ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

డ్రగ్స్‌ రహిత జిల్లాగా నిలపాలి

ABN, Publish Date - Jun 26 , 2025 | 12:14 AM

మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలను నిర్మూలించి డ్రగ్స్‌ రహిత జిల్లాగా నిలపాలని కలెక్టర్‌ ఎం.హనుమంతరావు అన్నారు. నషా ముక్తి భారత్‌ అభియాన్‌లో భాగంగా బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు.

భువనగిరి (కలెక్టరేట్‌),జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలను నిర్మూలించి డ్రగ్స్‌ రహిత జిల్లాగా నిలపాలని కలెక్టర్‌ ఎం.హనుమంతరావు అన్నారు. నషా ముక్తి భారత్‌ అభియాన్‌లో భాగంగా బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. నషా ముక్తి భారత్‌ అభియాన్‌లో భాగంగా ఈ నెల 26వ తేదీన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా చూడాలన్నారు. విద్యాసంస్థల్లో మాదక ద్రవ్యాల నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని విద్యార్థులో ప్రతిజ్ఞ చేయించాలన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ, ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, అటవీశాఖాధికారి పద్మజారాణి, ఎక్సై జ్‌ సూపరింటెండెంట్‌ విష్ణుమూర్తి, జిల్లా సంక్షేమాధికారి నర్సింహారావు, డీఈ వో సత్యనారాయణ, డీపీవో సునంద, తదితరులు పాల్గొన్నారు.

భూభారతి దరఖాస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలి

భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అత్యం త ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌ ఎం.హనుమంతరావు అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మండలాల వారీగా వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. సక్సేషన్‌, పెండింగ్‌ మ్యుటేషన్‌, డాటా కరెక్షన్‌ దరఖాస్తులకు సంబంధించి రికార్డుల ను పరిశీలించాలని, అవసరమైతే క్షేత్రస్థాయి విచారణ నిర్వహించాలన్నారు.

(ఆంధ్రజ్యోతి, భువనగిరి టౌన్‌): హాస్టల్స్‌లో మెనూ పాటించకపోతే చర్యలు తప్పవని కలెక్టర్‌ హనుమంతరావు హెచ్చరించారు. బుధవారం భువనగిరి బైపాస్‌ రోడ్డులోని ఎస్టీ బాలికల పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టల్‌ను ఆయన తనిఖీ చేశారు. ఆయన వెంట డీఆర్డీవో నాగిరెడ్డి ఉన్నారు.

Updated Date - Jun 26 , 2025 | 12:14 AM