ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

లింగమంతుల స్వామీ నీ ఆస్తులకేదీ రక్షణ

ABN, Publish Date - May 29 , 2025 | 12:43 AM

రాష్ట్రంలో మేడారం తర్వాత రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన పెద్దగట్టు లింగమంతులస్వామి(గొల్లగట్టు) ఆలయ ఆస్తులకు రక్షణ లేకుండాపోతోంది.

చోరీకి గురైన తలుపులు

రాష్ట్రంలో మేడారం తర్వాత రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన పెద్దగట్టు లింగమంతులస్వామి(గొల్లగట్టు) ఆలయ ఆస్తులకు రక్షణ లేకుండాపోతోంది. జాతర సమయాల్లో రూ.కోట్లు ఖర్చు చేస్తూ చేపట్టిన మరుగుదొడ్లు, మూత్రశాలలు, నల్లాలు, నీటి ట్యాంకులు, విద్యుత దీపాలు, సోలార్‌ దీపాలకు రక్షణ లేకుండాపోతోంది. వీటి రక్షణకు మునిసిపాలిటీ గాని, దేవాదాయ శాఖ గాని నిఘా చర్యలు చేపట్టకపోవడంతో ఆకతాయిల చేతిలో చోరీలకు, ధ్వంసానికి గురవుతున్నాయి. ఎవరికి వారు ప్రభుత్వం ఇచ్చే నిధులు జాతర ఏర్పాట్లకు, పారిశుధ్య సౌకర్యాలకే సరిపోతోందని చెబుతూ పెద్దగట్టు రక్షణను వదిలేస్తున్నారు. దీంతో సాయంత్రమైతే చీకటిమయంగా మారి ఆకతాయిలకు నెలవుగా మారుతోంది.

(ఆంధ్రజ్యోతి-భానుపురి)

సూర్యాపేట పట్టణంలో నాలుగవ వార్డు పరిధిలోని లింగమంతులస్వామి దేవాలయానికి నిత్యం భక్తులు వచ్చిపోతుంటారు. అన్నిసౌకర్యాలు కల్పిస్తే పట్టణవాసులతో పాటు ఇతర గ్రామాల నుంచి వస్తున్న భక్తులు సేదతీరి ఆహ్లాదంగా గడిపే అవకాశం ఉన్నా మునిసిపాలిటీ, దేవదాయ శాఖలు దృష్టి సారించడం లేదు. పెద్దగట్టు జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ, ఒడిశా, చత్తీ్‌సఘడ్‌, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. అయితే సౌకర్యాలు మాత్రం అరకొరగానే ఉంటున్నాయి. జాతర సమయంలో ఏర్పాటు చేసిన ఈ సౌకర్యాలు సైతం పర్యవేక్షణ లేకపోవడంతో దెబ్బతింటున్నాయి. విద్యుద్దీపాలు వెలగక సాయంత్రమైతే పెద్దగట్టు చుట్టుపక్కల ప్రాంతాలు చీకటిమయంగా మారుతున్నాయి. దీంతో కుళాయిలు, నల్లాలు, మూత్రశాలల్లోని వస్తువులు, నీటి ట్యాంకులు, ఇతరత్రా వస్తువులను ఆకతాయిలు, దొంగలు ధ్వంసం చేస్తున్నారు. రెండేళ్లకోసారి నిర్వహించే జాతర ఏర్పాట్లను మునిసిపాలిటీ, దేవదాయశాఖలు పర్యవేక్షణ చేసి ఆ తర్వాత మరిచిపోతున్నాయి. దేవాలయ పాలకవర్గాలను సైతం ఏర్పాటు చేయకుండా తాత్కాలిక కమిటీలను ఏర్పాటు చేయడంతో వారు పట్టు సాధించేలోపే జాతర అయిపోతోంది. పెద్దగట్టు సమీపంలో జాతర సమీపంలో నిర్మించిన షెడ్ల రక్షణకు మునిసిపాలిటీ ఇద్దరు సిబ్బందిని కేటాయిస్తే మరో జాతర వచ్చే వరకూ నిర్మాణాలు, వస్తువులకు రక్షణ ఉంటుంది. ఎలాంటి రక్షణ లేకపోవడంతో ధ్వంసం కావడంతో పాటు చోరీకి గురవుతున్నాయి. ప్రతీ జాతరకు రూ.కోట్ల పనులను కాంట్రాక్టర్లకు అప్పగిస్తే అధికారులకు,నాయకులకు మామూళ్లు ముట్టజెప్పి నాణ్యతలేని పనులు చేస్తున్నారని విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.

