ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రైవేటు నుంచి ప్రభుత్వ బడికి..

ABN, Publish Date - Jun 30 , 2025 | 12:37 AM

ఇది మా బడి.. చదువుల తల్లి చల్లని ఒడి. బుడి బుడి అడుగుల నుంచి భవిష్యత్‌కు బాటలు వేసుకునేదాకా వెన్నంటే ఉండి బతుకు పాఠాలు నేర్పుతుంది. నాడు దేదీప్యమానంగా వెలుగొందిన బడి రానురాను ఆలనా పాలనా లేకుండా పోయింది.

మోత్కూరు జడ్పీహెచ్‌ఎ్‌సలో 150కి చేరువలో అడ్మిషన్లు

పాఠశాల అభివృద్ధికి దాతల చేయూత

(ఆంధ్రజ్యోతి-మోత్కూరు): ఇది మా బడి.. చదువుల తల్లి చల్లని ఒడి. బుడి బుడి అడుగుల నుంచి భవిష్యత్‌కు బాటలు వేసుకునేదాకా వెన్నంటే ఉండి బతుకు పాఠాలు నేర్పుతుంది. నాడు దేదీప్యమానంగా వెలుగొందిన బడి రానురాను ఆలనా పాలనా లేకుండా పోయింది. పాశ్చాత్య విద్యకోసం ప్రైవేట్‌ బాట పట్టడంతో ప్రభుత్వ బడులను పట్టించుకోలేదు. అయితే కొంత కాలంగా ప్రభుత్వ పాఠశాలలకు పునర్‌వైభవం వస్తుండడంతో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. మోత్కూరు ఉన్నత పాఠశాలలలో 150కి చేరువలో కొత్త అడ్మిషన్లు రావడం ఇందుకు తార్కాణం.

విద్యార్థులు గతంలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు బడులకు వెళ్లేవారు. ఆ చరిత్రను చెరిపేస్తూ ఈ ఏడాది ప్రైవేటు బడుల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వచ్చేలా మోత్కూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆకట్టుకుంటూ గత చరిత్రను తిరగరాస్తోంది. ఈ సంవత్సరం ఎస్‌ఎ్‌ససీలో 88 మంది విద్యార్థులు పరీక్ష రాయగా వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. ఆరుగురు విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించారు. వారికి డాక్టర్‌ రామారావు ఇటీవల ఒక్కొక్కరికి రూ.5,016 చొప్పున నగదు బహుమతి ఇచ్చి అభినందించారు. అందులో ముగ్గురు విద్యార్థులు ప్రభు త్వ ఖర్చుతో కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాలల్లో చదివేందు కు ఎంపికయ్యారు. గత ప్రభుత్వంలో ‘మన బస్తీ-మన బడి’ పథకంలో పాఠశాల అభివృద్ధికి రూ.54 లక్షలు మం జూరయ్యాయి. ఇల్లు పీకి పందిరి వేశారన్న సామెతలా కాంట్రాక్టర్‌ పాఠశాల తరగతి గదుల్లో నాలుగు ఫ్యాన్లు ఉం డగా వాటిని తొలగించి రెండు ఫ్యాన్లే బిగించాడు. ఫ్యాన్‌, లైట్‌కు ఒకే స్విచ్‌ (ఆఫ్‌ ఆన్‌) అమర్చాడు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం చేయడానికి ప్రభుత్వ నిధులతో చేపట్టిన భోజనశాల నిర్మాణం బేస్‌మెంట్‌స్థాయిలోనే ఆగిపోయింది. ఈ అస్తవ్యస్త పనులపై హెచ్‌ఎం టి.గోపాల్‌రెడ్డి కలెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. ఇంతలోనే ప్రభుత్వం మారిపోవడంతో పాఠశాలకు మంజూరైన నిధుల విడుదలనిలిచిపోయింది. కాంట్రాక్టర్‌ పనులు చేయడం నిలిపేశాడు.

