పోలీసులు వేధిస్తున్నారని రైతు ఆత్మహత్యాయత్నం
ABN, Publish Date - May 10 , 2025 | 11:51 PM
గుర్రంపోడు, మే10(ఆంధ్రజ్యోతి): భూవివాదం నేపథ్యంలో పొలీసులు తమను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా గుర్రంపోడు పోలీ్‌సస్టేషనలో శనివారం చోటుచేసుకుంది.
గుర్రంపోడు, మే10(ఆంధ్రజ్యోతి): భూవివాదం నేపథ్యంలో పొలీసులు తమను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా గుర్రంపోడు పోలీ్‌సస్టేషనలో శనివారం చోటుచేసుకుంది. బాధితుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్రంపోడు మండలం కొప్పోల్ గ్రామానికి గోలి వెంకటేశ్వర్లు 1.04ఎకరాలు, ఐతరాజు రాజు, రమేశకు 2.20ఎకరాలు సర్వే నంబర్ 524లో పక్కపక్కనే భూమి ఉంది. అయితే తన భూమిలో అక్రమంగా ప్రవేశించి గడ్డికట్టలు వేశారని గోలి వెంకటేశ్వర్లు భార్య రేణుక ఏప్రిల్ 25న ఐతరాజు రమేష్, రాజుపై పోలీ్‌సస్టేషనలో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు రమేష్, రాజును స్టేషనకు పిలిపించడంతో సమస్యను పెద్దమనుషుల సమక్షంలో పరిష్కరించుకుంటామని చెప్పారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో శనివారం మళ్లీ రమేష్, రాజును పోలీ్‌సస్టేషనకు పిలిపించారు.
ఈ క్రమంలో ఐతరాజు రమేష్ తాను వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బా మూత తీసి తాగడానికి ప్రయత్నిస్తుండగా గమనించిన పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే గుర్రంపోడు పీహెచసీకి తరలించి చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా సర్వే నంబర్ 524లో తమకు ఉన్న 2.20ఎకరాల భూమి నక్షా, భూరికార్డుల ప్రకారం తమకే చెందుతుందని ఈ భూ మిలో ప్రస్తుతం గోలి వెంకటేశ్వర్లు కబ్జాలో ఉన్నాడని, తమ హక్కు మేరకే గడ్డికట్టలు వేసుకున్నామని రమేష్ భార్య రామలింగమ్మ తెలిపింది. తమకు న్యాయం జరగడం లేదని, తరచూ తమనే పోలీ్‌సస్టేషనకు పిలిపించి వేధిస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. విషయమై ఎస్‌ఐ మధును వివరణ కోరగా బ్లాక్‌మెయిల్ చేసేందుకే రమేష్ పురుగుల మందు తాగాడని తెలిపారు.
Updated Date - May 10 , 2025 | 11:51 PM