సాగు సలహాలకో యాప్
ABN, Publish Date - Jun 08 , 2025 | 12:30 AM
గతంలో రైతులు పంటలకు వచ్చే తెగుళ్ల నివారణ, పంటల సాగులో సూచనలు, సలహాల కోసం వ్యవసాయ శాఖ అధికారులు చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ప్రస్తుత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వ్య వసాయానికి సాంకేతి కత జోడించడంతో రైతుల సమస్యలు చిటికెలో పరిష్కా రమవు తున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఇక్రిశాట్ సంస్థ రూపొందించిన ‘ప్లాం టిక్స్’ యాప్ చీడపీడల నివారణకు ఎంతగానో ఉపయోగపడుతోంది. - (ఆంధ్రజ్యోతి-మోత్కూరు)
చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉం టే చాలు జగమంతా కనుపిస్తుంది. ఇప్పుడు ఏ సమాచారం కావాలన్నా గూగుల్‌లో సంబంధిత యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకుని వెతకడమే. గతంలో రైతులు పంటలకు వచ్చే తెగుళ్ల నివారణ, పంటల సాగులో సూచనలు, సలహాల కో సం వ్యవసాయ శాఖ అధికారులు చుట్టూ తిరగాల్సి వచ్చేది. వారు అందుబాటులో ఉండేవారు కాదు. దు కాణాలకు వెళ్లి పంట తెగులు లక్షణాలు చెబితే వ్యా పారి ఇచ్చింది తెచ్చి పిచికారీ చేస్తే తగ్గితే అదృష్టం, తగ్గకుంటే దురదృష్టం అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు ఆ దుస్థితికి చెక్ పెట్టేలా పంటల సాగులో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపేలా ఓ యాప్ అందుబాటులోకి వ చ్చింది. పంటతెగుళ్లకు సంబంధించిన ఫొటో తీసి పంపితే చాలు వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలను క్షణాల్లో చూపిస్తుంది. మీ స్మార్ట్ ఫోన్‌లో ఈ యాప్ ఉంటే వ్యవసాయ శాస్త్రవేత్త మీదగ్గర ఉన్నట్టే...
’ఇక్రిశాట్’ సృష్టి ‘ప్లాంటిక్స్’ యాప్
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పెరిగిపోవడంతో వ్యవసాయానికి కూడా సాం కేతిక పరిజ్ఞానాన్ని జో డిస్తూ హైదరాబాద్‌లో ని ఇక్రిశాట్ విశ్వవిద్యాలయం రైతుల కోసం ప్లాంటిక్స్ అనే యాప్‌ను రూపొందించింది. దేశంలో, రాష్ట్రంలో మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే మీ చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు మీ పంటల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇందుకు గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి ప్లాం టిక్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అన్ని రకాల పంటలకు సంబంధించిన సస్యరక్షణ, యాజమాన్య పద్ధతులు, చీడపీడల నివారణ, పోషకాలు, ఇతర సూచనలు, సలహాలు ఒకటేమిటి రైతులకు సంబంధించిన పూర్తిసమాచారం ఈ యాప్ అందిస్తుంది. గతంలో వరికి తెగుళ్లు సోకితే వరి మొక్కలు పీక్కొని, చెట్లకు చీడపీడలు ఉంటే ఆకులో, కొమ్మలో తీసుకుని వ్యవసాయ శాఖ అధికారుల వద్దకో, అనుభవజ్ఞులైన రైతుల వద్దకో వెళ్లాల్సి వచ్చేది. సమస్య తీవ్రంగా ఉం టే వారినే క్షేత్రంపైకి తీసుకరావాల్సి వచ్చేది. ఇప్పు డు మనం ఉన్న చోటు నుంచే ఈ యాప్ ద్వారా వ్యవసాయ శాస్త్రవేత్తల నుంచి సలహాలు పొందవచ్చు.
యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంది
పంటలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ఈ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంది. నేను ఈ యాప్‌ను వాడుతున్నాను. ఫోన్‌లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే మన వెంట ఒక వ్యవసాయ శాస్త్రవేత్త ఉన్నట్టే. ఈ యాప్ ద్వారా మన వ్యవసాయ క్షేత్రం నుంచే పంటలకు అవసరమైన సలహాలు, సూచనలు పొందవచ్చు.
- బిల్లపాటి గోవర్ధన్‌రెడ్డి, రైతు, మోత్కూరు
Updated Date - Jun 08 , 2025 | 12:30 AM