నందికొండ మునిసిపల్ కమిషనర్‌కు హెచఆర్‌సీ నోటీసులు
ABN, Publish Date - Jul 24 , 2025 | 12:17 AM
నాగార్జునసాగర్ హిల్‌కాలనీలో విజయవిహార్‌లోని తాగునీటి ట్యాంకులో 30కోతులు చనిపోయిన సంఘటనపై నందికొండ మునిసిపల్ కమిషనర్‌కు హెచఆర్‌సీ నోటీసులు జారీ చేసింది.
నాగార్జునసాగర్, జూలై 23 (ఆంధ్రజ్యోతి) : నాగార్జునసాగర్ హిల్‌కాలనీలో విజయవిహార్‌లోని తాగునీటి ట్యాంకులో 30కోతులు చనిపోయిన సంఘటనపై నందికొండ మునిసిపల్ కమిషనర్‌కు హెచఆర్‌సీ నోటీసులు జారీ చేసింది. గతేడాది ఏప్రిల్ 2వ తేదీన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో స్పందించిన ఎనఎస్పీ, మునిసిపల్ అదికారులు కోతుల కళేబరాలను నీటిట్యాంకులోంచి తీయించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అధికార, ప్రతిపక్ష నాయకులు, మానవహక్కుల సంఘం అధికారులు నీటి ట్యాంకును పరిశీలించారు. ప్రభుత్వం స్పందించి నీటిట్యాంక్‌ను కూల్చివేసి నివాస గృహాలకు పైప్‌లైన ద్వారా నేరుగా నీటిని సరఫరా చేయించింది. ఈ ఘటనపై సమాచార హక్కుల సంఘం ప్రజావేగు అధ్యక్షుడు కన్నెకంటి క్రాంతికుమార్ రాష్ట్ర మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన సంఘం నందికొండ మునిసిపల్ కమిషనర్‌కు ఈ ఘటనపై ఆగస్టు 4వ తేదీలోగా నివేదికలు అందజేయాలని నోటీసులు జారీ చేశారు.
ఈ నోటీసులను జిల్లా కలెక్టర్ ద్వారా బుధవారం నందికొండ మునిసిపల్ కమిషనర్ అందుకున్నారు. నివేదికను మానవ హక్కుల సంఘానికి అందజేస్తానని కమిషనర్ గురులింగం తెలిపారు.
Updated Date - Jul 24 , 2025 | 12:17 AM