ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆదమరిస్తే అంతే సంగతులు

ABN, Publish Date - May 27 , 2025 | 12:28 AM

భువనగిరి- గజ్వేల్‌ రహదారిపై మండలంలోని వీరారెడ్డి పల్లి- తిర్మలాపూర్‌ ఘాట్‌ రోడ్డు(అంజన్న గట్టు) ప్రమాదకరంగా మారింది.

ప్రమాదభరితంగా వీరారెడ్డిపల్లి ఘాట్‌రోడ్డు

తుర్కపల్లి, మే 26(ఆంధ్రజ్యోతి) ః భువనగిరి- గజ్వేల్‌ రహదారిపై మండలంలోని వీరారెడ్డి పల్లి- తిర్మలాపూర్‌ ఘాట్‌ రోడ్డు(అంజన్న గట్టు) ప్రమాదకరంగా మారింది. ఈ ఘాట్‌ రోడ్డు పూర్థిగా అర్ధ వలయాకారంలో రోడ్డుకు ఇరువైపులా 15మీటర్ల ఎత్తుతో ఉండడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ ఘాట్‌ రోడ్డుపై ప్రయాణమంటేనే ప్రయాణికులు, వాహన చోదకులు జంకుతున్నారు. ఘాట్‌రోడ్డు ఎక్కేటప్పుడు ఏ మాత్రం ఆదమరచినా లోయలో పడే ప్రమాదం ఉంది. ఈ రోడ్డుపై ఎంతో మంది వాహన దారులు ప్రమాదాలకు గురై మృతి చెందారు. ఎంతో మంది ప్రయాణికులు గాయాలకు గురైన సంఘటనలు ఉన్నాయి. కాగా ఆ రోడ్డు ఇటు హైద్రాబాద్‌-విజయవాడ, అటు రాజీవ్‌ రహదారికి ప్రధాన లింక్‌ రోడ్డు కావడంతో రోడ్డుకు ఆర్టీసీ బస్సులతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వందలాది వాహనాలు వెళుతుంటాయి. ఈ ఘాట్‌ రోడ్డు వలయాకారంతో పాటు ఎత్తుగా ఉండడంతో భారీ వాహనాలు, అధిక లోడ్‌తో వెళ్లే లారీలు అతి కష్టంగా ఎక్కుతున్నాయి. ఘాట్‌ రోడ్డు ఎక్కేటప్పుడు వాహనాల్లో ఏదైనా సాంకేతిక లోపం వచ్చినట్టైతే లోయలో పడిపోవాల్సిన పరిస్థితి ఉంది.

161ఏఏ జాతీయ రహదారిగా మార్పు

గతంలో స్టేట్‌ హైవేగా ఉన్న రోడ్డును ప్రభుత్వం 161ఏఏ జాతీయ రహదారిగా మార్చింది. సంగారెడ్డి-చౌటుప్పల్‌ వరకు 160 కిలోమీటర్ల దూరంతో ఏర్పడ్డ ఈ రోడ్డు నిర్వహణ బాధ్యతలను జాతీయ రహదారుల సంస్థ అధికారులు చూసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ రోడ్డు, హైద్రాబాద్‌- వరంగల్‌- భూపాలపల్లి, హైద్రాబాద్‌- విజయవాడ, రాజీవ్‌ రహదారుల వంటి ప్రధాన రహదారులను కలుపుతుంది. భవిష్యతలో ఇంకా వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశముంది. అధికారులు స్పందిం చి ప్రమాదాలు జరుగకుండా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు, వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.

ఘాట్‌ రోడ్డును తవ్వి, ఎత్తును తగ్గించాలి

ఈ రోడ్డు చాలా ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిందనిని, అప్పట్లో ఆధునిక టెక్నాలజీ లేకపోవడంతోఈ రోడ్డును ఎత్తు తగ్గించలేకపోయారని పలువురు పేర్కొంటున్నారు. జాతీయ రహదారుల సంస్థ అధికారులు ఈ రోడ్డును యంత్రాల సహాయంతో తవ్వి ఎత్తును తగ్గించి, రోడ్డును వెడల్పు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అంతే కాకుండా రోడ్డుకు ఇరువైపులా ప్రమాదాల బారిన పడకుండా గోడలు నిర్మించాలని కోరుతున్నారు. ఈ రోడ్డుపై ఉన్న మూలమలుపుల వద్ద ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని, శిఽథిలమైపోయిన కల్వర్టులకు మరమ్మతు పనులు చేపట్టాలను సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలి

ఈ రోడ్డుపై వారం పది రోజుల కోకసారి ఏదో ఒక ప్రమాదం జరుగుతోంది. రోడ్డు వలయాకారంతో ఉండడంతో పాటు ఘాట్‌ రోడ్డు ఎత్తుగా ఉండడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక పోవడంతో ప్రమాదాలకు గురవుతున్నారు. అంతేకాకుండా లోడ్‌ లారీలు రోడ్డుపై మధ్యలో ఆగిపోవంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు ఘాట్‌ రోడ్డుకు మరమ్మతు పనులు చేపట్టి ప్రమాదాలు నివారించాలి.

-జక్కుల వెంకటేష్‌, వీరారెడ్డిపల్లి

రోడ్డును సమాంతరంగా చేయాలి

ఈ ఘాట్‌ రోడ్డు వలయాకారంతో ఎత్తుగా ఉండడం వల్ల భారీ వాహనాలు ఎక్కకపోవంతో లారీలు వెనక్కి వచ్చి ప్రమాలకు గురవుతున్నాయి. అంతే కాకుండా ఈ రోడ్డు ప్రస్తుతం ఒక వైపు కుంగిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు ఎత్తును తగ్గించి సమాంతరంగా ఏర్పాటు చేసి ప్రమాదాలు నివారించాలి.

-నాంసాని సత్యనారాయణ, మాజీ సర్పంచ తిర్మలాపూర్‌

Updated Date - May 27 , 2025 | 12:28 AM