి అంగన్‌వాడీ కేంద్రాలుగా ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేయడంతో వాటిలో నూతనంగా ఏర్పడే ఆయాల పోస్టులను కూడా భర్తీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం 20మంది పిల్లలకు పైబడి ఉంటేనే ఆయా పోస్టు మంజూరవుతుంది. దీంతో అప్‌గ్రేడ్ అయిన అంగన్‌వాడీ కేంద్రాల్లో కూడా ఆయా పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తే ప్రస్తుత 800 ఆయా పోస్టుల ఖాళీల సంఖ్య గణనీయంగా పెరగనుంది. అదే సమయంలో అప్‌గ్రేడ్ అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్యను తేల్చడం లేదా నిబంధనలను సవరిస్తూ సంఖ్యతో నిమిత్తం లేకుండా ఆయా పోస్టులను మంజూరు చేసి భర్తీ చేసే దిశ గా ప్రభు త్వం నిర్ణ యం తీసుకోవా ల్సి ఉం టుంది.
జిల్లా కేంద్రాలు అప్‌గ్రేడెడ్ మినీ టీచర్ల ఆయాల
అంగన్‌వాడీలు ఖాళీలు ఖాళీలు
నల్లగొండ 2,093 262 57 263
సూర్యాపేట 1,209 83 78 274
యాదాద్రి 901 57 57 263
మొత్తం 4,203 402 192 800
Updated Date - May 07 , 2025 | 12:19 AM