కృష్ణా జలాలను చౌటుప్పల్, నారాయణపురం మండలాలకు మళ్లించాలి
ABN, Publish Date - Jun 27 , 2025 | 12:18 AM
చౌటుప్పల్ టౌన, జూన 26 (ఆంధ్రజ్యోతి): శివన్నగూడెం రిజర్వాయర్ నుంచి చౌటుప్పల్, సంస్థాన నారాయణపురం మండలాలకు కృష్ణా జలాలను మళ్లించేందుకు డీపీఆర్ (డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్టు)ను సిద్ధం చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
చౌటుప్పల్ టౌన, జూన 26 (ఆంధ్రజ్యోతి): శివన్నగూడెం రిజర్వాయర్ నుంచి చౌటుప్పల్, సంస్థాన నారాయణపురం మండలాలకు కృష్ణా జలాలను మళ్లించేందుకు డీపీఆర్ (డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్టు)ను సిద్ధం చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తన క్యాంప్ కార్యాలయంలో గురువారం సాగునీటి ప్రాజెక్ట్‌లపై నీటి పారుదల శాఖ అధికారులతో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. చౌటుప్పల్, సంస్థాన నారాయణపురం మండలాల్లోని బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు కృష్ణా జలాలలను మళ్లించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. నీటి పారుదల శాఖ అధికారులు రాములు, మనోహర్ పాల్గొన్నారు.
బెల్ట్ దుకాణాలపై కఠినంగా వ్యవహరించాలి
గ్రామాల్లో బెల్ట్ దుకాణాలను నిర్వహించే వ్యక్తులపై కఠినంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పోలీసులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో గురువారం బెల్ట్ దుకాణాలకు సంబంధించి పోలీసులతో ఎమ్మె ల్యే రాజగోపాల్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రజల అభీష్టం మేరకు గ్రామాల్లో చాలావరకు బెల్ట్ దుకాణాలను మూసివేశారని, దీంతో గ్రామాల్లో ఆరోగ్యకరమై న వాతావరణం నెలకొందన్నారు. ఇంకా కొన్ని గ్రామాల్లో పోలీసుల కండ్లు గప్పి గ్రామాల్లో అక్కడక్కడ బెల్ట్‌దుకాణాలు నిర్వహిస్తున్నట్లు తనకు సమాచారం వచ్చిందన్నారు. గ్రామాల్లో బెల్ట్ దుకాణాలను నిర్వహిస్తున్న వ్యక్తుల జాబితాను సిద్ధంచేయాల న్నారు.
Updated Date - Jun 27 , 2025 | 12:18 AM