ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రేపు పోచంపల్లికి గవర్నర్‌ రాక!

ABN, Publish Date - Jun 11 , 2025 | 12:46 AM

భూదాన్‌పోచంపల్లిని గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ ఈ నెల 12వ తేదీన సందర్శించనున్న ట్లు తెలిసింది.మంగళవారం కలెక్టర్‌ హనుమంతరావు పోచంపల్లిలో పలువురు మగ్గం కార్మికులతో మాట్లాడారు.

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌

భూదాన్‌పోచంపల్లి, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): భూదాన్‌పోచంపల్లిని గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ ఈ నెల 12వ తేదీన సందర్శించనున్న ట్లు తెలిసింది.మంగళవారం కలెక్టర్‌ హనుమంతరావు పోచంపల్లిలో పలువురు మగ్గం కార్మికులతో మాట్లాడారు. గవర్నర్‌ పర్యటనలో భాగంగా చేనేత మగ్గాల పనితీరు, కార్మికుల జీవన స్థితిగతులపై అభిప్రాయాల సేకరణ, చేనేత నైపుణ్యం, ఇక్కత్‌ విశిష్ఠత తదితర అంశాలపై కార్మికులతో మాట్లాడే ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఆయన వెంట చేనేత జౌళీశాఖ జేడీలు వెంకటేశ్వర్‌రావు, ఇందుమతి, రీజనల్‌ డీజీ పద్మ, జిల్లా ఏడీ శ్రీనివా్‌సరావు, చౌటుప్ప ల్‌ ఆర్డీవో శేఖర్‌రెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌ అంజన్‌రెడ్డి, తహసీల్దా ర్‌ శ్రీనివా్‌సరెడ్డి, పోచంపల్లి చేనేత టైఅండ్‌డై అసోసియేషన్‌ అధ్యక్షుడు భారత లవకుమార్‌, అర్బన్‌ బ్యాంకు చైర్మన్‌ తడక రమేష్‌, చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు, నాయకులు భార త భూషణ్‌, బిట్ల గణేష్‌, బొమ్మ హరిశంకర్‌, మురళి పాల్గొన్నారు.

Updated Date - Jun 11 , 2025 | 12:46 AM