ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రతీ పేదవానికి ఇందిరమ్మ ఇల్లు

ABN, Publish Date - Jul 03 , 2025 | 12:31 AM

కాంగ్రెస్‌ ప్రజా పాలనలో ప్రతీ పేదవానికి ఇందిరమ్మ ఇల్లు సొంతమవుతుందని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. బుధవారం మండలంలోని సైదాపురం గ్రామంలో ఎగ్గిడి స్వప్న బాలమల్లేష్‌ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ప్రభు త్వ విప్‌ బీర్ల అయిలయ్యతో కలిసి ప్రారంభించారు.

ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

యాదగిరిగుట్ట రూరల్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రజా పాలనలో ప్రతీ పేదవానికి ఇందిరమ్మ ఇల్లు సొంతమవుతుందని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. బుధవారం మండలంలోని సైదాపురం గ్రామంలో ఎగ్గిడి స్వప్న బాలమల్లేష్‌ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ప్రభు త్వ విప్‌ బీర్ల అయిలయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇల్లు లేక పేదలు ఇబ్బందులు పడ్డారన్నారు. రాష్ట్రం ఏర్పడితే దళితులకు మూడు ఎకరాల భూమి, పేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు, నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని చెప్పిన కేసీఆర్‌ ప్రజలను మోసం చేశారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒక్కోటి అమలు చేస్తున్నారన్నారు. పేదలకు కావాల్సిన ఇల్లు, కడుపు నిండా తినడానికి సన్నబియ్యంతోపాటు అర్హులందరికీ రేషన్‌ కార్డులు, రైతు భరోసా అందజేస్తున్నారన్నారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టి ముందు లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు తీసుకొని ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఇందిరమ్మ ఇల్లు నూతన గృహ ప్రవేశం చేసిన లబ్దిదారునికి విప్‌ బీర్ల అయిలయ్య ఇచ్చిన మాట ప్రకారంగా గొర్రెపొట్టేలు, దంపతులకు పట్టు వస్త్రాలు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య మాట్లాడుతూ ఇముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తుమ్మల నాగేశ్వర్‌రా వు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహకారంతో ఇప్పటివరకు నియోకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ హనుమంతరావు, అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు, ఆర్డీవో కృష్ణారెడ్డి, ఆలేరు మార్కెట్‌ చైర్మన్‌ అయినాల చైతన్యమహేందర్‌రెడ్డి, మదర్‌ డెయిరీ చైర్మన్‌ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, మాజీ సర్పంచ్‌ బీర్ల శంకర్‌, మాజీ ఉప సర్పంచ్‌ దుబ్బాల సురేఖవెంకట్‌రెడ్డి, శిఖ ఉపేందర్‌గౌడ్‌, నాయకులు మక్కెర్ల మల్లేశం, గుండ్లపల్లి భరత్‌గౌడ్‌, బందారపు భిక్షపతిగౌడ్‌, మంగ సత్యనారాయణ, గుండ్లపల్లి నర్సింహగౌడ్‌ పాల్గొన్నారు.

యాదగిరిగుట్ట: కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల్లో నాలుగు పథకాలు అమలు అవుతున్నాయని, మిగతావి త్వరలో అమలు చేస్తామని మంత్రి లక్ష్మణ్‌ అన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి దర్శించుకున్న అనంతరం బీర్ల ఐలయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు.

Updated Date - Jul 03 , 2025 | 12:31 AM