ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కబ్జాల పాలైన కాల్వ

ABN, Publish Date - Jun 08 , 2025 | 12:22 AM

నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ నుంచి నేరు గా సాగు నీరు కోసం ఏర్పాటుచేసిన కాల్వ ఇది. అటువంటి కాల్వను చుట్టూ ఉన్న రైతులు ఆనవాళ్లు లేకుండాచేశారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన వారే కబ్జాకు పాల్పడ్డారు.

ఆనవాళ్లు కోల్పోయిన డీ4హెచ హైలెవల్‌ కాల్వ

కాపాడాల్సిన రైతులే కబ్జా

సాగు నీరు రాక అగచాట్లు

పాతికేళ్లుగా నీటి కోసం రూ.లక్షలు ఖర్చు

నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ నుంచి నేరు గా సాగు నీరు కోసం ఏర్పాటుచేసిన కాల్వ ఇది. అటువంటి కాల్వను చుట్టూ ఉన్న రైతులు ఆనవాళ్లు లేకుండాచేశారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన వారే కబ్జాకు పాల్పడ్డారు. పంట పొలాలకు సాగు నీరు లేకుండా పోవడంతో ప్రస్తుతం బోర్ల కోసం రూ.లక్షలు ఖర్చు చేస్తున్నా రు. పాతికేళ్లుగా సాగుతున్న నిర్వాకం ఇది. నాలుగు కిలోమీటర్లకు పైగా ఉండాల్సిన కాల్వ ప్రస్తుతం కిలోమీటర్‌కు పరిమితమైంది. అయినప్పటికీ ఎన్నెస్పీ అధికారులు చూసీ చూడనట్లు గా వ్యవహరిస్తున్నారు. తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని చేతులు దులుపుకుంటున్నారు.

- (ఆంధ్రజ్యోతి-త్రిపురారం)

నాగార్జునసాగర్‌ ఎడమకాల్వకు నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం ముకుందాపురం సమీపంలో ముదిమాణిక్యం మేజర్‌ పక్కన డీ4 హెచ హైలెవల్‌ తూమును ఏర్పాటుచేశారు. దీనిని స్థానికంగా నక్కల కాల్వ అని పిలిచేవా రు. గతంలో ఈ కాల్వ సమీపంలో నక్కల సం చారం అధికంగా ఉండటంతో ఈ పేరు వచ్చిందని రైతులు చెబుతున్నారు. 1.219 వెడల్పుతో 4.694 కిలోమీటర్ల పొడవున్న ఈ కాల్వ పరిధిలో ముకుందాపురం, త్రిపురారం, బెజ్జికల్‌ గ్రామా లు ఉన్నాయి. 7.56 క్యూసెక్కుల సామర్థ్యం కలిగిన కాల్వ కింద 484 ఎకరాలు ఆయకట్టును ఉండేది. ప్రధాన కాల్వకు నీటి విడుదల జరిగినపుడు ఈ కాల్వకు పుష్కలంగా నీరు విడుదల జరిగేది. వానాకాలం, యాసంగి సీజన్లలో వరి పంట సాగు చేసేవారు. ఏమాత్రం నీటి కొరత ఉండేది కాదు. 1965 నుంచి సుమారు 2000 వరకు కాల్వ సజీవంగానే ఉంది.

