ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గిరాకేదీ గువ్వలచెన్నా?

ABN, Publish Date - May 29 , 2025 | 12:42 AM

కులవృత్తులకు ఒకప్పుడు ఎంతో ఆదరణ ఉండేది. ఎంతోమంది కులవృత్తులపై ఆధారపడి ఉపాధి పొందుతూ కుటుంబాలను పోషించుకునేవారు.

మట్టిపాత్రలకు తగ్గిన డిమాండ్‌

మార్కెట్‌ను ముంచెత్తుతున్న స్టీల్‌, ప్లాస్టిక్‌ వస్తువులు

ఉపాధి కోసం కులవృత్తికి స్వస్తి చెబుతున్న కుమ్మరులు

కులవృత్తులకు ఒకప్పుడు ఎంతో ఆదరణ ఉండేది. ఎంతోమంది కులవృత్తులపై ఆధారపడి ఉపాధి పొందుతూ కుటుంబాలను పోషించుకునేవారు. అందుకే కులవృత్తి మానకురా గువ్వల చెన్నా అన్నది ఒకప్పుటి నానుడి. రానురాను మారుతున్న కాలనుగుణంగా కులవృత్లుకు ఆదరణ కరువైంది. ప్రధానంగా ఏ కార్యమైనా ఉపయోగించే కుండల తయారు చేసే కుమ్మరుల పరిస్థితి ఇబ్బంది మారింది. రేడిమెడ్‌, ప్లాస్టిక్‌ వస్తువులు మార్కెట్లను ముంచెత్తుతుండటంతో చేతిపై తయారు చేసే వస్తువులకు గిరాకీ తగ్గింది. దీంతో ఉపాధి లేక పస్తులుండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

(ఆంధ్రజ్యోతి-రాజాపేట)

ఆదరణ కరువై కులవృత్తులు చేసేవారు ఇతర ఉపాధి మార్గాల వైపు మళ్లుతున్నారు. అనాదిగా వస్తున్న చేతివృత్తికి స్వస్తిపలుకుతున్నారు. శుభ, అశుభ కార్యమైనా ముందుగా వాడేది మట్టి పాత్రలు. ఆ పాత్రలు తయారుచేసే కుమ్మరుల పరిస్థితి నేడు ఆగమ్యగోచరంగా మారింది. యాదాద్రిభువనగిరి జిల్లా రాజాపేట మండలంలో 200 వందలకు పైగా కుటుంబాలు ఉండగా 1000కి పైగా జనాభా ఉంది. కులవృత్తినే ఆధారంగా చేసుకుని జీవిస్తున్న 25 కుటుంబాలు ఉన్నాయి. మండలంలోని చల్లూరు, బొందుగుల, పాంకుంట, సింగారం, పారుపల్లి గ్రామాల్లో కొంతమంది కులవృత్తిని కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా మట్టితో సారెపై వివిధ రకాల మట్టిపాత్రలను తయారుచేస్తున్నారు. ఆయా పాత్రల తయారీకి వినియోగించే నల్ల మెత్తటిమట్టి కొంతకాలంగా చెరువులు నిండకపోవటంతో స్థానికంగా లభించడంలేదు. దీంతో 20 కిలోమీటర్ల దూరంలోని సిద్ధిపేట జిల్లా నాగపురి గ్రామంలోని చెరువుల నుంచి ట్రాక్టర్ల ద్వారా తెచ్చుకుంటున్నారు. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది.

కుటుంబ సభ్యులతో కలిసి

ఒండ్రుమట్టిని ఎండలో ఆరబోసి బాగా చూర్ణం చేసి నీటితో తడిసి ఒక రోజు మక్కబెడతారు. ఆ తర్వాత రోజు మట్టిని మెత్తగా అయ్యే వరకూ ఉదయం తొక్కుతారు. ఇందులో ఇంట్లో సభ్యులందరూ పాల్గొంటారు. మెత్తగా తయారు చేసుకున్న మట్టిని సారెపై పెట్టి పాత్రలను తయారు చేస్తుంటారు. ఆ మెత్తటి పాత్రలను సల్పతో నున్నగా తీర్చిదిద్దుతారు. అనంతరం ఈ పాత్రలను నీడలో కొద్దిరోజులు, ఎండలో కొద్దిరోజులు ఆరబెట్టి వాములో కాల్చుతారు. ఆ తర్వాత మట్టిపాత్రలు పూర్తిస్థాయిలో వినియోగానికి తయారవుతాయి.

వివిధ రకాల ఆకృతిలో

కుమ్మరులు మట్టితో వివిధ రకాల ఆకృతిలో వస్తువులను తయారు చేస్తుంటారు. కుండలు, కంచులు, గురుగులు, దీపపు ప్రమిదలు, వండే పాత్రలను తయారుచేస్తున్నారు. అయితే వాటిని విక్రయించడం కుమ్మరులకు ఇబ్బందిగా మారింది. రెడీమెడ్‌, ప్లాస్టిక్‌ వస్తువులు, అల్యూమినియం, స్టీల్‌ పాత్రలు మార్కెట్‌లోకి రావడంతో మట్టితో తయారుచేసిన పాత్రలకు గిరాకీ లేకుండాపోయింది. పండుగలు, జాతర్లు, శుభ, అశుభ కార్యాలకు మాత్రమే కొనుగోళ్లు చేస్తున్నట్లు కుమ్మరులు తెలిపారు. మిగతా రోజుల్లో పెద్దగా గిరాకీ ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి కరువై చేతివృత్తిని వదిలి ఇతర వృత్తుల్లోకి వెళ్తున్న తరుణంలో కుమ్మరులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. మట్టితో చేసిన వస్తువులు విక్రయించేందుకు ఏర్పాట్లు చేయాలని, అందుకు తగ్గ చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని రాజాపేట మండల కుమ్మరి సంఘం నాయకులు కోరారు.

ఐదు దశాబ్దాలుగా వృత్తిలో...

రాజాపేట మండలం సింగారం గ్రామానికి చెందిన బోనాల వెంకటయ్య వయస్సు 70 ఏళ్లు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు. వారికి కల వృత్తే ఆధారం. తాను 17 ఏళ్ళ వయస్సు ఉన్నప్పటి నుంచి కుల వృత్తిని చేపట్టారు. వయస్సు మీద పడినా వృత్తిని మాత్రం విడవలేదు. సారెపై మట్టిపాత్రలను తయారుచేస్తున్నారు.రోజంతా కష్టపడిన కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదు. తయారుచేసిన మట్టి పాత్రలకు గిరాకీ లేకపోవడంతో జీవనం ఇబ్బందిగా మారింది. కుమ్మరులకు ప్రభుత్వం ఆసరా కల్పించి ఆదుకోవాలని ఆయన కోరారు.

Updated Date - May 30 , 2025 | 02:54 PM