సామాజిక బాధ్యతగా ఎలకి్ట్రక్ బస్సులు
ABN, Publish Date - Jun 10 , 2025 | 12:38 AM
సామాన్యుల రవాణా అవసరాలు తీరుస్తూనే పర్యావరణ పరిరక్షణలో భాగ ంగా సామాజిక బాధ్యతగా ఆర్టీసీలోకి పెద్దసంఖ్యలో ఎలకి్ట్రక్ బస్సులను తీసుకువస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు.
ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్కమార్క
సూర్యాపేట అర్బన, జూన 9 (ఆంధ్రజ్యోతి): సామాన్యుల రవాణా అవసరాలు తీరుస్తూనే పర్యావరణ పరిరక్షణలో భాగ ంగా సామాజిక బాధ్యతగా ఆర్టీసీలోకి పెద్దసంఖ్యలో ఎలకి్ట్రక్ బస్సులను తీసుకువస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో 45 ఎలక్ర్టిక్ బస్సులను శాసనమండలి చైర్మన గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి సోమవా రం ప్రారంభించి మాట్లాడారు. సూర్యాపేట డిపోకు 79 ఎలక్ర్టిక్ బస్సులను మంజూరు చేయగా వాటిలో 7 డీలక్స్, 72 ఎక్స్‌ప్రె్‌సలు ఉన్నాయని, ప్రస్తుతం 45 ఎక్స్‌ప్రెస్ బస్సులను ప్రారంభించామన్నారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క బస్సు కూడా కొనుగోలు చేయలేదని, ఒక్క ఉద్యోగ నియామకం చేపట్టలేని పరిస్థితి ఉండేదన్నారు. ప్రస్తుతం వేలాది బస్సుల కొనుగోలు, వేలాది ఉద్యోగ నియామకాలు చేపట్టామన్నారు. ఆడపడుచులందరినీ మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా ఉచితంగా తీసుకెళ్తున్నామన్నారు. దీని ద్వారా ప్రతిరోజూ రూ.6.88 కోట్లు ఆడపడుచులు ఆదా చేస్తున్నారని, ఆ డబ్బులను ప్రభుత్వం నేరుగా ఆర్టీసీకి జమచేస్తుందన్నారు. దీంతో ఆర్టీసీ లాభాల బాటలో నడుస్తుందన్నారు. ఇప్పటివరకు 182 కోట్ల మంది మహిళలు జీరో టికెట్‌పై ప్రయాణించారని, ప్రభుత్వం ఆర్టీసీకి సుమారు రూ.6200 కోట్లు చెల్లించిందన్నారు. ఆర్టీసీ అభివృద్ధి అక్కాచెల్లెల ఆశీర్వాదం, ప్రభుత్వ నిర్ణయం మహాలక్ష్మి పథకంతో సాధ్యమవుతుందన్నారు.
ఆడబిడ్డలకు అండగా ప్రభుత్వం : శాసనమండలి చైర్మన గుత్తా
మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఉచిత సేవలు అందించి ఆర్థికంగా ఆడబిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని శాసన మండలి చైర్మన గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలుష్యం నుంచి వాతావరణాన్ని కాపాడుకునేందుకు ఎలక్ర్టిక్ బస్సులను అందిస్తున్నాయన్నారు.
ఎలకి్ట్రక్ బస్సులతో పర్యావరణ పరిరక్షణ : మంత్రి పొన్నం
ఎలక్ర్టిక్ బస్సులతో పర్యావరణాన్ని పరిరక్షించవచ్చునని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. చుట్టుముట్టు సూర్యాపేట నట్టనడుమ నల్లగొండ అంటూ తెలంగాణ సాయుధ పోరాటాన్ని గుర్తుచేసుకుంటూ ప్రజా ప్రభుత్వంలో మారుతున్న కాలానికి అనుగుణంగా కార్మికుల సంక్షేమం కోరుకుంటు నేడు అన్ని డిపోల్లోని ప్రాంతాల వారికి ఎలక్ర్టిక్ బస్సులు నడిపేందుకు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఆర్టీసీకి నెలకు రూ.330 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ తేజ్‌సనందలాల్ పవార్, ఎస్పీ నర్సింహ, ఆర్టీసీ ఈడీ కుశాల్‌ఖాన, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, ఎమ్మెల్యేలు నలమాద పద్మావతిరెడ్డి, మందుల సామేల్, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన పటేల్ రమే్‌షరెడ్డి, రాష్ట్ర వ్యవసాయ సంక్షేమ కమిషన మెంబర్ చెవిటి వెంకన్నయాదవ్, ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన కొప్పుల వేణారెడ్డి, వైస్ చైర్మన గట్టు శ్రీనివాస్, ఆర్టీసీ నల్లగొండ ఆర్‌ఎం జానరెడ్డి, డీఎం లక్ష్మీనారాయణ, డిప్యూటీ ఆర్‌ఎంలు సుచరిత, భీంరెడ్డి, సీఐ సైదులు, ఏఎంఎఫ్ వీరాచారి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పోతు భాస్కర్ పాల్గొన్నారు.
Updated Date - Jun 10 , 2025 | 12:38 AM