పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
ABN, Publish Date - Apr 17 , 2025 | 12:04 AM
వడగళ్ల వానతో పంటనష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, జిల్లా అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి, పంట నష్టం అంచనా వేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డి
రామన్నపేట, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): వడగళ్ల వానతో పంటనష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, జిల్లా అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి, పంట నష్టం అంచనా వేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవవారం మండలంలోని నీర్నెంల గ్రామంలో వడగళ్ల వర్షంతో దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. నీర్నెంల గ్రామంలో కురిసిన వడగళ్ల వానకు సుమారు 250 ఎకరాల్లో వరిపంట దెబ్బతిన్నదని అన్నారు. పంటనష్టం కారణంగా రైతులు చేసిన అప్పులు ఎలా తీర్చాలో పాలుపోని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా అధికార యంత్రాంగం నీర్నెంల గ్రామంలో పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పంట నష్టాన్ని అంచనా వేసి ఎకరాకు రూ.30వేలు నష్టపరిహారం అందించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, సంఘం మండల కార్యదర్శి, మాజీ సర్పంచి బోయిని ఆనంద్, జిల్లా కమిటి సభ్యులు బలగూరి అంజయ్య, మాజీ వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, నాయకులు పాల్గొనగా పంట నష్టపోయిన రైతులు బండ జగన్మోహనరెడ్డి, కడారి వెంకన్న, బోయిన రామచంద్రం, మునుగోటి అంతయ్య, కొత్త రామచంద్రం, బోయిని మాధవి, ఆవుల అశోక్, ఆవుల అంజయ్య, కొత్త ఉపేందర్, ఆవుల మల్లెష్, చల్లమళ్ల యాదయ్య, ముత్యాల నర్సింహ, ఆవుల లక్ష్మీనారాయణ, కొత్తగణేష్, కొత్త సత్తయ్య, ఆవుల యాదయ్య, ఆవుల మురళి, సర్వి ఎల్లయ్య, సర్వి వెంకటయ్య, తదితర రైతుల వరి పంట నష్టపోయిందని తెలిపారు.
Updated Date - Apr 17 , 2025 | 12:04 AM