ఈత సరదా తీరేదెలా?
ABN, Publish Date - May 14 , 2025 | 12:12 AM
వేసవి సరదాలు,శిక్షణల్లో ఈత ప్రధానమైనది. నేటి మధ్య వయసుకు పైబడిన వారందరూ గతంలో విస్తృతం గా ఉండే వ్యవసాయ బావులలో ఈత నేర్చినవారే.
ప్రైవేట్ ఫామ్‌హౌ్‌సలకు వెళ్లాల్సిన పరిస్థితి
భువనగిరి టౌన,మే 13 (ఆంధ్రజ్యోతి): వేసవి సరదాలు,శిక్షణల్లో ఈత ప్రధానమైనది. నేటి మధ్య వయసుకు పైబడిన వారందరూ గతంలో విస్తృతం గా ఉండే వ్యవసాయ బావులలో ఈత నేర్చినవారే. మరికొందరు సమీపంలోని వాగులు, చెరువుల్లో ఈ త కొట్టారు. కానీ రియల్ ఎస్టేట్ తదితర కారణాల తో వ్యవసాయ బావులు కనుమరుగు కాగా, నిర్వహణ లోపంతో చెరవులు, వాగులు ప్రమాదకరంగా మారాయి. దీంతో నేటితరం ఈత సరదాలు తీరాలంటే ఓ ప్రయాసగా మారింది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రం భువనగిరి పట్టణంలో స్విమ్మింగ్ పూ ల్ నిర్మిస్తామని నాయకులు, అధికారులు దశాబ్దాలుగా ఇస్తున్న హామీలు ఎండమావులను తలపిస్తున్నాయి. దీంతో పిల్లలు ఈత నేర్చుకోవాలన్నా, పెద్ద ల ఈత సరదా తీరాలన్నా ప్రైవేట్ ఫామ్‌హౌ్‌సలలోని స్విమ్మింగ్ పూల్స్‌ను ఆశ్రయించాల్సిన పరిస్థితి. అయితే ఫీజు చెల్లించలేక, దూరంగా ఉండే ఫామ్‌హౌ్‌సలకు వెళ్లలేక పలువురు పిల్లలు, పెద్దలు ఈత సరదాలకు దూరమవుతున్నారు.
దశాబ్దాల కల
స్విమ్మింగ్ పూల్ భువనగిరి వాసుల దశాబ్దాల కల.పట్టణ సమస్యల ప్రస్తావన వచ్చిన ప్రతి సందర్భంలో, అన్ని స్థాయిల ఎన్నికల్లో స్విమ్మింగ్ పూల్‌హామీ తప్పనిసరిగా ఉండటం పరిపాటిగా మారిం ది. స్విమ్మింగ్ పూల్ నిర్మాణం పేరిట గతంలో స్థల ఎంపిక, అంచనాలు, డీపీఆర్ కూడా పూర్తి చేశారు. నిర్మాణం పూర్తయ్యాక మునిసిపల్ ఆధ్వర్యంలో నిర్వహించాలని నిర్ణయం కూడా జరిగింది. కానీ ఆ హామీలన్నీ ప్రజలను ఊరించాయి తప్ప కార్యరూ పం దాల్చలేదు. పట్టణ శివారులో కొంత కాలం క్రి తం వరకు ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్ వేసవిలో నిర్ధేశిత చార్జీలతో ఔత్సాహికుల ఈత సరదాలను తీర్చే వి. కానీ పలు కారణాలతో నిర్వాహకులు కొంతకా లం క్రితం మూసివేశారు. దీంతో ఈత నేర్చుకోవాలనుకున్న చిన్నారులకు ప్రతీ వేసవి నిరాశను మిగిలిస్తోంది. నీటి ప్రమాదాల నుంచి రక్షణ పొందడానికి,శారీరక పటుత్వానికి ఈత ఎంతో దోహదపడుతుంది.కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలకు కూడా ఈత పరిష్కారం చూపుతుంది. ఇంతటి ప్రాధ న్యం ఉన్న ఈత కొట్టే అవకాశాలను కల్పించాలని, దీర్ఘకాలిక ఎదురుచూపులు నెరవేరేలా స్విమ్మింగ్ పూల్ నిర్మించాలని పట్టణ వాసులు కోరుతున్నారు.
వచ్చే వేసవి నాటికి అందుబాటులోకి తెస్తాం
భువనగిరిలో స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి పరిశీలి స్తాం. నేను కూడా చిన్నప్పు డు మా వ్యవసాయ బావి లో ఈత కొట్టాను. కానీ నేడు ఆ పరిస్థితుల్లో లేవు. దీంతో ప్రజల ఆరోగ్యం, సరదా కోసం స్విమ్మింగ్ పూల్ నిర్మిస్తాం. పట్టణ వాసుల దీర్ఘకాలిక ఆకాంక్షను నెరవేరుస్తాం. ఈ మేరకు అధికారులతో చర్చిస్తాం. వచ్చే వేసవి నాటికి స్విమ్మింగ్ పూల్‌ను అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రయత్నిస్తాం.
- కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే
ఈత నేర్చుకోవాలని ఉంది
స్విమ్మింగ్ అంటే నాకు చాలా ఇష్టం. నేర్చుకోవాలని చాలా ఆశగా ఉంది. కానీ స్విమ్మింగ్ పూల్స్ అందుబాటులో లేకపోవడంతో నా ఇష్టం నెరవేరడం లేదు. దీంతో స్విమ్మింగ్ పూల్స్, స్విమ్మింగ్‌ను సినిమాల్లో చూడటం వరకే పరిమితమవుతున్నాను. చిన్నప్పుడే ఈత నేర్చుకుంటే పెద్దయ్యాక కూడా ఉపయోగపడుతుంది.
- ఆర్.మాన్విక, ఏడో తరగతి, భువనగిరి
ఈతతో ఆరోగ్యం
ఈత ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతుంది. క్రమంగా ఈత కొట్టే వారిలో శ్వా సకోశ, ఊపిరితిత్తులు, గుండె ఆధారిత తదితర ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి. మానసిక ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం లభిస్తుం ది. దీంతో వీలైనప్పుడల్లా ఈత కొట్టడం మంచి ది. లేనిపక్షంలో కనీసం వేసవిలోనైనా తప్పనిసరిగా తీకొట్టేలా ప్రణాళిక రూపొందించుకోవాలి.
- డాక్టర్ ఓవైసీ, భువనగిరి
Updated Date - May 14 , 2025 | 12:12 AM