ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రాజుకు ఇల్లు మంజూరు

ABN, Publish Date - Jul 04 , 2025 | 12:19 AM

ఇందిరమ్మ ఇల్లు వస్తుందన్న ఆశతో ఉన్న ఇంటిని కూల్చుకున్న నల్లగొండ శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన బట్ట రాజుకు ఎమ్మెల్యే మందుల సామేల్‌ ఇల్లు మంజూరు చేశారు.

ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన

ఇల్లు మంజూరు చేయాలని ఆదేశించిన ఎమ్మెల్యే

శాలిగౌరారం, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇల్లు వస్తుందన్న ఆశతో ఉన్న ఇంటిని కూల్చుకున్న నల్లగొండ శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన బట్ట రాజుకు ఎమ్మెల్యే మందుల సామేల్‌ ఇల్లు మంజూరు చేశారు. కమ్యూనిటీ హాల్‌లో ఉంటున్న రాజు దీనస్థితిపై ఈ నెల 3న ఆంధ్రజ్యోతి పత్రికలో మాటలు నమ్మి, గూడూ తీసేశాడు శీర్షికన కథనం ప్రచురితమైంది. గురువారం శాలిగౌరారంలో ఓ సభకు హాజరైన ఎమ్మెల్యే ఈ కథనాన్ని చదివి రాజుకు ఇల్లు చేయాలని ఎంపీడీవో గార్లపాటి జ్యోతిలక్ష్మిని ఫోనలో ఆదేశించారు. ఆ నివేదికను కలెక్టర్‌కు పంపించాలన్నారు. వెంటనే రాజు కుటుంబసభ్యులు ఎంపీడీవో జ్యోతిలక్ష్మి వద్దకు వెళ్లి వారి కుటుంబ సభ్యుల వివరాలను తెలిపారు.

ఆంధ్రజ్యోతికి కృతజ్ఞతలు తెలిపిన రాజు4

తన కుటుంబ సభ్యుల బాధను వెలుగులోకి తీసుకువచ్చి ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు కారణమైన ‘ఆంధ్రజ్యోతి’కి రాజుతో పాటు భార్య రమణ, కుమార్తెలు నాగశ్రీ, భవ్యశ్రీలు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jul 04 , 2025 | 12:19 AM