వేదాలకు నిలయం.. యాదగిరిగుట్ట
ABN, Publish Date - Jul 07 , 2025 | 12:13 AM
అం తర్జాతీయ ఆధ్యాత్మిక క్షేత్రం.. యాదగిరిగుట్ట దే వాలయం వేదాలకు నిలయంగా మారనుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. యాదగిరిగుట్ట క్షేత్రానికి ఎదురుగా ఉన్న పెద్దగుట్టపై టెంపుల్ సిటీ ఆవరణలో నిర్మించనున్న వేద పాఠశాల ప్రహరీ నిర్మాణాని కి ఆదివారం భూమి పూజ చేశారు.
ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
యాదగిరిగుట్ట, జూలై 6 (ఆంధ్రజ్యోతి): అం తర్జాతీయ ఆధ్యాత్మిక క్షేత్రం.. యాదగిరిగుట్ట దే వాలయం వేదాలకు నిలయంగా మారనుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. యాదగిరిగుట్ట క్షేత్రానికి ఎదురుగా ఉన్న పెద్దగుట్టపై టెంపుల్ సిటీ ఆవరణలో నిర్మించనున్న వేద పాఠశాల ప్రహరీ నిర్మాణాని కి ఆదివారం భూమి పూజ చేశారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా పాఠశాల ప్రాం గణంలో మొక్కను నాటి మాట్లాడారు. తొలి ఏకాదశి పర్వదినాన రూ.46 కోట్లతో నిర్మితం కానున్న వేద పాఠశాల ప్రహరీకి భూమి పూజ చేసుకోవడం శుభపరిణామన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా వేదపాఠశాలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సంకల్పించిందన్నారు. కార్యక్రమంలో దేవాదాయ కమిషనర్, ఆలయ ఈవో ఎస్. వెంకట్రావు, డీఈవో దోర్భల భాస్కరశర్మ, ఉప ప్రధానార్చకుడు భట్ట ర్ సురేంద్రచార్యులు, వేద పండితుడు శ్రీనివాసాచార్యులు, దేవస్థానం సివిల్ ఈఈ జిల్లెల ద యాకర్‌రెడ్డి, పర్యవేక్షకుడు నటరాజ్, సివిల్ ఏఈ గూడెం శ్రీనివా్‌సరెడ్డి, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, నాయకులు గుండ్లపల్లి భరత్, పట్టణ ఇన్‌స్పెక్టర్ బొడ్డుపల్లి భాస్కర్, ఎస్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ కే. శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలి
ఆలేరు: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని బీర్ల అయిలయ్య అన్నారు. ఆదివారం ఉదయం ఆయన మార్నింగ్ వాక్‌లో భాగంగా ఆలేరు మునిసిపల్‌లోని అన్ని వార్డుల్లో కాంగ్రెస్ నాయకులతో కలిసి కలియతిరిగారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఏవైనా ఇబ్బందులుంటే చెప్పాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పట్టణంలో జరుగుతున్న రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు పరిశీలించారు. ఆయన వెంట మునిసిపల్ కమిషనర్ శ్రీనివాస్, హౌసింగ్ ఏఈ జ్యోతి, కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వరరాజు, ఎజాజ్, నాయకులు గంధమల్ల అశోక్, ఎగ్గిడి శ్రీశైలం, రవి, రాములు, జెట్ట సిద్ధులు, భాస్కర్, వెంకటేశ్వర్ రెడ్డి, నీలం వెంకటస్వామి, పద్మ, సాగర్‌రెడ్డి, అనిత, మల్లేశ్ పాల్గొన్నారు.
Updated Date - Jul 07 , 2025 | 12:13 AM