మొక్కలు ధ్వంసం చేసిన వ్యక్తికి జరిమానా
ABN, Publish Date - Jul 03 , 2025 | 12:16 AM
భువనగిరి పెద్ద చెరువు కట్టపై నాటిన మొక్కలను ధ్వంసం చేసిన వ్యక్తికి అటవీ శాఖ అధికారులు రూ.10వేల జరిమానా విధించారు.
భువనగిరి టౌన, జూలై 2 (ఆంధ్రజ్యోతి): భువనగిరి పెద్ద చెరువు కట్టపై నాటిన మొక్కలను ధ్వంసం చేసిన వ్యక్తికి అటవీ శాఖ అధికారులు రూ.10వేల జరిమానా విధించారు. వివరాలలోకి వెళితే.. పెద్ద చెరువు కట్ట సుందరీకరణ కోసం నాటిన మొక్కలలో రెండింటిని పట్టణానికి చెందిన సాయికుమార్ బుధవారం చేశాడు. దీంతో సమాచారం అందుకున్న అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ విచారణ జరిపి మొక్కలు ధ్వంసం చేసిన సాయికుమార్‌కు పదివేల రూపాయలు జరిమానా విధించారు. మొక్కలను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ మేరకు ప్రజలు స్వచ్ఛందంగా సమాచారం ఇవ్వాలని అన్నారు.
Updated Date - Jul 03 , 2025 | 12:16 AM