మేలుకోకుంటే ముప్పే
ABN, Publish Date - Jul 03 , 2025 | 12:24 AM
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునిసిపాలిటీల్లో ప్లాస్టిక్ సంచుల వినియోగం తగ్గడం లేదు. ఒక్క నల్లగొండ జిల్లాలోనే ప్రతి రోజూ 210 టన్నుల వ్యర్థాలు వెలువడుతుండగా అందులో మిర్యాలగూడలో 52 టన్నుల వ్యర్థాలు ఉంటున్నాయి.
(ఆంధ్రజ్యోతి- మిర్యాలగూడ టౌన / దేవరకొండ /ఆలేరు, మోత్కూరు/చౌటుప్పల్ టౌన/ సూర్యాపేట టౌన/ తిరుమలగిరి )
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునిసిపాలిటీల్లో ప్లాస్టిక్ సంచుల వినియోగం తగ్గడం లేదు. ఒక్క నల్లగొండ జిల్లాలోనే ప్రతి రోజూ 210 టన్నుల వ్యర్థాలు వెలువడుతుండగా అందులో మిర్యాలగూడలో 52 టన్నుల వ్యర్థాలు ఉంటున్నాయి. దేవరకొండలో అధికారులు అవగాహన కల్పిస్తున్నా ఫలితం కనిపించడంలేదు. చెత్త వేర్వేరుగా ఇచ్చేందుకు ఇచ్చిన బుట్టలను వినియోగించడం లేదు. ప్లాస్టిక్ కవర్లలోనే అంతా కలిపి పారిశుధ్య సిబ్బందికి అందిస్తున్నారు. చాలాచోట్ల 100 రోజుల ప్రణాళికలో భాగంగా తడి, పొడి చెత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. దేవరకొండలో మునిసిపల్, పోలీ్‌సశాఖ ఆధ్వర్యంలో తనిఖీలు చేసి రెండు దుకాణాలకు రూ.5వేల చొప్పున రూ.10వేల జరిమానాలు విధించారు. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన అధ్యక్షుడు ఎనవీటీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వాడకం ప్రమాదకరమని అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యపరుస్తున్నారు. మిర్యాలగూడ పట్టణంలో ప్లాస్టిక్ నిషేధం ప్రచారానికే పరిమితమైంది. యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరులో ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని అరికట్టడంలో అధికారులు విఫలమయ్యారు. మొక్కుబడిగా ఇద్దరు వ్యాపారులకు రూ.1000 చొప్పున జరిమానా విధించారు. డీఆర్‌సీసీ సెంటర్ లేకపోవడంతో వ్యర్థాల రీసైక్లింగ్ జరగడం లేదు. మోత్కూరులో 2022లో కొన్ని నెలల పాటు ప్లాస్టిక్ కవర్లు, ఇతర వస్తువుల వాడకంపై కొంత అజమాయిషీ కనిపించింది. ప్లాస్టిక్ కవర్లు,క్యారీ బ్యాగులు విక్రయించినా, వాటిని విని యోగించినా జరిమానాలు విధించారు. ఆ తర్వాత షరా మామూలైంది. రీసైక్లింగ్ యూనిట్ లేకపోవడంతో వ్యర్థాలనూ కాల్చేస్తున్నారు. ప్రతినెలా టన్ను ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ జరుగుతుందని మునిసిపల్ సిబ్బంది తెలిపారు.
తొలిరోజు జరిమానా.. ఆ తర్వాత...
మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా 2019 నుంచే స్వచ్ఛతా హిత సేవా కింద యాదాద్రిభువనగిరి జిల్లాలోని ఆరు మునిసిపాలిటీల్లో ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం అమల్లోకి వచ్చింది. తొలిరోజూనే ప్లాస్టిక్ కవర్‌లో పూలదండలు తెచ్చిన చౌటుప్పల్ మండల పరిషత కార్యాలయం అటెండర్ భిక్షపతికి రూ.500 జరిమానా విధించారు. పట్టణంలో ప్లాస్టిక్ సంచులను వాడుతున్న 100కు పైగా వ్యాపారులపై కేసులు నమోదు చేసి జరిమానా విధించారు. అయినా ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని పూర్తిగా నిరోధించలేకపోయారు.
సూర్యాపేట జిల్లాకేంద్రంలో ప్రతిరోజూ 500కిలోల ప్లాస్టిక్‌వ్యర్థాలను పారిశుధ్య సిబ్బంది సేకరిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థల అవగాహన కార్యక్రమాలు, ప్లాస్టిక్ వ్యర్థాలపై ప్రజల్లో పెరిగిన చైతన్యంతో 20శాతం ప్లాస్టిక్ విని యోగం తగ్గింది. ఈ ఏడాది 18 దుకాణాల్లో తనిఖీలు చేసి రూ.20వేల వరకు జరిమానా విధించారు. 150 కిలోల ప్లాస్టిక్‌ను వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
వ్యర్థాలతో వస్తువుల తయారీ
పట్టణంలో సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి వస్తువులను తయారుచేస్తున్నారు. ప్లాస్టిక్ ఇటుకలను, మ్యాట్‌లను, టైల్స్‌ను తయారుచేస్తున్నారు. ఇటుకలు కిలోకు రూ.28, ఆక్యూపెంచర్‌లా ఉపయోగపడే ప్లాస్టిక్ మ్యాట్‌లను రూ.100కు ఒకటి చొప్పున విక్రయిస్తున్నారు.
గ్రీనక్లబ్ ట్రస్టు ఆధ్వర్యంలో
సూర్యాపేటలో గ్రీన క్లబ్‌ట్రస్ట్ సభ్యులు పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా క్లాత సంచులను ఇంటింటికీ పంపిణీ చేస్తూ ప్రజలకు ప్లాస్టిక్ సంచులను నివారించాలని కోరుతున్నారు.
తిరుమలగిరిలో ప్లాస్టిక్ వినియోగంపై నామమాత్రంగా అవగాహన కల్పిస్తున్నారు. తడి, పొడి చెత్త సేకరణలోనూ అధికారులు సరైన అవగాహన కల్పించకపోవడంతో ప్రజలు వ్యర్థాలను కలిపిఇస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ రీసోర్స్‌సెంటర్ ఉన్నా ఇంతవరకూ ప్రారంభించలేదు. కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో కేంద్ర నిరుపయోగంగా మారింది. దీంతో వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోయాయి.
ఉద్యమంలో భాగస్వాములమవుతాం
ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమంలో ప్రజలు భాగస్వాములు అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆంధ్రజ్యోతి సర్వేలో వెల్లడైంది. ప్లాస్టిక్ సంచుల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని 100 మంది నుంచి వివిధ అంశాలపై అభిప్రాయాలను సేకరించగా ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమంలో 75 మంది భాగస్వాములం అవుతామనగా, 20 మంది ఆలోచిస్తామన్నారు. అదేవిధంగా వాడిన బాటిల్‌ను తిరిగి వాడతారా అన్న ప్రశ్నకు 50 మంది అవునని, 45 మంది వినియోగించమని, ఐదుగురు ఆలోచిస్తామన్నారు. ఇటీవల ప్లాస్టిక్ కవర్ల వినియోగం పెరిగిందని 80 మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. 18 మంది వినియోగించని వారు ఉన్నట్లు తేలింది.
Updated Date - Jul 03 , 2025 | 12:24 AM