చివరి భూములకు సాగునీటి అవస్థలు
ABN, Publish Date - May 24 , 2025 | 12:07 AM
వానాకాలం సీజన సమీపిస్తోంది. నైరుతి రుతుపవనాలు ఈసారి వారం ముందుగానే వస్తాయన్న సమాచారంతో నాగార్జునసాగర్ ఆయకట్టు రైతాంగం సాగుకు సన్నద్ధమైంది.
వానాకాలం సీజన సమీపిస్తోంది. నైరుతి రుతుపవనాలు ఈసారి వారం ముందుగానే వస్తాయన్న సమాచారంతో నాగార్జునసాగర్ ఆయకట్టు రైతాంగం సాగుకు సన్నద్ధమైంది. అధికశాతం మంది రైతులు మెట్ట దుక్కులు దున్నారు. మరో పక్షం రోజుల్లో ఆశాజనకంగా వర్షాలు కురిస్తే జూన చివరినాటికి నారుమడులు విత్తుకునేందుకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉండగా ప్రధాన ఎడమకాల్వ కట్టల లైనింగ్ దెబ్బతిని పూర్తిస్థాయిలో నీటి విడుదల లేక మేజర్ల కింది చివరి భూములకు నీరందక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు.
(ఆంధ్రజ్యోతి-మిర్యాలగూడ)
ప్రపంచబ్యాంకు నిధులతో గతంలో చేపట్టిన కాల్వ ఆధునికీకరణ పనులు పూర్తి స్థాయిలో చేయకపోవడం, ప్రస్తుతం చేపట్టాల్సిన మెయిన కెనాల్ మట్టి కట్టల లైనింగ్ పనులు ప్రతిపాదన ల దశలోనే ఉండటంతో చివరి భూములకు సాగునీరు అందేనా అని రైతులు సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మే మొదటి వారంలో ఉమ్మ డి నల్లగొండ జిల్లా ఇరిగేషన ప్రాజెక్టులపై జరిగి న సమీక్షా సమావేశంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బీఎల్‌ఆర్ మెయిన కెనాల్ లైనింగ్ దెబ్బతిని కట్టలు బలహీనపడ్డాయిని, మరమ్మతుల పను లు చేపట్టాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కోరడంతో అత్యవసరంగా చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని ఎన్నెస్పీ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఎన్నెస్పీ అధికారులు రూ.60.60 కోట్ల మెయిన కెనాల్ లైనింగ్ పనులకు, మేజర్ల షట్టర్లు, కల్వర్టుల పనులకు రూ.25 కోట్లకు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం.
అసంపూర్తిగా ఆధునికీకరణ పనులు
నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తి చేసి కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటి విడుదల జరిగి సు మారు 45 ఏళ్లకు కాల్వల మట్టి కట్టలు శిథిలావస్థకు చేరి జాలు, ఊటల ద్వారా నీరు వృథాగా పోతున్నాయి. తరుచుగా కట్టలు కోతకు గురవుతుండటంతో నిర్దేశించిన అయకట్టుకు సాగు నీరు అందకుండాపోతోంది. దీంతో కాల్వల వ్యవస్థను పటిష్ఠం చేయడం, వృథా నీటిని అరికట్ట డం, ఎత్తిపోతల ద్వారా దుర్భిక్ష ప్రాంతాలను, వర్షాభావ ప్రాంతాలను సుభిక్షం చేసే లక్ష్యంతో 2010లో ప్రపంచబ్యాంకుతో కుదిరిన ఒప్పందం మేరకు 48 శాతం రాష్ట్ర వాటాతో రూ.4444.41 కోట్లతో కాల్వ ఆధునికీకరణ పనులు చేపట్టారు. కుడి, ఎడమ కాల్వలకు లైనింగ్, డిసి్ట్రబ్యూటరీ కమిటీల ద్వారా మేజర్ కాల్వలు, వాటర్ యూ జర్ అసోసియేషన (నీటి సంఘం)ల ద్వారా మైనర్ కాల్వల ఆధునికీకరణ పనులకు తోడు డ్యామ్ మరమ్మతులు, ఎత్తిపోతల పథకాలకు మెకానికల్, ఎలకి్ట్రకల్ మరమ్మతులు తదితర పనులు చేపట్టారు. కాల్వనీటి విడుదల నిలివేసిన సమయంలో పనులు చేపడుతూ 2016లోపు పూర్తిచేయాలనే గడువు విధించినా పనులు పూర్తయ్యే వరకు మరో రెండేళ్ల సమయం పట్టింది.