కన్నీళ్లే మిగిలాయి

సాగర్‌ కాల్వ నుంచి నక్కలకాల్వ కిలోమీటర్‌ పరిధి తర్వాత అన్యాక్రాంతం కావడంతో ఆయకట్టు పరిధిలోని భూములు పడావుపడ్డాయి.. కాల్వ పునరుద్ధరణ జరగలేదు. లక్షలాది రూపాయలు వెచ్చించి పాతికేళ్లుగా బోరుబావులు ఏర్పాటుచేసుకున్నారు. నీటి పారుదల లేకపోవడంతో ఈ ప్రాంతంలో భూగర్భజలాలు పూర్తిగా అడుగంటాయి. భారీ వర్షాలు కురిస్తే మినహా సాగు నీటి లభ్యత చాలా కష్టంగా మారింది. కరువు పరిస్థితుల సమయంలో తరుచూ పంటలు ఎండిపోవడం ఈ ప్రాంతంలో సర్వసాధారణం. చాలామంది రైతులు ఆక్రమించిన కాల్వలోనే బోర్లు వేశారు. బావులు ఏర్పాటు చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఉన్న కాల్వలను కబ్జా చేసి నీటి కోసం వెంపర్లడుతున్నారు. ఎవరికి వారు ముందు వాళ్లు కాల్వను ఆక్రమించారు, అందుకే మేం కాల్వ కలుపుకున్నాం అంటూ కబ్జాకు పాల్పడ్డారు. కొంతమంది స్థానికులు కాల్వ పునరుద్ధరణకు ముందుకు కదిలినప్పటికీ రైతుల నుంచి సహకారం లభించలేదు. కాల్వ ఏళ్ల తరబడి ఆక్రమణకు గురై చరిత్రలోకి కలిసిపోతున్నా నీటి పారుదల శాఖ అధికారులకు మాత్రం ఇవేమీ కనిపించడం లేదు. ఇప్పటివరకు ఈ కాల్వ గురించి ఇన్నేళ్లలో ఏఅధికారి స్పందించలేదు. కనీసం పర్యవేక్షణ లేదు. కాల్వను కబ్జా చెర నుంచి విడిపించి, పంట పొలాలకు నీటిని అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇదిలా ఉండగా కాల్వ ఆక్రమణలపై ఎనఎ్‌సపీ, జేఈ విశాల్‌కుమార్‌ను స్పందిస్తూ కాల్వ ఆక్రమణలపై రైతుల నుంచి ఎటువంటి ఫిర్యాదు తమకు అందలేదన్నారు.

భూముల ధరలు పెరిగి

పంటలు పుష్కలంగా పంటలు పండటంతో భూముల ధరలకు క్రమేపీ రెక్కలు వచ్చాయి. అదే సమయంలో పలు కారణాలతో కాల్వకు నీటిరాక నిలిచిపోయిన సందర్భంలో కాల్వ చు ట్టూపక్కల రైతులు కొద్దికొద్ది మేర ఆక్రమణల కు పాల్పడటం మొదలుపెట్టారు. అప్పటి నుం చే క్రమేపి కాల్వను ఆక్రమిస్తూ పంట భూములుగా మార్చేశారు. ప్రస్తుతం ముకుందాపురం పరిధి వరకు సుమారు కిలోమీటర్‌ మాత్రమే కాల్వ మిగిలి ఉంది. సాగు నీరు అక్కడి పంట పొలాల వరకు వస్తుంది.. త్రిపురారం, బెజ్జికెల్‌ పరిధిలో సుమారు 4 కిలోమీటర్లు కాల్వను ఆనవాళ్లు లేకుండా కబ్జా చేశారు. కాల్వ ఏర్పాటు సమయంలో ప్రభుత్వ పరిహరం అందించినప్పటికీ ఆక్రమణలు జరిగాయి.

సాగు నీరు రాక ఇబ్బందులు పడుతున్నాం.

పాతికేళ్ల క్రితం వరకు నక్కల కాల్వకు పుష్కలం గా నీరు వచ్చేది. తరువా త కాలంలో భూముల ధరలు పెరిగి కాల్వను ఆక్రమించడం మొదలైంది. ప్రస్తుతం కాల్వ మొదటిలో కిలోమీటరు మా త్రమే కాల్వ మిగిలింది. ఆక్రమణదారులను ప్రశ్నిస్తే ఘర్షణలకు దిగుతున్నారు. ఈ కాల్వ పరిధిలో నాకు రెండున్నర ఎకరాల పొలం ఉంది. సాగు నీరు రాక లక్ష రూపాయలు ఖర్చు చేసి బావి తీయించా. చుట్టుప్రక్కల రైతులు విపరీతంగా బోర్లు వేయడంతో బావి ఎండింది. మరో లక్ష వెచ్చించి మూడు బోర్లు వేయించినా చుక్క నీరు రాలేదు. భారీగా నష్టపోయా. ఈ పరిస్థితుల్లో పంటలు పండించడం చాలాకష్టంగా మారింది. వర్షాలు బాగా పడినప్పుడే సాగు చేస్తున్నాం. కాల్వ పునరుద్ధరణకు అధికారులు చర్యలు తీసుకోవాలి.

- సయ్యద్‌, రైతు, త్రిపురారం

Updated Date - Jun 08 , 2025 | 12:22 AM