ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అసంపూర్తిగా సర్వీసు రోడ్ల నిర్మాణం

ABN, Publish Date - Jul 16 , 2025 | 12:36 AM

కేతేపల్లి, జూలై 15(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఇనుపాముల వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై బ్లాక్‌స్పాట్‌గా గుర్తించిన ప్రాంతంలో చేపట్టిన సర్వీసు రోడ్ల నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి.

నాటి 9వ నంబరు జాతీయ రహదారిని నాలుగు లేన్ల రహదారిగా విస్తరించినప్పుడు ఇనుపాముల గ్రామ శివారులోని మల్లన్నగుట్ట వద్ద యూటర్న్‌ కోసం జంక్షన్‌ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత బస్‌స్టేజీ వద్ద అండర్‌పాస్‌ వంతెన నిర్మించాక అండర్‌ పాస్‌ నుంచి హైవేకు ఇరువైపులా హైదరాబాద్‌ వైపు వంద మీటర్ల మేర మాత్రమే సర్వీసు రోడ్లు నిర్మించారు. దీంతో విజయవాడ వైపు వెళ్లే మార్గంలో మల్లన్నగుట్ట వద్ద గల యూటర్న్‌ జంక్షన్‌ వరకు హైవేకు ఇరువైపులా సర్వీసు రోడ్డు లేక గ్రామం నుంచి వెళ్లే రైతులు, పశువులు, గొర్రెలు, మేకల కాపరులతో పాటు ఇక్కడ నుంచి నకిరేకల్‌, తిప్పర్తి, వేములపల్లి, మాడ్గులపల్లి మండలాల్లోని దాదాపు 20కిపైగా గ్రామాలకు వెళ్లేవారు దశాబ్దానికిపైగా తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారు.సర్వీసు రోడ్డు లేకపోవడంతో పన్నెండేళ్లుగా ఇనుపాముల గ్రామస్థులతో పాటు పలువురు వాహనదారులు హైవేపై రాంగ్‌రూట్‌లో ప్రయాణిస్తూ ప్రమాదాలబారినపడిన ఘటనలు అనేకం ఉన్నాయి.

హైదరాబాద్‌-విజయవాడ మధ్య ప్రధాన రహదారిగా ఉన్న జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరిగే బ్లాక్‌స్పాట్‌లలో ఎన్‌హెచ్‌ఏఐ గతేడాది ప్రమాదాల నివారణకు చేపట్టిన చర్యల్లో భాగంగా ఇనుపాముల గ్రా మం వద్ద బ్లాక్‌స్పాట్‌గా గుర్తించిన ప్రాంతంలో సర్వీసు రోడ్ల నిర్మాణానికి ఆమోదం దక్కింది. ఈ క్రమంలో ప్రస్తుతం విజయవాడ వైపు వెళ్లే మార్గానికి కుడి వైపున మల్లన్నగుట్ట వరకు, ఎడమ వైపున గల హెచ్‌పీ పెట్రోల్‌ బంకు వరకు 18 అడుగుల వెడల్పు 1.2 కి.మీ.పొడవుతో సర్వీసు రోడ్ల నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఏఐ రూ.6 కోట్లు మంజూరు చేసింది. ఇందులో ఇనుపాముల బస్‌స్టేజీ వద్ద నిర్మించిన అండర్‌ పాసింగ్‌ వంతెన నుంచి విజయవాడ వైపునకు వంద మీటర్ల మేర గతంలో నిర్మించిన కొద్దిపాటి సర్వీసు రోడ్డు పొడిగింపుగా 18 అడుగుల వెడ ల్పు 1.2 కిలో మీటర్ల పొడవుతో గ్రామ శివారులోని మల్లన్నగుట్ట వరకు హైవేకు ఇరువైపులా సర్వీసు రోడ్లను నూతనంగా నిర్మించాల్సి ఉంది. ఈ పనుల నిర్వహణకు టెండర్లు దక్కించుకున్న హ ర్యానాకు చెందిన ఆర్‌కేసీ సంస్థ గతేడాది నవంబరులో పనులను ప్రారంభించింది. ఇందులో భాంగా హైవేకు ఇరువైపులా మల్లన్నగుట్ట వరకు గల కంపచెట్లు, బండరాళ్లను తొలగించి గంతలమయంగా ఉన్న మట్టిరోడ్డును యం త్రాల సాయంతో చదును చేసి కొంతవరకు బీటీ, మరికొంత కంకరతో రోడ్డు వేశారు. అవసరమైన మేర వంతెనలు, డ్రైనేజీ పనులు సైతం చేపట్టారు. కానీ నెల రోజులుగా సర్వీసు రోడ్డు నిర్మాణ పనులు అర్థాంతరంగా నిలిచి పోయాయి. సంబంధిత అధికారులు స్పందించి సర్వీసు రోడ్ల పనులు వెంటనే పూర్తి చేయించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jul 16 , 2025 | 12:36 AM