కల్లేపల్లి ఆలయానికి రూ.48.66లక్షల ఆదాయం
ABN, Publish Date - Jun 24 , 2025 | 11:52 PM
దామరచర్ల, జూన 24(ఆంధ్రజ్యోతి): మం డలంలోని కల్లేపల్లి గ్రామ బంగారు మైసమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద వివిధ హక్కులకు మిర్యాలగూడ డివిజన పరిశీలకులు పి. ఏడుకొండలు సమక్షంలో మంగళవారం బహి రంగ వేలం నిర్వహించారు.
దామరచర్ల, జూన 24(ఆంధ్రజ్యోతి): మం డలంలోని కల్లేపల్లి గ్రామ బంగారు మైసమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద వివిధ హక్కులకు మిర్యాలగూడ డివిజన పరిశీలకులు పి. ఏడుకొండలు సమక్షంలో మంగళవారం బహి రంగ వేలం నిర్వహించారు. ఆలయానికి రూ. 48.66లక్షల ఆదాయం వచ్చినట్లు ఈ వో గుజ్జుల కొండారెడ్డి తెలిపారు. కొబ్బరికాయలు విక్రయ హక్కును కల్లేపల్లి గ్రామానికి చెందిన మాలోతు వినోద్‌కుమార్ రూ. 17.30 లక్షలకు, దున్నపోతులు సేకరించుకునే హక్కును ధీరావత వాగ్యా రూ.19.30లక్షలు, లడ్డూ ప్రసాదం విక్రయించే హక్కును ధీరావత నెహ్రూనాయక్ రూ.5.75 లక్షలకు, తలనీలాల సేకరణ హక్కును త్రిపురారానికి చెం దిన ఎ.చంద్రశేఖర్ రూ.2.20లక్షలకు, కొ బ్బరి చిప్పలు సేకరించే హక్కును మాలోతు జనార్దన రూ.2.10లక్షలు, పూలదండలు విక్ర యించే హక్కును కల్లేపల్లికి చెందిన మా లోతునెహ్రూనాయక్ రూ.2.01లక్షలకు దక్కించుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆల య కమిటీ ఛైర్మన ధీరావత దస్రూనాయక్, సభ్యులు మాలునాయక్, మా లోతు జనార్దన నాయక్, పాచ్చునాయక్ పాల్గొన్నారు.
Updated Date - Jun 24 , 2025 | 11:52 PM