నాలుగు సబ్‌డివిజనలు, 65 మేజర్లు
సాగర్ ఎడమకాల్వ హెడ్‌రెగ్యులేటర్ నుంచి సొరంగ మార్గం 1.89 కిలోమీటర్లు పోను 73.800 వరకు సబ్‌డివిజన 1.74 కిలోమీటర్ నుంచి 133 వరకు సబ్‌డివిజన-2, 134 నుంచి 180 కిలోమీటర్ వరకు సబ్‌డివిజన 3, 21 మెయిన బ్రాంచ కెనాల్ 0-102 వరకు 4 సబ్‌డివిజనలుగా ఏర్పాటుచేశారు. మొత్తం సబ్‌డివిజన్లలో 64 మేజర్లతో పాటు 160కి పైగా మైనర్ కాల్వలు ఉన్నాయి. సబ్‌డివిజన-1లోని 30 మేజర్లలో 2వేల ఎకరాలకు పైగా సాగునీరందించే రాజవరం, సూరేపల్లి, నారెళ్లగూడెం, ముదిమాణిక్యం, వజీరాబాద్, కిష్టాపూర్, ములకలకాల్వతో కలిపి ఆరు మేజర్లు ఉన్నాయి. కాగా ప్రధాన ఎడమకాల్వ పరిధిలో రాష్ట్రంలోని ఆరు నియోజకవర్గాల్లో సాగర్ ఆయకట్టు విస్తరించింది. ఎడమకాల్వ ద్వారా(ఎత్తిపోతల పథకాలతో కలిసి) నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 71.528, మిర్యాలగూడ 82.014, సూర్యాపేట 8,592, హుజూర్‌నగర్ 1,37,623, కోదాడ 60,944, పాలేరు నియోజకవర్గాల్లోని 7,623 ఎకరాలకు సాగునీరు అందుతోంది.
కాల్వకట్టల సామర్థ్యం పెంపు విషయంలో అశ్రద్ధ
సహజ సిద్ధంగా ఏర్పడిన వాగులపై యూటీలను ఏర్పాటుచేసి కాల్వనీరు పై నుంచి ప్రవహించేటట్లు నిర్మించారు. చిన్నచిన్న వాగులపై యూటీలు, మూసీ లాంటి పెద్ద నదులపై అక్విడేక్‌లు ఏర్పాటు చేసి నదులకు వరదలు వచ్చినప్పటికీ కాల్వలు దెబ్బతినకుండా కాకుండా నిర్మించారు. ఎడమకాల్వపై సుమారు 1,162 యూటీలు నిర్మించారు. వీటిలో కొన్ని యూటీలను ఆధునికీకరణ చేయకపోవడంతో లీకేజీలు ఏర్పడ్డాయి. మొదటిజోన పరిధిలో మేజర్లకు రాష్ట్రప్రభుత్వ నిధులతో లైనింగ్ పనులు పూర్తిచేసినా ప్రపంచ బ్యాంకు నిధులు ప్రాజెక్టు మరమ్మతుల పేరుతో ఇతర నిర్మాణాలకు ఎక్కువగా ఖర్చుచేసి కాల్వకట్టల సామర్థ్య పెంపునకు తక్కువ నిధుల కేటాయింపుతో ప్రధాన కాల్వ పూర్తిస్థాయి ఆధునికీకరణకు నోచుకోలేదు. లైనింగ్ చేయకుండా వదిలివేయడంతో తిరిగి కాల్వ కట్టలు కోతకు గురవుతూ వచ్చాయి. 50 కిలోమీటర్ల వద్ద కురియాతండా సమీపంలో ఎడమకాల్వ కాల్వకట్ట రెండు వైపులా లైనింగ్ ధ్వంసమైంది. 