ప్రభుత్వ వైద్య కళాశాల, బోధనాస్పత్రి అభివృద్ధికి చర్యలు
ABN, Publish Date - Jul 01 , 2025 | 01:07 AM
జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలను, బోధనాస్పత్రిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్య లు తీసుకుంటోందని కలెక్టర్ ఎం.హనుమంతరావు, డీఎంఈ డాక్టర్ నరేంద్రకుమార్ అన్నారు.
కలెక్టర్ హనుమంతరావు, డీఎంఈ డాక్టర్ నరేంద్రకుమార్
భువనగిరి టౌన్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలను, బోధనాస్పత్రిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్య లు తీసుకుంటోందని కలెక్టర్ ఎం.హనుమంతరావు, డీఎంఈ డాక్టర్ నరేంద్రకుమార్ అన్నారు. వైద్య కళాశాల, బోధనాస్పత్రిలో మౌలిక వసతుల కల్పన, వైద్య సేవలను పరిశీలించేందుకు ప్రభుత్వం నియమించిన మెడికల్ కాలేజ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) బృందం సోమవారం తనిఖీలు నిర్వహించింది. ఎంసీఎంసీ సభ్యులైన కలెక్టర్ హనుమంతరావు, డీఎంఈ డాక్టర్ నరేంద్రకుమార్, మహేశ్వరి జీజీహెచ్ సూపరిండెంట్ డాక్టర్ నాగేందర్ కళాశాల ను, ఆస్పత్రిని తనిఖీచేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, కళాశాల శాశ్వత భవనం కోసం వైటీడీఏ పరిధిలో ప్రభుత్వం కేటాయించిన 20ఎకరాల విస్తీర్ణంలో భవన నిర్మాణం ప్రారంభమవుతుందన్నారు. రెండు మూడేళ్లలో మెడికల్, నర్సింగ్ కళాశాలలు, హాస్టల్స్, పూర్తిస్థాయి వసతులతో కూడిన ఇత ర భవనాలను నిర్మిస్తామన్నారు. రెండో సంవత్సరం విద్యార్థులు క్లినికల్ సేవ ల కోసం బోధనాస్పత్రిలో ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. త్వరలోనే సీటీ స్కా న్ సేవలు అందుబాటులోకి తెస్తామని, ఆధునిక మార్చురీ నిర్మిస్తామన్నారు. మూడో అంతస్తు నిర్మాణ పనులు నెమ్మదిగా సాగుతున్నట్టు గుర్తించామని, పరిశీలనకు త్వరలో అధికారుల బృందం రానున్నట్టు, హోమియో ఆస్పత్రిపై మరో రెండంతస్తుల భవనం నిర్మించనున్నట్టు తెలిపారు. ప్రతిపాదిత నిర్మాణ పనులు పూర్తయితే 220 పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు. వర్చువల్ విధానంలో జరిగిన తనిఖీల్లో కళాశాల, ఆస్పత్రి నిర్వహణపై ఎన్‌ఎంసీ సంతృప్తి వ్యక్తం చేస్తూ అనుమతులను రెన్యువల్ చేసిందని తెలిపారు. అన్ని స్థాయిల టీచింగ్ ఫ్కాకల్టీ భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని, టెక్నికల్ తదితర పోస్టుల భర్తీకి త్వరలో జారీ కానున్న నోటిఫికేషన్ అధారంగా నియామకాలు చేపడతామన్నారు. తనిఖీల నివేదికను త్వరలో ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. వారి వెంట వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమే్‌షరెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.వెంకటేశ్వర్లు, ఆర్‌ఎంవో డాక్టర్ కిరణ్, డీసీహెచ్‌ఎ్‌స డాక్టర్ శ్రీశైల చిన్నానాయక్, తదితరులు ఉన్నారు.
Updated Date - Jul 01 , 2025 | 01:07 AM