ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భూభారతి చట్టం.. రైతులకు చుట్టం

ABN, Publish Date - Apr 27 , 2025 | 12:09 AM

భూభారతి చట్టం.. రైతులకు చుట్టం అని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య అన్నారు. శనివారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద రైతులతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొ ని మాట్లాడారు. ధరణితో రైతులు పడిన ఇబ్బందులు తొలగించేందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వం భూభారతి చట్టా న్ని అమల్లోకి తెచ్చి, రైతులకు అవగాహన కల్పిస్తుందన్నారు.

ఈ చట్టం ద్వారా రైతులు భూ సమస్యలు పరిష్కరించుకోవాలి

ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య

ఆలేరు, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): భూభారతి చట్టం.. రైతులకు చుట్టం అని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య అన్నారు. శనివారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద రైతులతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొ ని మాట్లాడారు. ధరణితో రైతులు పడిన ఇబ్బందులు తొలగించేందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వం భూభారతి చట్టా న్ని అమల్లోకి తెచ్చి, రైతులకు అవగాహన కల్పిస్తుందన్నారు. ఈ చట్టం అమలుకోసం అధికారులకు ప్రభు త్వం పూర్తిస్థాయి అధికారం ఇచ్చిందని, రైతులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పనిలేదని,కేవలం జిల్లా రెవెన్యూ అధికారులను సంప్రదించి సమస్యలను పరిష్కరించుకో వాలన్నారు. కలెక్టర్‌ హనుమంతు రావు మాట్లాడు తూ భూభారతి చట్టం తీసుకువచ్చి ఎంతో మేలు చేస్తుందన్నారు. మొదట అంబేడ్కర్‌ చిత్రపటానికి పూ లమాల లు వేసి నివాళి అర్పించారు. అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి అధ్యక్షతన జరిగిన సదస్సులో తహసీల్దార్‌ అంజిరెడ్డి, ఎంపీడీవో హనుమంత ప్రసాద్‌, వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్‌,మండల ప్రత్యేక అధికారి గోపాల్‌, మా ర్కెట్‌ కమిటీ చైర్మన్‌ చైతన్య మహేందర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ పి.మదార్‌, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, టీపీసీసీ కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, నా యకులు నీలం పద్మ వెంకట స్వామి,అశోక్‌, ప్రశాంత్‌, వెంకటేశ్వర రాజు,ఎజాజ్‌, పురుషోత్తంరెడ్డి పాల్గొన్నారు.

రైతులకు అండగా భూభారతి చట్టం

గుండాల: ప్రభుత్వం తెచ్చిన భూభారతి చట్టం రైతులకు అండగా నిలుస్తుందని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిల య్య అన్నారు. మండల కేంద్రంలో భూ భారతిచట్టంపై కలెక్టర్‌తో కలిసి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ తగాదాలు పరిష్కరించి రైతుకు శాశ్వతంగా హక్కు ఉండేలా ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఈరసరపు యాదగిరి గౌడ్‌, మాజీ ఎంపీపీ ద్యాప కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

‘భూభారతి’పై అవగాహన పెంచుకోవాలి

బీబీనగర్‌: భూభారతి చట్టంపై ప్రతీఒక్కరు అవగాహన పెంచుకోవాలని కలెక్టర్‌ హనుమంతరావు, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం బీబీనగర్‌ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద భూ భారతి చట్టంపై రైతులు, ప్రజలకు నిర్వహించిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. సీఎం రేవంత్‌ రెడ్డి తహసీల్దార్‌, ఆర్డీవో స్థాయిలోనే భూ సమస్యలు సత్వరమే పరిష్కారమయ్యే విధంగా భూ భారతి కొత్త చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. ఇది భూముల హక్కుదారులకు ఎంతగానో ఉపయోగడుతుందన్నారు. ధరణి చట్టంలో రికార్డుల సవరణకు నియమం ఉండేది కాదని, తప్పుల సవరణకు కోర్టులకు వెళ్లాల్సి వచ్చేదని తెలిపారు. భూ భారతి చట్టంలో భూ రికార్డుల సవరణకు నియమాలను పొందుపరిచారని చెప్పారు. భూ యజమానుల హక్కుల రికార్డులు కొత్త చట్టంతో మరింత పటిష్టం కానున్నాయన్నారు. భూముల సర్వే కోసం ప్రభుత్వం సర్వేయర్లను నియమించనుందన్నారు. ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం నుంచి గ్రామపంచాయతీ కార్యాలయం వరకు జై బాపు, జై భీమ్‌, జై సంవిదాన్‌ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ వీరారెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి, ఉమ్మడి నల్లగొండ జడ్పీ మాజీ చైర్మన్‌ కసిరెడ్డి నారాయణరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ మెట్టు శ్రీనివా్‌సరెడ్డి, వైస్‌ చైర్మన్‌ గడ్డం బాలకృష్ణగౌడ్‌, ఇన్‌చార్జి తహసీల్దార్‌ భగత్‌, నాయకులు శ్యాంగౌడ్‌, నరేందర్‌ రెడ్డి, బాల్‌రెడ్డి, సత్తిరెడ్డి, పెంటయ్య గౌడ్‌, నిఖిల్‌ రెడ్డి, వెంకటేశ్‌ గౌడ్‌, బస్వయ్య పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2025 | 12:09 AM