51వ మైలు రాయివద్ద గత ఏడాది లైనింగ్ పనులు పూర్తిచేసిన సమయంలోనే కాలువకు నీరు విడుదల చేయడంతో తిరిగి అక్కడి లైనింగ్ ఊడి కాలువలో పడిపోయింది. కాంట్రాక్టర్ తిరిగి లైనింగ్ మరమ్మతు పూర్తి చేసినా కాల్వలో పడిపోయిన మట్టిని వెలికి తీయకపోవడంతో కాలువ మధ్యలో దిబ్బగా తయారైంది. అనేకచోట్ల కాల్వలో పేరుకపోయిన సిల్ట్‌ను సైతం తొలగించడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వేములపల్లి యూటీ సమీపంలో 54.100 కిలోమీటర్ వద్ద లైనింగ్ దెబ్బతిని కాల్వకట్ట కుంగిపోయింది. అనేక చోట్ల లైనింగ్ పూర్తిస్థాయిలో దెబ్బతిన్నప్పటికీ ఇరిగేషన శాఖ ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతుందన్న ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు.
బలహీన మట్టికట్టలతో..
ఎడమకాల్వ కట్టలు ఏటేటా బలహీన పడుతుండటంతో కాలువ సామర్థ్యం కంటే తక్కువ నీరు విడుదల చేయడంతో ఆయకట్టు చివరి భూములకు నీరు అందడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. సాగర్ ప్రాజెక్టు ఎడమకాల్వ డిజైన ప్రకారం పూర్తిస్థాయిలో 11 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయాల్సి ఉంది. ఎడమకాల్వ ఆయకట్టు స్థిరీకరణ 10,37,796 ఎకరాలు కాగా నల్లగొండ, ఖమ్మం జిల్లాలో 6,62,580 ఎకరాల ఆయకట్టు ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 15 మండలాల్లోని వ్యవసాయ భూములకు సాగునీరు అందుతోంది. మిర్యాలగూడ సబ్‌డివిజన పరిధిలో 1,45,000 ఎకరాలు సాగవుతోంది. ఏటా కాల్వకట్టల మరమ్మతుల కారణంగా ఏరోజు పూర్తిస్థాయి నీటి విడుదల జరగలేదు. 8 నుంచి 9 వేల క్యూసెక్కుల వరకు మాత్రమే అధికారులు నీటిని విడుదల చేస్తూ వస్తున్నారు. మేజర్లకు నీటి పారుదల ప్రాంతాన్ని బట్టి 85 నుంచి 90 క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేయాల్సి ఉండగా 80 క్యూసెక్కులకు మించి విడుదల చేయడం లేదని తెలుస్తోంది. దీంతో ఆయకట్టు చివరి భూములకు సాగునీటి కొరత ఏర్పడుతోందని రైతులు ఆరోపిస్తున్నారు.
రూ.60.60 కోట్ల లైనింగ్ పనులకు ప్రతిపాదనలు ..
