ఫీజు బకాయిలను విడుదల చేయాలి
ABN, Publish Date - Jul 22 , 2025 | 12:50 AM
పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా అధ్యక్షుడు చింతల శివ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రేపు విద్యా సంస్థల బంద్: ఎస్‌ఎఫ్‌ఐ పిలుపు
భువనగిరి గంజ్, జూలై 21 (ఆంధ్రజ్యోతి): పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా అధ్యక్షుడు చింతల శివ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని సోమవారం పట్టణ కమిటీ సమావేశం పట్టణ కార్యదర్శి ఈర్ల రాహుల్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక విఽధానాలు అవలంబించడం కారణంగా అధికారాన్ని కోల్పోయిందని అన్నారు. పేద విద్యార్ధులకు ఇవ్వాల్సిన ఫీజు బకాయిలను పెండింగ్ పెట్టకుండా ఎప్పటికప్పుడు చెల్లిస్తామని, విద్యా రంగానికి 15శాతం నిధులు కేటాయిస్తామని, నిరుద్యోగ సమస్య తీరుస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తోందని అన్నారు. ఇచ్చిన హామీలు అమలుచేయకుండా ప్రశ్నించే వారిపైన అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. ఈనెల 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఈర్ల కార్తీక్, భవానీశంకర్, సతీష్, అభినవ్ పాల్గొన్నారు.
Updated Date - Jul 22 , 2025 | 12:50 AM