నిబంఽధనల ఉల్లంఘనపై కొరడా
ABN, Publish Date - Jul 07 , 2025 | 12:07 AM
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వాహనదారులపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. మద్యం తాగి అతివేగంగా వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడంతో జిల్లా లో ట్రాఫిక్ పోలీసులు పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేశారు.
జిల్లాలో 1,171 మంది డ్రైవింగ్ లైసెన్స్‌ల సస్పెన్షన్
6,482 డ్రంకెన్ డ్రైవ్ కేసుల నమోదు
(ఆంధ్రజ్యోతి,భువనగిరి టౌన్): ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వాహనదారులపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. మద్యం తాగి అతివేగంగా వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడంతో జిల్లా లో ట్రాఫిక్ పోలీసులు పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేశారు.
రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం మద్యం తాగి వాహనాలు నడపడం, అతివేగమే కారణమని పోలీస్, రవాణాశాఖల అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో గత ఏడాదిన్నరగా జిల్లాలో ట్రాఫిక్ పోలీసులు 6,482 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. వీటిలో మద్యం తీవ్రత అధికంగా ఉన్న 1,681 మంది వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు రవాణాశాఖకు సిఫారసు చేశారు. మిగతా 4,800 కేసులకు సంబంధించి కోర్టులో విచారించి న్యాయమూర్తి జరిమానా విధించారు. అయితే ట్రాఫిక్ పోలీసులు 1,681 డ్రైవింగ్ లైసెన్స్‌ల రద్దుకు సిఫారసు చేయగా, కేసు తీవ్రత ఆధారంగా 1,171 మంది లైసెన్సులను సస్పెండ్ చేస్తూ ఇటీవల రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మిగ తా 510 మంది వాహనదారులకు జరిమానాతో సరిపెట్టారు. ఆరునెల ల పాటు తాత్కాలిక సస్పెన్షన్ అమలులో ఉంటుంది. సస్పెన్షన్ గడువులోపు వాహనాలు నడిపిస్తూ పట్టుబడినా, మరోమారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా శిక్షలు మరింత కఠినతరంగా ఉంటాయని రవాణాశాఖ అధికారులు తెలిపారు.
జిల్లాలో మూడు ట్రాఫిక్ పోలీ్‌సస్టేషన్లు
జిల్లాలో మూడు ట్రాఫిక్ పోలీ్‌సస్టేషన్లు, ఇద్దరు ట్రాఫిక్ ఏసీపీ లు ఉన్నారు. భువనగిరి, యాదగిరిగుట్ట, చౌటుప్పల్ ట్రాఫిక్ పోలీ్‌సస్టేషన్ల పరిధిలో నిరంతరం డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. సెలవు రోజులో చాలా మంది మద్యం తాగి పట్టుబడుతున్నారని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ మేరకు శని, ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో జాతీయ రహదారులు, పంతంగి, గూడూరు టోల్ గేట్లు, యాదగిరిగుట్టలో డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ తనిఖీల్లో పట్టుబడుతున్న వారిలో మహిళలు కూడా ఉంటున్నారు. మద్యం తీవ్రత ఆధారంగా లైసెన్స్ రద్దు, కోర్టులు, కౌన్సెలింగ్‌కు పోలీసులు సిఫారసు చేస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్నవారికి కౌన్సెలింగ్ ఇస్తున్నా వాహనదారుల్లో ఆశించిన స్థాయిలో మార్పు రావడంలేదని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలోని మూడు ట్రాఫిక్ పోలీ్‌సస్టేషన్ల పరిధిలో 2024లో 4,317 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసి 849 డ్రైవింగ్ లైసెన్స్‌ల రద్దుకు పోలీసులు సిఫారసు చేశారు. అదేవిధంగా 2025లో ఇప్పటివరకు 2,165 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు కాగా, 812 డ్రైవింగ్ లైసెన్స్‌ల రద్దుకు రవాణాశాఖకు పోలీసులు సిఫారసు చేశారు. అయితే రవాణాశాఖ 2024లో 1,027 లైసెన్స్‌లను, 2025లో ఇప్పటివరకు 144 లైసెన్స్‌లను రద్దు చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
డ్రంకెన్ డ్రైవ్‌తోనే ప్రమాదాలు :ప్రభాకర్‌రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ, భువనగిరి
డ్రంకెన్ డ్రైవ్‌తోనే అధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కొందరు మద్యం తాగి నియంత్రణ కోల్పోతూ మితిమీరిన వేగంతో వాహనాన్ని నడుపుతుండటంతో జాగ్రత్తగా వస్తున్న ఎదుటి వాహనదారులు వారి తప్పిదం లేకుండానే ప్రమాదాలబారిన పడుతున్నారు. ఈ తరహా దుర్ఘటనలను నివారించేందుకు డ్రంకెన్ డ్రైవ్‌ను పటిష్టంగా నిర్వహిస్తున్నాం. మద్యం తాగి వాహనాలు నడపవద్దని సొంతంగా నిర్ణయం తీసుకుంటే అందరికీ క్షేమం.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు : సాయికృష్ణ, జిల్లా రవాణాశాఖ అధికారి
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు, శిక్షలు తప్పవు. మద్యం తాగి, మితిమీరిన వేగంతో వాహనాలు నడిపితే జరిమానాతో పాటు లైసెన్స్ రద్దు, సస్పెన్షన్ అమలవుతుంది. కేసు తీవ్రత ఆధారంగా జైలు శిక్ష కూడా పడే అవకాశాలు ఉన్నాయి. అందరూ జాగ్రత్తలు పాటిస్తే అందరి కుటుంబాలు క్షేమంగా ఉంటాయి.
జిల్లాలో కేసులు డ్రంకెన్ డ్రైవ్ కేసులు ఇలా..
డ్రంకెన్ డ్రైవ్ కేసులు లైసెన్స్ రద్దుకు సిఫారసులు
పోలీస్‌స్టేషన్ 2024లో 2025లో మొత్తం 2024లో 2025లో మొత్తం
భువనగిరి 1,521 884 2,405 547 698 1,245
యాదగిరిగుట్ట 1,368 498 1,866 199 96 295
చౌటుప్పల్ 1,428 783 2,211 103 38 141
మొత్తం 4,317 2165 6,482 849 832 1,681
Updated Date - Jul 07 , 2025 | 12:07 AM