రెండు శాఖల మధ్య..

పెద్దగట్టు ఆలయ నిర్వహణ రెండు శాఖల మధ్య నలిగిపోతోంది. ఆలయ పరిసరాలను దేవాదాయశాఖ, గట్టు కింది భాగాన్ని సూర్యాపేట మునిసిపాలిటీ జాతర సమయంలో పర్యవేక్షిస్తున్నాయి. దేవాదాయ శాఖ పరిధిలోని హుండీ లెక్కలు, తలనీలాలు, తలవెంట్రుకలు, కొబ్బరిచిప్పల వేలం ద్వారా వచ్చే ఆదాయాలు మాత్రమే వస్తున్నాయి. తైబజార్‌, సర్క్‌సలాంటి వాటి ద్వారా వచ్చే ఆదాయం మునిసిపాలిటీకి చేరుతుండగా ఆ డబ్బులు శానిటేషన ఇతర పనులకే సరిపోతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. అయితే వేలం ద్వారా వచ్చే ఆదాయానికి తోడు జాతరకు మునిసిపాలిటీ లక్షల్లో ఖర్చు చేస్తోంది. అయితే వేలం పాటల ఆదాయంతో పాటు ఇతర నిధుల ఖర్చుల వివరాలకు మాత్రం లెక్కలు చెప్పడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. మునిసిపాలిటీకి వచ్చే ఆదాయంలో కొంత దేవాదాయ శాఖకు కేటాయించాలని భక్తులు సూచిస్తున్నారు. లేదంటే జాతర మొత్తం దేవాదాయ శాఖ పరిధికి తెస్తే పెద్దగట్టు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ షెడ్‌ ప్రైవేట్‌ వ్యక్తి నిర్వహణలో

లింగమంతులస్వామి జాతరకు వచ్చే భక్తులు సేదతీరడానికి ప్రభుత్వ భూమిలో షెడ్‌ నిర్మాణం చేపట్టారు. అయితే ఆ షెడ్‌ నిర్వహణ ప్రస్తుతం ప్రైవేట్‌వ్యక్తుల చేతు ల్లోకి వెలల్లంది. భక్తులకు అద్దెకి ఇస్తూ ఆదాయం పొందుతున్నారు. ఇలాంటి వాటిని సైతం అధికారులు పట్టించుకోవడం లేదు. భక్తులు ఎండలకు, వానలకు ఇబ్బంది పడకుండా ఏర్పాటుచేసిన షెడ్డు బడానాయకుల కన్నుసన్నుల్లోనే నడుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వేలం పాటలు దుర్వినియోగం కాకుండా చూడాలి

మునిసిపాలిటీ, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వేలం పాటల ద్వారా వచ్చే ఆదాయం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులకు ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత పెద్దగట్టు జాతరకు రూ.11 కోట్లు కేటాయించింది. పెద్దగట్టు పైభాగం, కింది భాగంలో నిర్వహించే వేలం పాటలు దేవాలయానికి చెందాలి. వ్యాపారులు వేలం పాటల్లో సిండికేట్‌ కాకుండా చూడాలి.

మద్ది శ్రీనివా్‌సయాదవ్‌, పెద్దగట్టు మాజీ చైర్మన

కాంట్రాక్టర్లకు అప్పగిస్తాం

పెద్దగట్టు కింది భాగంలో నిర్వహించే వేలం పాటలు సూర్యాపేట మునిసిపాలిటీకి వస్తాయి. తైబజార్‌ను, రోడ్లను, శానిటరీని కాంట్రాక్టర్లకు అప్పగిస్తాం. కొబ్బరికాయలు, సర్క్‌సలు ఇతరవాటికి వేలం పాటలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జనవరిలో వేలం నిర్వహిస్తాం. నిధులు కావాలని కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపాం.షెడ్‌ ప్రైవేట్‌ వ్యక్తులకు ఇవ్వలేదు. భక్తులు వాడుకుంటున్నారు.

శ్రీనివాసారావు, సూర్యాపేట మునిసిపాలిటీ కమిషనర్‌

Updated Date - May 30 , 2025 | 03:02 PM