ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రాజ్యాంగ పరిరక్షణకు మాలలు ఉద్యమించాలి

ABN, Publish Date - May 03 , 2025 | 12:30 AM

చౌటుప్పల్‌ రూరల్‌, మే 2,(ఆంధ్ర జ్యోతి) రాజ్యాంగ పరిరక్షణ కోసం మాల కులస్తులు ఉద్యమించాలని అంబేడ్కర్‌ వాది రేంజర్ల రాజేష్‌ పిలుపునిచ్చారు.

చౌటుప్పల్‌ రూరల్‌, మే 2,(ఆంధ్ర జ్యోతి) రాజ్యాంగ పరిరక్షణ కోసం మాల కులస్తులు ఉద్యమించాలని అంబేడ్కర్‌ వాది రేంజర్ల రాజేష్‌ పిలుపునిచ్చారు. మం డలంలోని దండు మల్కాపురంలో ఆంథోళ్‌ మైసమ్మ వద్ద శుక్రవారం నిర్వహి ంచిన చౌటుప్పల్‌ డివిజన్‌ మాల కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. మాలలకు అన్ని రం గాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మాలలకు న్యాయం జరగాలంటే ఉద్యమాలే శరణ్యవమన్నారు. ప్రతి మాలవ్యక్తి అంబేడ్కర్‌ చరిత్ర చదువాలని కోరారు. ఎమ్మార్పీఎస్‌ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందని ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ కన్ను పడిందని అందుకే మంద కృష్ణ పావుగా ఉపయోగించుకొని అధికారంలోకి రావాలని చూస్తుందని ఆరోపించారు. మాల ప్రజాప్రతినిధులు వర్గీకరణపై స్పందించకపోవడం శోచనీయమని విమర్శించారు. ఉద్యమాలతోనే మాలలు హక్కులు సాధించుకోవచ్చని పిలుపునిచ్చారు. జాక్‌ వైస్‌ చైర్మన్‌ చేపూరి నరసింహ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాలల జేఏసీ చైర్మన్‌ చెరుకు రామచంద్రం. మాల స్టూడెంట్‌ యూనియన్‌ మంచాల లింగస్వామి, యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కుసంగుల రాజు, నాయకులు కొంగరి నరసింహ, దొంత సత్యం, ఈద శంకరయ్య, మహేశ్వరం కృష్ణయ్య, బొంతల ఓం ప్రకాష్‌, సంఘం నరసింహ, జువ్వి నరసింహ ఎన్న మల్ల నాగరాజు, పెరుమాళ్ల రవి, రాపోలు పవన్‌, కట్ట గాలిబ్‌, మంచాల నరసింహ, తగరం వెంకటేశం, వల్లమళ్ళ భాస్కర్‌, సోదరి రమేష్‌, దొడ్డి గణేష్‌, కట్ట రత్నయ్య, జువ్వి రఘుపతి, జూవి కరుణాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2025 | 12:30 AM