ముమ్మరంగా ఫ్లైఓవర్ పనులు
ABN, Publish Date - Jun 19 , 2025 | 12:13 AM
చిట్యాల, జూన్ 18, (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణంలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై నిర్మిస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
చిట్యాల, జూన్ 18, (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణంలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై నిర్మిస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సుమారు రూ.45కోట్ల అంచనా వ్యయంతో పట్టణంలో 1200 మీటర్ల పొడవు నిర్మించ నున్న బ్రిడ్జి పనులు చురుకుగా సాగుతున్నాయి. సి మెంట్ పిల్లర్ల నిర్మాణం పూర్తి కావస్తుంది. మట్టికట్ట నిర్మాణం కోసం సిమెంట్ పలకలు బిగిస్తున్నారు. గతం లో హైవే విస్తరించే సమయంలో ఫ్లైఓవర్ నిర్మించాలని ప్రతిపాదించినా కొంతమంది వ్యతిరేకించడంతో ఉపసంహరించుకున్నారు. ఫ్లైఓవర్ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతుండటంతో మళ్లీ ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలని నిర్ణయించారు. చిట్యాలతో పాటు పెద్దకాపర్తిలో కూడ ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తున్నారు.
అదనంగా రెండు అండర్‌పా్‌సలు
చిట్యాలలో ఫ్లైఓవర్ నిర్మాణం 1200 దూరం నిర్మించాలని మధ్యలో పోలీ్‌సస్టేషన్ వద్ద అండర్‌పాస్ ఇవ్వాలని ప్లాన్‌లో ఉంది. కాగా ఒక అండర్‌పాస్ సరిపోదని మరో రెండు అండర్‌పా్‌సలు ఇవ్వాలని చిట్యాల అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్ణయించి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి వినతిపత్రాలు సమర్పించారు. దీంతో వారు నేషనల్ హైవే అథారిటీ అధికారులతో సంప్రదించి మరో అండర్‌పాసులు మంజూరు చేయాలని కోరారు. నేషనల్ హైవే అథారిటీ అధికారులు రెండు అండర్‌పా్‌సలు నిర్మించాలని కాంట్రాక్టర్‌కు సూచించగా వారు మార్కింగ్ చేశారు.
హైవే సర్వీస్ రోడ్లు అస్తవ్యస్తం..
8 ప్రమాదకరంగా మారిన కంకర రాళ్లు
8 గాయపడుతున్న పాదచారులు, చిరువ్యాపారులు
చౌటుప్పల్ టౌన్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): యా దాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని 65వ నంబరు జాతీయ రహదారి సర్వీస్ రోడ్ల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. పట్టణంలోని హైవేపై ప్లై ఓవర్‌ను నిర్మించేందుకు ముందుగా ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో సర్వీస్ రోడ్లను పునర్నిర్మించే పనులను చేపట్టారు. ప్లై ఓవర్‌ను నిర్మించే సమయంలో వాహనాల రాకపోకలు ఈ సర్వీస్ రోడ్ల వెంటనే సాగనున్నాయి. అందుకోసం కొన్ని సర్వీస్ రోడ్లను విస్తరించ డం, పునర్నిర్మించడం వంటి పనులను చేపట్టారు. ఆ క్రమంలో కొన్ని ప్రాంతాల్లో తారు రోడ్డు నిర్మాణం చేసి, మరి కొన్ని ప్రాంతాల్లో కంకర వేసి వదిలివేశా రు. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందికరంగా మా రింది. 2024 జూన్ 20వ తేదీన నుంచి ప్రారంభమై న సర్వీస్ రోడ్ల పునర్నిర్మాణ పనులు ఏడాదవుతున్నా పూర్తి కాకపోవడంతో వాహనదారులు, పాదచారులు, చిరు వ్యాపారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిం ది. ఇక సర్వీస్ రోడ్ల వెంట ఉన్న దుకాణదారుల పరిస్థితి అధ్వానంగా మారింది. వాహనాల రాకపోకలతో దుకాణాల్లోకి విపరీతంగా దుమ్ము దూరడం, కంకర రాళ్లు ఎగిరివచ్చి పడటం, తరచుగా అద్దాలు పగిలిపోవడం, వినియోగదారుల వాహనాలను పార్కింగ్ చేసేందుకు ఇబ్బందికరంగా ఉండటం వంటి అనేక సమస్యలను దుకాణదారులు ఎదుర్కొంటున్నారు. సర్వీస్ రోడ్ల పునర్నిర్మాణంలో జరుగుతున్న తీవ్రమైన జాప్యంపై స్థానికులు మండిపడుతున్నారు.
సర్వీస్ రోడ్డుకు అడ్డంకిగా ఈద్గా
హైవే ఉత్తరభాగం సర్వీస్ రోడ్డు నిర్మాణానికి ఒక ప్రాంతంలో దర్గా అడ్డంకి మారింది. దీంతో సుమా రు 50 మీటర్ల పొడవున సర్వీస్ రోడ్డును నిర్మించలే దు. ఈ ప్రాంతంలో హైవేపై వాహనాలు రాంగ్ రూట్‌లో వస్తుండటంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దర్గాను తొలగించి సర్వీస్ రోడ్డును నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఈ ప్రాంతంలో గత నెల 5వ తేదీన బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు దర్గాను తొలగించకుంటే ప్రమాణికుల సౌకర్యార్థం తామే తొలగిస్తామని హెచ్చరించారు.
సర్వీస్ రోడ్ల పనులు పూర్తికాక ఇబ్బందులు
హైవే సర్వీస్ రోడ్ల పునర్నిర్మాణ పనులు పూర్తి చేయకపోవడం తో రాకపోకలకు తీవ్ర ఇబ్బం ది ఏర్పడుతుంది. కొన్ని ప్రాం తాల్లో కంకరపరిచి తారు నిర్మాణం చేయకపోవడంతో ప్రమాదకరంగా మారింది. వాహనాలు వెళ్తున్నప్పుడు కంకరరాళ్లు ఎగిరి వచ్చి చిరు వ్యాపారులు, పాదచారులకు తగిలి గాయాలపాలవుతున్నారు. మూడు నెలలుగా నిర్మాణ పనులను నిలిపివేయడంతో కంకర పరిచిన ప్రాంతాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్వీస్ రోడ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.
- కడారి కల్పన యాదవ్ ,
బీజేపీ పట్టణ అధ్యక్షురాలు, చౌటుప్పల్
Updated Date - Jun 19 , 2025 | 12:13 AM