ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

స్థానికంపై ముందుకు!

ABN, Publish Date - Jun 17 , 2025 | 12:25 AM

స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో రాజకీయవర్గాల్లో ఒక్కసారిగా సందడి మొదలైంది. బీసీ రిజర్వేషన్ల విషయాన్ని ప్రభు త్వం తేల్చితే షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉంది.

జర్వేషన్ల అనంతరం రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్న నాయకులు

పరిషత్‌, పంచాయతీ ఎన్నికలకు వారంలో షెడ్యూల్‌ వస్తుందని చర్చ

(ఆంధ్రజ్యోతిప్రతినిధి,నల్లగొండ): స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో రాజకీయవర్గాల్లో ఒక్కసారిగా సందడి మొదలైంది. బీసీ రిజర్వేషన్ల విషయాన్ని ప్రభు త్వం తేల్చితే షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏ సమయంలోనైనా షెడ్యూల్‌ విడుదలచేసే అవకాశం ఉండటంతో అధికారులు సైతం సిద్ధంగా ఉన్నారు.

గ్రామపంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లు, మునిసిపాలిటీలకు పాలకవర్గాల గడు వు ముగిశాక సకాలంలో ఎన్నికలు నిర్వహించలేకపోవడంతో ప్రస్తుతం అవన్నీ ప్రత్యేకాధికారు ల పాలనలో కొనసాగుతున్నాయి. పాలకవర్గా లు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు, వాటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం జతచేయాల్సిన రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోవడంతో పల్లెలు, పట్టణాల్లో ఎక్కడి పనులక్కడే నిలిచిపోవడంతోపాటు పాలన గాడితప్పింది. రాష్ట్రం లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక బీసీలకు స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో దాన్ని తక్షణం అమలు చేశాకే ఎన్నికలకు వెళ్లాలని బీసీ సంఘాలు, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేస్తోంది. దీంతో ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. వార్డు మొదలు, జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గం వరకు ఏ స్థానం, ఏ కేటగిరీకి కేటాయిస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం అధికారిక రిజర్వేషన్లు 50శాతానికి మించి ఉండడానికి ఆస్కారం లేకపోవడంతో, తాజా కులగణన నివేదిక ప్రకారం రిజర్వేషన్ల అమలులో భాగంగా బీసీలకు తమ పార్టీ నుంచి 42శాతం సీట్లు కేటాయిస్తామని, జనరల్‌ స్థానాల్లో బీసీలకు ప్రాధాన్యం పెంచుతామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. ఈ విషయంపై క్షేత్రస్థాయి నాయకుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

ఎప్పుడైనా షెడ్యూల్‌ వచ్చే అంచనాలో అధికార యంత్రాంగం

పంచాయతీరాజ్‌ సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న సంకేతాలతో అఽధికారయంత్రాంగం, పోటీ చేయాలనుకునే ఆశావహులు అప్రమత్తమయ్యారు. ఉమ్మడి జిల్లాలో కొత్త, పాత కలుపుకొని మొత్తం 73 మండలాల్లో 73 జడ్పీటీసీ స్థానాలు, 1,730 గ్రా మపంచాయతీలు, సుమారు 17,500కుపైగా వార్డు స్థానాలు, 722 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. పోలింగ్‌, పోలీస్‌ సిబ్బంది నియామకానికి ఎంతమంది అవసరమవుతారనే అంశంలో ఇప్పటికే ప్రాథమికంగా సమాచారం సిద్ధం చేశారు. పరిషత్‌లకు పార్టీల ప్రాతిపదికన, గ్రామపంచాయతీలకు, వార్డు సభ్యులకు పార్టీ రహితంగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉండడంతో, అందుకోసం వేర్వేరుగా బ్యాలెట్‌ పత్రాలు, గుర్తులను ఇప్పటికే సిద్ధం చేశారు. రిజర్వేషన్లను ఎలాఖరారుచేయాలనే అంశంపై ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకున్న మేరకు రిజర్వేషన్ల కోటా, కేటాయింపులు చేస్తారు. ముందుగా పరిషత్‌లకు, తదుపరి పక్షం రోజుల వ్యవధిలో గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ముందుగా ఏ ఎన్నికలు నిర్వహించినా, ఫలితాలు ప్రకటించకుండా కోడ్‌ కొనసాగిస్తూ, ఎన్నికలు ముగించాలని, గ్రామాల్లో ఘర్షణలకు ఆస్కారం లేకుండా చూడడంతో పాటు, పాలనాపర ఇబ్బందులను అధిగమించవచ్చనేది ప్రభుత్వ ఉన్నతస్థాయి వర్గాల ఆలోచనగా అధికారులు చెబుతున్నారు.

రిజర్వేషన్ల కోసం ఆశావహుల ఎదురుచూపులు

స్థానిక సంస్థలకు 2019లో జరిగిన ఎన్నికల్లో ఎస్టీలకు 7శాతం, ఎస్సీలకు 15శాతం, బీసీలకు 25శాతం, మహిళలకు అన్ని కేటగిరీల్లో 50శాతం రిజర్వేషన్లు కేటాయించారు. జడ్పీటీసీ స్థానాలకు, ఎంపీపీ పదవులకు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ స్థాయిలో జిల్లాల వారీగా కోటాను ఖరారు చేస్తే, జిల్లాల్లో కలెక్టర్ల నేతృత్వంలో ఆ కోటా ప్రకారం రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌కు అనుగుణంగా సీట్లను కేటాయించారు. ఎంపీటీసీ స్థానాలకు, సర్పంచ్‌ పదవులకు కలెక్టర్ల స్థాయిలో మండలాల వారీగా కోటా ఖరారు చేసి, ఆర్డీవోల నేతృత్వంలో ఆయా మండలాల్లో సీట్లను కేటాయించారు. ఈసారి రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి తుది నిర్ణయం తీసుకున్నా మొత్తం రిజర్వేషన్ల కోటా 50శాతానికి మించకుండా నిబంధనలు రూపొందిస్తారని, ఆమేరకు కోటా ఖరారు, సీట్ల కేటాయింపు గతం మాదిరిగానే చేపడతారా? లేక కోటా ఖరారు, కేటాయింపులపై మార్పులు, చేర్పులు తీసుకుంటారా? అనే విషయం తేలాల్సి ఉంది. ఈ వారంలోనే అన్ని అంశాలపై స్పష్టత వస్తుందని, వారంలోపే రిజర్వేషన్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ, అధికారవర్గాల్లో చర్చ సాగుతోంది. ఇప్పటికే గ్రామాల్లో, మండలాల్లో సర్పంచులుగా, ఎంపీటీసీ సభ్యులుగా, జడ్పీటీసీ, ఎంపీపీ పదవులపై ఆశలు పెంచుకున్న స్థానిక నాయకులు రిజర్వేషన్లు వారికి అనుకూలంగా వస్తే కదనరంగంలోకి దూకేందుకు అన్నిరకాలుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Updated Date - Jun 17 , 2025 | 12:25 AM