ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కృష్ణా బేసిన వైపు కృష్ణమ్మ పరుగులు!

ABN, Publish Date - Jun 23 , 2025 | 12:39 AM

కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో ఎగువన కురుస్తున్న భారీ వర్షాల తో కృష్ణా బేసినలో సాగర్‌కు ఎగువన ఉన్న ప్రాజెక్టులకు ఈ ఏడాది నెల రోజుల ముందుగానే కృష్ణ మ్మ పరుగులు మొదలయ్యాయి.

(ఆంధ్రజ్యోతి-నాగార్జునసాగర్‌)

కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో ఎగువన కురుస్తున్న భారీ వర్షాల తో కృష్ణా బేసినలో సాగర్‌కు ఎగువన ఉన్న ప్రాజెక్టులకు ఈ ఏడాది నెల రోజుల ముందుగానే కృష్ణ మ్మ పరుగులు మొదలయ్యాయి. దీంతో సాగర్‌ ప్రా జెక్టుకు కూడా జూలై మొదటి వారంలోనే వరద రా క ప్రారంభం కావచ్చునని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి ఏడాది సాగర్‌ కు వరద రాక జూలై చివరి వారంలో మొదలవుతుంది. దీంతో ఆగస్టు రెండోవారం లేదా చివరివారం లో అధికారులు ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేస్తుంటారు. కానీ ఈ ఏడాది నెల రోజుల ముందుగానే సాగర్‌కు కూడా ఎగువ నుంచి వరద రాక ప్రారంభం కావచ్చునని అంచనాలు వేస్తుండడంతో ఎడమ కాల్వ ఆయకట్టు రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాగర్‌ ఎడమ కాల్వ ఆయకట్టులో ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో 6.50 లక్షల ఎక రాల విస్తీర్ణంలో వరి సాగు చేస్తున్నారు. ఆయకట్టులో ఇప్పటికే రైతులు నార్లు పోసుకొని దుక్కులు దున్నుకొని వానాకాలం సాగుకు సిద్ధంగా ఉన్నారు.

శ్రీశైలానికి ఎగువ నుంచి భారీ వరద

సాగర్‌కు ఎగువనున్న శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు జలవిద్యుత కేంద్రంలో విద్యుత ఉత్పత్తి చేయడం ద్వారా 37,160 క్యూసెక్కుల నీరు, క్రస్ట్‌ గేట్ల ద్వారా 12,203 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం ప్రాజె క్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు (215.8070 టీఎంసీలు) కాగా ఆదివారం సాయంత్రానికి 855.00 అడుగు లకు(215.8070టీఎంసీలకు) చేరుకుంది. సాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.0450టీఎంసీలు) కాగా ప్రస్తుతం 513.30 అడుగులు(139.0872 టీఎంసీలు)గా ఉంది. సాగర్‌ నుంచి జంటనగరాలకు తాగునీటి అవసరాల కోసం ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 450 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌ నుంచి కుడి, ఎడమ, వరద కాల్వలకు, ప్రధాన జలవిద్యుత కేంద్రానికి ఎలాంటి నీటి విడుదల లేదు. సాగర్‌కు ఎగువ నుంచి ఎలాంటి నీటి రాక లేదు.

ప్రతి ఏడాది ఆగస్టులోనే నీటి విడుదల

ప్రతి ఏడాది సాగర్‌ ఎడమ కాల్వ ఆయకట్టుకు ఆగస్టులోనే సాగు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌ ప్రాజెకు ్టకు వరద రాకపోవడంతో 2023-24 వ్యవసాయ సంవత్సరాన్ని రాష్ట్ర ప్రభుత్వం క్రాప్‌ హాలిడేగా ప్రకటించింది. దీం తో ఆ ఏడాది సాగర్‌ ప్రాజెక్టు ఎడమ కాలువ ఆయకట్టు లో బోర్లు,బావుల కింద సుమారు లక్ష ఎకరాలు మాత్రమే సాగు చేశారు. సాగర్‌ ప్రాజెక్టు పరిధిలో ఎడమ కాల్వ పరిధిలో నల్లగొండ, ఖమ్మం జిల్లాలో సాగవుతున్న 6.50 లక్షల ఎకరాలు సాగు నీరు లేక పోవడంతో 2023 వ్యవసాయ సంవత్సరంలో బీళ్లుగా మారాయి. 2024-25 వ్యవసాయ సంవత్సరంలో సాగర్‌కు ఎగువ నుంచి వరద రాక జూలైలో ప్రారంభం కావడంతో ఆగస్టు 2వ  తేదీ నుంచి ఎడమ కాల్వకు నీటి సాగు నీటి విడుదల చేశారు. 

Updated Date - Jun 23 , 2025 | 12:39 AM