ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నిందితులను తేల్చేందుకు హైలెవల్‌ కమిటీ

ABN, Publish Date - Jun 17 , 2025 | 12:20 AM

ఆధ్యాత్మిక క్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహస్వామివారి సన్నిధిలో మే 28న వెలుగుచూసిన చింతపండు దొంగతనం దోషులను తేల్చేందుకు మరో కమిటీ ఏర్పాటైంది.

పాత కమిటీని రద్దు చేసిన ఈవో

అడిషనల్‌ కమిషనర్‌ నేతృత్వంలో మరో నలుగురితో హైలెవల్‌ కమిటీ

చింతపండు చోరీపై విచారణ ప్రారంభించిన కమిటీ

యాదగిరిగుట్ట, జూన 16 (ఆంధ్రజ్యోతి) : ఆధ్యాత్మిక క్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహస్వామివారి సన్నిధిలో మే 28న వెలుగుచూసిన చింతపండు దొంగతనం దోషులను తేల్చేందుకు మరో కమిటీ ఏర్పాటైంది. దొంగలను పట్టుకునేందుకు మొదట డీఈవో దోర్భల భాస్కరశర్మ, ఏఈవో ప్రతాప నవీనకుమార్‌శర్మ, పర్యవేక్షకులు ముద్దసాని నరేష్‌, దాసోజు నరేష్‌, ఎస్పీఎఫ్‌ ఇనస్పెక్టర్‌ కే.శేషగిరిరావులతో కూడిన కమిటీ నియమించారు. పారదర్శంకగా విచారణ జరగదనే ఫిర్యాదులతో ఈవో వెంకట్రావు కమిటీని రద్దుచేశారు. అయితే కేసును పునర్విచారణ చేసేందుకు దేవాదాయ శాఖ అడిషనల్‌ కమిషనర్‌ శ్రీనివాసరావు నేతృత్వంలో రీజనల్‌ అదనపు కమిషనర్‌ (ఆర్జేసీ) వినోద్‌రెడ్డి, నల్లగొండ, రంగారెడ్డి, సికింద్రాబాద్‌ అసిస్టెంట్‌ కమిషనర్లు భాస్కర్‌, ఆకునూరి చంద్రశేఖర్‌, సంధ్యారాణితో కూడిన హైలెవల్‌ కమిటీ ఏర్పాటు ఏర్పాటు చేశారు. సోమవారం ఈ కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో విచారణ ప్రారంభించారు.

విచారిస్తూ, రికార్డులు చూస్తూ

కొండపైకి ఉదయం చేరుకున్న హైలెవల్‌ కమిటీ సభ్యులు ముందుగా ప్రధాన కార్యాలయంలో ప్రసాదాల విభాగం అధికారులు ఏఈవో గజ్వేల్లి రఘు, పర్యవేక్షకుడు సత్యనారాయణశర్మ, ప్రిపరేషన ఇనచార్జి(సీనియర్‌ అసిస్టెంట్‌) పులేపాక నవీన, వంటస్వాములు సంతో్‌షచార్యులు, క్రిష్ణమాచార్యులును పిలిపించి రికార్డులను తనిఖీ చేసింది. దొంగతనం జరిగిన రోజున స్టాక్‌ ఎంత ఉండాలి? ఎంత ఉంది? చింతపండు బస్తాలను ఎక్కడ భద్రపర్చారు? ఎక్కడి నుంచి తరలించారు? వంటస్వాములు ఎన్నిగంటలకు వస్తారు? ఎన్ని గంటల వెళ్లిపోతారు? దొంగతనానికి పాల్పడి వారితో ఎవరికైనా సంబంధం ఉందా? లేక మీ ప్రమేయం ఉందా? అని ప్రశ్నించినట్లు తెలిసింది. అదేవిధంగా ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ యాదగిరిని కూడా కమిటీ ప్రశ్నించి దొంగతనం జరిగిన విధానంపై ఆరా తీశారు. వీటితో పాటు సీసీ కెమెరాలు పనిచేసేది? లేనిది? ఆరా తీసింది.

ప్రసాదాల తయారీ కేంద్రం సందర్శన

భోజన విరామం తర్వాత కమిటీ సభ్యులు దొంగతనం జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు. దొంగతనానికి వినియోగించిన కారు పార్క్‌ చేసిన చోటకు చేరుకొని ఎస్పీఎఫ్‌ సిబ్బంది నుంచి సమాచారం సేకరించారు. తర్వాత కన్వేయర్‌ బెల్ట్‌ వద్దకు(శివాలయం ఎదురుగా) చేరుకొని పరిసరాలను పరిశీలించారు. అక్కడి నుంచి ప్రసాదాల తయారీ కేంద్రం లోనికి చేరుకునే ముందు విక్రయశాల ముఖ ద్వారం, లోపల అల్యూమినియంతో చేసిన తలుపులు, వాటికి బిగించిన జాలీని పరిశీలించగా దొంగతనం చేసేందుకు అనువుగా ఉందని సభ్యులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ప్రసాదాల విక్రయశాలను పూర్తిగా అల్యూమినియంతోనే తయారుచేసినట్లు కమిటీ దృష్టికి వచ్చింది. తయారీ కేంద్రం లోపల కన్వేయర్‌ బెల్ట్‌ వద్ద పరిశీలిస్తుండగా బెల్ట్‌కు (చతురస్రాకారంలో ఏర్పాటు చేసిన) తలుపుకు ఎడమ పక్కన రెండు షీట్లు ఊడిపోయాయి. షీట్లు ఊడిపోయిన విషయం అధికారుల దృష్టికి తీసుకుపోయినట్లు ప్రిపరేషన ఇనచార్జి తెలిపారు. రాత్రి 8 గంటల వరకు విచారణ సాగింది. హైలెవల్‌ కమిటీ మంగళవారం తన నివేదికను తయారుచేసి బుధవారం దేవాదాయ కమిషనర్‌కు అందజేయనున్నట్లు తెలుస్తోంది. విచారణ సమయంలో డీఈవో దోర్భల భాస్కరశర్మ, ఎస్పీఎఫ్‌ ఇనస్పెక్టర్‌ శేషగిరిరావు, ఎస్‌ఐ సీతారాములు ఉన్నారు.

Updated Date - Jun 17 , 2025 | 12:20 AM