మిర్యాలగూడ డివిజన పరిధిలోని 4వ కిలోమీటర్ నుంచి 73.800 కిలోమీటర్ వర కు మెయిన కెనాల్ మట్టికట్టల లైనింగ్ మరమ్మతుల పనులకు రూ.60.60 కోట్లకు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. మేజర్లు, మైనర్లకు సంబంధించి 23 షట్టర్ల మెకానికల్ మరమ్మతుల పనులు, 5 కల్వర్టులు, ఫీడర్‌చానల్స్ ఏర్పాటుకు రూ.25 కోట్లకు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. గతేడాది లైనింగ్ పనులకు రూ.15.78 కోట్లు మంజూరుకాగా మరమ్మతు పనులను దక్కించుకున్న ఎస్‌ఎల్‌ఎనఎ్‌స ఏజెన్సీ సకాలంలో పూర్తి చేయకపోవడం, తాగునీటి అవసరాల దృష్ట్యా కా ల్వ నీరు విడుదల చేయాల్సి రావడంతో కట్ట కోతకు గురికావడంతో అదనంగా రూ.6.30 కోట్ల నిధులు వెచ్చించి మొత్తం రూ.22.08 కోట్లతో పనులు పూర్తిచేశారు. కాగా ఈ సీజనలో చేపట్టాల్సిన మరమ్మతుల పనులను అధికారులు గుర్తించినా ఇప్పటివరకు ప్రతిపాదనల దశలోనే ఉండటం గమనార్హం. నైరుతీ రుతుపవనాలు త్వరగా రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉన్నందున సమయానుకూలంగా వర్షాలు కురిస్తే వచ్చే వానాకాలం సీజనకు జూలై చివరి మాసంలో లేదంటే ఆగస్టు మొదటివారంలో ఎడమకాల్వకు సాగునీరు విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ లోగా పనులు ప్రారంభించి పూర్తి చే యడం సాధ్యం కాదని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరమ్మతు పనులు చేపట్టకపో తే ఈసారి పంటసాగులో చివరిభూముల రైతులకు ఇక్కట్లు తప్పేలాలేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తూములు, షట్టర్లు ఏర్పాటు చేయాలి
డిజైన డిశ్చార్జి ప్రకారం నీరు విడుదలయ్యేలా చూ డాలి.మెయిన కెనాల్ నుంచి మేజర్లకు నీరు వి డుదల చేసే సమయంలో షట్టర్లు వంగిపోయి ఉండటం తో త్వరగా తెరుచుకోకపోవ డం, వారబందీ సమయంలో తీవ్ర సమస్యలు తలెత్తుతున్నా యి.కాలువ నీటిద్వారా చెరువులు, కుంటల ను నింపేందుకు ఎడమకా ల్వ మేజర్, మైన ర్ కాల్వల నుంచి ఫీడర్‌చానల్స్ ఏర్పాటుచేయాలి. ఏటేటా ఊష్ణోగ్రత లు పెరిగిపోతున్నందున వేసవిలో పశువుల కు,ఊరు ప్రజలకు నీరుదొరికేలా, వ్యవసాయభూములకు సాగునీరందేలా చెరువులను ఉపయోగంలోకి తేవాలి. చివరి భూములకు నీరందేలా చెరువు కుంటలకు తూములు ఏర్పాటు చేసి చివరి భూముల రైతులను ఆదుకోవాలి.
- వేనేపల్లి పాండురంగారావు, మట్టిమనుషులు వేదిక కన్వీనర్
మరమ్మతులకు ప్రతిపాదనలు పంపాం
సబ్‌డివిజన పరిధిలో రూ.60.60 కోట్లతో ఎడమకాల్వ మెయిన కెనాల్ కాల్వ కట్ట సీసీ లైనింగ్, మరమ్మతు పనుల కోసం ప్రతిపాదనలు పంపాం. మేజర్లు, మైనర్ల వద్ద షట్టర్ల మరమ్మతులు, కల్వర్ట్‌ల నిర్మాణానికి మరో రూ.25 కోట్ల విలువైన ప్రతిపాదనలు పం పించాం. ప్రభుత్వ అనుమతులు రాగానేటెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తాం.
- వెంకటయ్య, ఈఈ, ఎనఎ ్‌సపి
Updated Date - May 24 , 2025 | 12:07 AM