ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి.
ABN, Publish Date - May 17 , 2025 | 12:41 AM
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వేగవం తం చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు ఉత్తమ్, తుమ్మల, పొన్నం
భువనగిరి (కలెక్టరేట్), మే 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వేగవం తం చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. యాసంగి 2024-25 ధాన్యం కొనుగోళ్లపై హైదరాబాద్ నుంచి శుక్రవారం పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్‌తో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రైతులు తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రభు త్వ మద్దతు ధర పొందడానికి వెంటనే ట్యాబ్ ఎంట్రీ చేయాలన్నారు. మద్దతు ధర ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని సకాలంలో మిల్లులకు తరలించాలన్నారు. సన్నబియ్యం పంపిణీ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, ప్రజాపాలన, మీసేవా కేంద్రాల ద్వారా వచ్చిన రేషన్ కార్డుల విచారణ త్వరలో పూర్తి చేయాలన్నారు.
ధాన్యం కొనుగోలు లక్ష్యం చేరుకున్నాం : కలెక్టర్
ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరుగుతోందని, ఇప్పటికే 2.37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.452 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు లక్ష్యం చేరుకున్నామని, రానున్న మరో 15 రోజుల్లో లక్ష టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. అకాల వర్షాల దృష్ట్యా కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం రాశులను తరలించడానికి ప్రత్యేక అధికారులను నియమించి సూచలనిచ్చామన్నారు. రోజువారి కొనుగోళ్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత సంవత్సరంతో పోల్చితే ఇప్పటివరకు కొనుగోళ్లు ఎక్కువగానే జరి గాయన్నారు. కాన్ఫరెన్స్‌లో జిల్లా పౌర సరఫరాల అధికారి రోజారాణి, డీఎం హరికృష్ణ, డీసీవో మురళీ, జిల్లా వ్యవసాయాధికారి గోపాల్, డీఆర్‌డీవో టీ.నాగిరెడ్డి పాల్గొన్నారు.
Updated Date - May 17 , 2025 | 12:44 AM