ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వేగంగా ‘గోదాం’ పనులు

ABN, Publish Date - Jul 29 , 2025 | 12:41 AM

వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, మౌలిక వసతులు, సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో భువనగిరి మండలంలోని ముత్తిరెడ్డిగూడెం శివారులో నిర్మిస్తున్న ఔషధ గోదాం పనులు చకా చకా సాగుతున్నాయి. వైద్య సేవలు, మౌలిక వసతుల సదుపాయాల సంస్థ జాతీయ ఆరోగ్య మిషన్‌ రూ.3.60కోట్లు మంజూరు చేయగా, జూన్‌ 2న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. 13 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈ గోదాం నిర్మాణ పను లు కొనసాగుతున్నాయి.

కొనసాగుతున్న వైద్య ఆరోగ్య ఔషధ నిల్వల గోదాం నిర్మాణ పనులు

భువనగిరి రూరల్‌, జూలై 28(ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, మౌలిక వసతులు, సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో భువనగిరి మండలంలోని ముత్తిరెడ్డిగూడెం శివారులో నిర్మిస్తున్న ఔషధ గోదాం పనులు చకా చకా సాగుతున్నాయి. వైద్య సేవలు, మౌలిక వసతుల సదుపాయాల సంస్థ జాతీయ ఆరోగ్య మిషన్‌ రూ.3.60కోట్లు మంజూరు చేయగా, జూన్‌ 2న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. 13 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈ గోదాం నిర్మాణ పను లు కొనసాగుతున్నాయి. తొమ్మిది నెలల గడువులోగా ఈ గోదాంను వినియోగంలోకి తీసుకురావాలని వైద్య ఆరోగ్యశాఖ మౌలిక సదుపాయాల కల్పన ఇంజనీరింగ్‌ అధికారులు ప్రణాళికలు రూపొందించారు.

జిల్లాలోనే మందుల నిల్వలు

జిల్లా పరిధిలోని 17 మండలాల్లో 21 ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు 99 ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరాలు, 42 వైద్య ఆరోగ్య ఉపకేంద్రాలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఔషధ మందులు, బ్యాండేజీలు, ఆరోగ్య కిట్లు భద్రపరిచేందుకు ప్రభుత్వం ఈ గోదాం నిర్మాణానికి పూనుకుంది. అయితే ఈ నిర్మాణం పూర్తయితే హైదరాబాద్‌లోని ఔషధ నిల్వల డిపో నుంచి నేరుగా ఈ మందులను ఇక్కడే నిల్వచేసి జిల్లాలోని వివిధ వైద్య ఆరోగ్య కేంద్రాలకు తరలిస్తారు. ప్రస్తుతం నల్లగొండ జిల్లా నుంచి దిగుమతి చేసుకొని, పాత బస్టాండ్‌ సమీపంలోని పాత మునిసిపాలిటీలో ఇరుకైన భవనంలో నిల్వలను భద్రపరుస్తున్నారు. ఈ గోదాం నిర్మాణం పూర్తయితే ఔషధ నిల్వల మరింత భద్రంగా, సురక్షితంగా ఉండే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.

నాణ్యతతో గోదాం నిర్మాణం : ఎ రాధాకృష్ణ, టీజీఎంఎ్‌సఐడీసీ ఇంజనీర్‌

ఔషధ నిల్వల కోసం మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్యశాఖ, జాతీయ హెల్త్‌ మిషన్‌ రూ.3.60కోట్లు మంజూరు చేసింది. గత నెల జూన్‌2న శంకుస్థాపన చేశారు. భవనాన్ని త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తెస్తాం.

Updated Date - Jul 29 , 2025 | 12:41 AM