దాతల సహకారంతో అభివృద్ధి

ప్రభుత్వ నిధులు నిలిచిపోయినా హెచ్‌ఎం తీపిరెడ్డి గోపాల్‌రెడ్డి ఆందోళన చెందకుండా దాతల సహకారంతో పాఠశాల అభివృద్ధికి పూనుకున్నారు. గ తంలో విద్యార్థులు చెట్ల కింద కూర్చుని భోజనాలు చేసేవారు. గాలికి దుమ్ము, చెత్త విద్యార్థుల ప్లేట్లలో పడేది. కోతుల బెడద సరేసరి. సుంకరనేని సురే్‌షబాబు తన తండ్రి రామప్పయ్య జ్ఞాపకార్ధం ఇచ్చిన రూ.5లక్షల విరాళంతో విద్యార్థులకు భోజనశాల నిర్మించారు. ఇప్పుడు విద్యార్థులు అందులో భోజనం చేస్తున్నారు. తాడూరు మనోరంజన్‌రెడ్డి తన తల్లిదండ్రులు సరళ-కృపాకర్‌రెడ్డి జ్ఞాపకార్ధం రూ. 2.70లక్షల విరాళంతో పాఠశాల ఆర్చీ, గేటు నిర్మించారు. వడ్డెపల్లి లక్ష్మీనర్సయ్య తన తల్లిదండ్రుల జ్ఞాపకార్ధం రూ.4లక్షల విరాళంతో విద్యార్థులకు టైలరింగ్‌లో శిక్షణ ఇవ్వడానికి 15 కుట్టు మిషన్లు, బ్యూటీషియన్‌ శిక్షణ ఇవ్వడానికి సామగ్రి తదితర వాటిని తెప్పించారు. స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు పాఠశాలలో సీసీ కెమెరాల ఏర్పాటుకు తన మొదటి నెల వేతనం రూ.లక్ష ఇవ్వగా, పూర్వ విద్యార్థులు ఆర్థిక సహకారంతో పాఠశాలలో అన్ని గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రాపోలు సుదర్శన్‌ ఇచ్చిన రూ.లక్ష విరాళంతో గదులకు గ్రిల్స్‌ బిగించారు. పాఠశాల లైబ్రరీకి ఎంఈవో గోపాల్‌రెడ్డి కుమార్తె చరిష్మా రూ.లక్ష ఇవ్వగా విద్యార్థులకు అవసరమైన బుక్స్‌ తెప్పించారు. ఇలా దాతల సహకారంతో పాఠశాలలో అన్నిరకాల మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నారు.

150 అడ్మిషన్లకు చేరువలో...

ఈ నెల 12న పాఠశాలలు తెరిచారు. 13 పని దినాల్లో ఈ పాఠశాలలో 134 మంది విద్యార్థులు కొత్తగా అడ్మిషన్లు తీసుకున్నారని హెచ్‌ఎం గోపాల్‌రెడ్డి తెలిపారు. మరో 16 మంది అడ్మిషన్‌కోసం పేరు నమోదు చేసుకుని వెళ్లారన్నారు. ఇంకా అడ్మిషన్లు వస్తున్నాయన్నారు. గత ఏడాది 448 మంది విద్యార్థులుండగా అందులోంచి 88 మంది ఎస్‌ఎ్‌ససీ విద్యార్థులు వెళ్లిపోయారు. ఇప్పుడు కొత్తగా 134 మంది విద్యార్థులు చేరడంతో విద్యార్థుల సంఖ్య 494కు చేరింది. అడ్మిషన్లు పూర్తయ్యే నాటికి విద్యార్థుల సంఖ్య 500 దాటుతుందన్నారు. పాఠశాలలో 13 సెక్షన్లు ఉన్నాయి. ఈ పాఠశాల పూర్తిగా ఇంగ్లిష్‌ మీడియం స్కూ లు. గతంలో ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థులు ఈ పాఠశాలకు వచ్చేవారు కాదు. ఈసారి ఇప్పటికే సుమారు 60మంది ప్రైవే టు పాఠశాలల విద్యార్థులు ఈ పాఠశాలలో అడ్మిషన్లు తీసుకున్నారని ఆయన తెలిపారు.

పెరిగిన సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు నిర్మించాలి

గతంలో ఉన్న టాయిలెట్లు శిథిలమవడంతోపాటు తక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య 500 దాటుతుండటంతో అదనంగా మరుగుదొడ్లు నిర్మించాలని ఈ నెల 27న పాఠశాలను సందర్శించిన అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే కలెక్టర్‌కు చెప్పారు. కలెక్టర్‌ వెంటనే డీఆర్‌డీవో నాగిరెడ్డికి చెప్పడంతో పాఠశాలలో 10 మరుగుదొడ్లు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయమని ఈ నెల 28న ఏఈని పాఠశాలకు పంపించారు. ప్రహరీ నిర్మాణానికి కూడా ఎమ్మెల్యే సామేలు రూ.20లక్షలు మంజూరు చేయించారని హెచ్‌ఎం గోపాల్‌రెడ్డి తెలిపారు. పాఠశాలకు కలర్స్‌ కూడా వేయిస్తే మరింత ఆకట్టుకుందన్నారు.

Updated Date - Jun 30 , 2025 | 12:37 AM