ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వైటీపీఎ్‌సలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి

ABN, Publish Date - Jul 01 , 2025 | 12:34 AM

యాదాద్రి థర్మల్‌ విద్యుత పరిశ్రమ(వైటీపీఎ్‌స)లో స్థానికులైన తమకు ఉద్యోగాలు కల్పించడంతోపాటు పరిహారం అందించాలని వీర్లపాలెం గ్రామస్థులు డిమాండ్‌ చేశారు.

దామరచర్ల తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న వీర్లపాలెం గ్రామస్థులు

నల్లగొండ జిల్లా వీర్లపాలెం గ్రామస్థుల ఆందోళన

దామరచర్ల, జూన 30 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి థర్మల్‌ విద్యుత పరిశ్రమ(వైటీపీఎ్‌స)లో స్థానికులైన తమకు ఉద్యోగాలు కల్పించడంతోపాటు పరిహారం అందించాలని వీర్లపాలెం గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. సోమవారం ఈ మేరకు నల్లగొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలోఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ పరిశ్రమ ఏర్పాటు సమయంలో స్థానికులకు ఇంటికో ఉద్యోగంతోపాటు బాధిత గ్రామం కింద కుటుంబానికి రూ.5లక్షల పరిహారం చెల్లిస్తామని నాటి ప్రభుత్వం, అధికారులు తమకు హామీ ఇచ్చారని తెలిపారు. సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ హామీ నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ మిర్యాలగూడలోని సబ్‌ కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు సుమారు 300మంది గ్రామస్థులు వాహనాల్లో తరలివెళుతుండగా సమాచారం అందుకున్న పోలీసులు మార్గమధ్యలో వారిని అడ్డుకుని వెనక్కి వెళ్లాలని సూచించారు. దీంతో వారు అక్కడే బైఠాయించి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న సీఐ పీఎనడి.ప్రసాద్‌ సంఘటనా స్థలానికి చేరుకుని వారికి నచ్చజెప్పారు. అక్కడినుంచి తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్న గ్రామస్థులు ధర్నా చేపట్టారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పరిశ్రమ ఏర్పాటు తొలినాళ్లలో భూ సర్వే సందర్భంగా తమ గ్రామంలోని ప్రతీ ఇంటికో ఉద్యోగంతోపాటు నష్ట పరిహారం అందిస్తామని ఆనాటి ప్రభుత్వం, అధికారులు హామీ ఇవ్వడంతో పరిశ్రమ ఏర్పాటుకు సానుకూలత వ్యక్తం చేశామన్నారు. సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ తమను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయాలని గ్రామస్థులు కోరారు.

Updated Date - Jul 01 , 2025 | 12:34 AM